E-Paper
Advertisement

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!
Advertisement

Best Projectors 2026: ఇంట్లోనే కూర్చుని సిల్వర్ స్క్రీన్ మ్యాజిక్‌ను ఎంజాయ్ చేయాలని ఉందా? అయితే పెద్ద సైజు టీవీల ట్రెండ్ ఎప్పుడో మారిపోయింది! ఇప్పుడు అంతా స్మార్ట్ ప్రాజెక్టర్ల హవా నడుస్తోంది.అచ్చం సినిమా హాల్ లాంటి అద్భుతమైన విజువల్స్, నెక్స్ట్ లెవెల్ 4K క్లారిటీతో మీ లివింగ్ రూమ్‌ను మినీ థియేటర్‌గా మార్చేయడానికి 2026 మార్కెట్‌ను షేక్ చేస్తున్న టాప్-7 అల్టిమేట్ ప్రాజెక్టర్లు వచ్చేసాయి. అటు పాకెట్ ఫ్రెండ్లీ పోర్టబుల్ మోడల్స్ నుంచి ఇటు హై-ఎండ్ హోమ్ సినిమా బీస్ట్స్ వరకు.. బెస్ట్ ప్రొజెక్టర్ల ఫీచర్లు ఏంటీ, వాటి ధరలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టాప్ 7 స్ట్ ప్రొజెక్టర్లు:

1.Sony Bravia Projector 9:

హై-ఎండ్ హోమ్ థియేటర్ లవర్స్ కోసం సోని సంస్థ తీసుకొచ్చిన అద్భుతమైన మాస్టర్ పీస్ ఇది. అసాధారణమైన HDR పర్ఫామెన్స్ , అంతే కాకుండా అద్భుతమైన ఇమేజ్ ప్రాసెసింగ్ తో పాటు అత్యధిక ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌తో ఇది వస్తుంది. కాబట్టి చీకటి గదిలోనే కాకుండా ఎలాంటి రూమ్స్ లోనైనా కూడా ఇది స్పష్టమైన విజువల్స్ ఇస్తుంది. బెస్ట్ థియేటర్ ఫీల్ కావాలి అంతే కాకుండా బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతే కాకుండా విజువల్స్ రియల్స్ ఫీల్ ఇచ్చే లాగా ఉండాలనుకునే వారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

Advertisement

ధర: సుమారు రూ. 4,50,000 నుంచి ప్రారంభం

2. Samsung Premiere 9:

ట్రిపుల్ లేజర్ టెక్నాలజీతో వస్తున్న ఈ అల్ట్రా షార్ట్-త్రో ప్రాజెక్టర్ గోడకు అతి దగ్గరగా పెట్టినా భారీ స్క్రీన్‌ను ప్రొజెక్ట్ చేస్తుంది. అంతే కాకుండా అద్భుతమైన కలర్ అక్యురసీ, డాల్బీ విజన్ సపోర్ట్, పవర్ ఫుల్ బిల్ట్-ఇన్ స్పీకర్లు దీని ప్రత్యేకతలు. బెస్ట్ ఫీచర్లు కావాలనుకునే వారికి ఇలాంటి మోడల్స్ ఫర్ఫెక్ట్ అని చెప్పొచ్చు.

Advertisement

ధర: సుమారు రూ.3,50,000

3.BenQ GV50):

పోర్టబుల్ , కాంపాక్ట్ డిజైన్ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. బ్యాటరీ కన్వీనియన్స్, గూగుల్ టీవీ స్మార్ట్ ప్లాట్‌ఫారమ్ , లాంగ్ లాస్టింగ్ లేజర్ లైట్ సోర్స్‌తో ఇది వస్తుంది. కాబట్టి ప్రయాణాల్లో లేదా రూమ్స్‌ మార్చుకునేటప్పుడు దీన్ని ఈజీగా తీసుకెళ్లొచ్చు.

ధర: సుమారు రూ.85,000

4. BenQ X3100i:

గేమింగ్ లవర్స్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన గేమింగ్ ప్రాజెక్టర్ ఇది. అత్యంత తక్కువ ఇన్‌పుట్ లాగ్, అద్భుతమైన 4K HDR పిక్చర్ క్వాలిటీ , బ్రైట్ ఎల్ఈడీ లైట్ సోర్స్ దీని సొంతం. వీడియో గేమ్‌లు ఆడే వారికి ఇది అద్భుతమైన ఫీల్ ఇస్తుంది. అంతే కాకుండా గేమ్స్ ఎక్కువగా ఇష్టపడే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ధర: సుమారు రూ. 1,49,990

5.LS12000 (Epson Pro Cinema LS12000):

ట్రూ 4K రిజల్యూషన్, లేజర్ టెక్నాలజీతో పని చేసే ఈ ప్రాజెక్టర్ సినిమా థియేటర్ ఫీల్ సరికొత్త స్థాయికి తీసుకెళ్తుంది. లాంగ్-లాస్టింగ్ లేజర్ ఇంజిన్, వైడ్ కలర్ గ్యామట్ దీని సొంతం. సినిమా చూసేటప్పుడు ప్రతి చిన్న డీటెయిల్ స్పష్టంగా కనిపిస్తుంది.

ధర: సుమారు రూ.4,00,000

6.XGIMI Titan Noir Pro:

అద్భుతమైన బ్రైట్‌నెస్ , కాంట్రాస్ట్ రేషియో కోరుకునేవారికి ఇది టాప్-ఓవరాల్ ఛాయిస్. దీని ఫ్లెక్సిబుల్ జూమ్ , లెన్స్ షిప్ట్ ఆప్షన్ల వల్ల ఏ సైజు రూమ్ లోనైనా దీన్ని సెట్ చేసుకోవడం చాలా ఈజీ.

ధర: సుమారు రూ. 2,99,999

Also Read: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్..వాషింగ్ మెషీన్లపై అదిరిపోయే డిస్కౌంట్‌లు!

7. Anker Nebula Mars 3 Air:

బడ్జెట్ ధరలో మంచి పోర్టబుల్ ప్రాజెక్టర్ కావాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆప్షన్. గూగుల్ టీవీ సపోర్ట్, చక్కని కలర్ , కాంట్రాస్ట్ తో ఇది వస్తుంది. చిన్న కుటుంబాలకు అంతే కాకుండా బడ్జెట్ యూజర్లకు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు.

ధర: సుమారు రూ. 5,000

మీ బడ్జెట్ , అవసరాలకు తగినట్లుగా ప్రాజెక్టర్‌ను ఎంచుకోవడం ముఖ్యం. మీరు గేమింగ్ కోసం అయితే బెన్క్యూ మోడల్స్, పోర్టబిలిటీ కోసం అయితే.. అంకెర్ లేదా బెన్క్యూ GV50 ని కొనండి. హోమ్ థియేటర్ ఫీల్ పూర్తిగా ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం సోని లేదా శామ్‌సంగ్ ప్రీమియం మోడల్స్ బెస్ట్ ఛాయిస్!

Related News

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

నా సినిమాలను కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. సందీప్ కిషన్ సంచలన పోస్ట్!

రూ.46 కోట్ల చెక్కు వివాదం… సీసీబీ విచారణకు హాజరైన రాధ!

Karthika Deepam 2 Serial Today Episode October 1st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: టిఫిన్ బండి నడిపేందుకు శివనారాయణ రెడీ – మాలిని గురించి జ్యోత్స్నకు నిజం తెలుస్తుందా..?             

Big Stories

Advertisement
×