E-Paper
Advertisement

Parameter:-మట్టి ఆరోగ్యాన్ని తెలుసుకునే సెన్సార్..

Parameter:-మట్టి ఆరోగ్యాన్ని తెలుసుకునే సెన్సార్..
Advertisement

Parameter:-ప్రకృతి సిద్ధంగా మానవాళికి వరంగా అందిన నేల కూడా కాలుష్యం బారినపడక తప్పడం లేదు. చాలావరకు దేశాల్లో మట్టిని వ్యవసాయం కోసమే ఉపయోగించినా.. వ్యవసాయంపైన ఆధారపడుతున్న ప్రైవేట్ సంస్థలు మాత్రం మట్టి తమకు ఎంత ఇవ్వగలదో అంతకంటే ఎక్కువ దానినుండి పొందాలని చూస్తున్నారు. దీనివల్ల మట్టి ఆరోగ్యం దెబ్బతింటోంది. అయితే మట్టి ఆరోగ్యాన్ని పెంపొందించడం కోసం కొందరు శాస్త్రవేత్తలు మందుకొచ్చారు.

మట్టిలో ఉష్ణోగ్రత, నైట్రోజన్ లెవల్స్‌ను పరీక్షించడం వల్ల అది ఎంత ఆరోగ్యంగా ఉందో తెలుస్తుంది. అంతే కాకుండా ఈ విషయాలు తెలుసుకోవడం వ్యవసాయానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ ఉష్ణోగ్రతను, నైట్రోజన్ లెవల్స్‌ను విడివిడిగా పరీక్షించడం కష్టం. ఇప్పటివరకు అలాంటి ప్రక్రియ ఎప్పుడూ జరగలేదు. అమెరికాలో పనిచేసే ఓ జూనియర్ లెక్చరర్ దీనికి పరిష్కారాన్ని కనుక్కున్నాడు. ఉష్ణోగ్రతను, నైట్రోజన్ లెవెల్స్‌ను విడివిడిగా స్టడీ చేయగల ఓ మల్టీ ప్యారమీటర్ సెన్సార్‌ను తయారు చేశాడు.

Advertisement

లారీ చెంగ్ తయారు చేసిన ఈ మల్టీ ప్యారమీటర్ సెన్సార్ కేవలం ఉష్ణోగ్రతను, నైట్రోజన్ లెవెల్స్‌ను విడివిడిగా మాత్రమే కాకుండా కరెక్ట్‌గా కనిపెట్టడానికి కూడా ఉపయోగపడతాయని ఆయన అన్నారు. వ్యవసాయం కోసం, పంటలు బాగా పండడం కోసం ఉష్ణోగ్రతను, నైట్రోజన్ లెవల్స్‌ను విడివిడిగా కనిపెట్టడం ముఖ్యమని తెలిపారు. అంతే కాకుండా కాలుష్యాన్ని తగ్గించడం కోసం కూడా ఇది ఉపయోగకరమన్నారు.

మామూలుగా నైట్రోజన్‌ను వ్యవసాయంలో ఎరువులాగా ఉపయోగిస్తుంటారు. పంట బాగా పండేలా మాత్రమే దీనిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఎక్కువ మోతాదులో ఉపయోగించినా కూడా ప్రమాదకరమే. అలా తక్కువ మోతాదు అనేది పంట బాగా పండకుండా ఉండడానికి కారణమవుతుంది. ఎక్కువ మోదాదు ఉపయోగిస్తే.. చెట్లు కాలిపోయి, హానికరమైన నైట్రోజన్ గ్యాస్ అనేది గాలిలో కలిసి అవకాశం ఉంది. అందుకే నైట్రైజన్‌ను ఎంత ఉపయోగించాలి అని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

Advertisement

నైట్రోజన్ ఎలా అయితే పంట మీద ప్రభావం చూపిస్తుందో.. ఉష్ణోగ్రత కూడా అంతే ప్రభావం చూపిస్తుంది. రైతులు ఎల్లప్పుడూ తమ పంటను కనిపెడుతూ ఉన్నా లేకపోయినా లారీ చెంగ్ తయారు చేసిన ఈ సెన్సార్ మాత్రం వారికి మట్టి గురించి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉంటుంది. దాన్ని బట్టి వారు ఎరువుల వినియోగాన్ని చేయవచ్చు. వ్యవసాయానికి ఉపయోగపడే ఇలాంటి పరికరాన్ని తయారు చేసినందుకు లారీ చెంగ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

చంద్రుడిపై రోల్స్ రాయిస్ ప్రయోగం.. అండగా యూకే..

for more updates follow this link:-bigtv

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×