E-Paper
Advertisement

Railway Jobs: 5,696 ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు

Railway Jobs: 5,696 ప్రభుత్వ ఉద్యోగాలకు వయో పరిమితి పెంపు
Advertisement

Railway Jobs: రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా భారతీయ రైల్వేలో మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులను భర్తీ చేస్తోన్నారు. అభ్యర్థులు ఫిబ్రవరి 19లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలని నోటిఫికేషన్‌లో తెలిపింది.

అయితే ఇప్పుడు ఆ వయో పరిమితిలో రైల్వే మంత్రిత్వశాఖ కీలక మార్పు చేసింది. గతంలో ఇచ్చిన వయో పరిమితిలో మార్పులు చేసింది. ఈ మేరకు ముందుగా 18 నుంచి 30 ఏళ్లు పేర్కొనగా.. ఇప్పుడు దాన్ని 33 ఏళ్లకు పెంచింది. ఇలా చేయడం ద్వారా మరికొంత మందికి అవకాశం లభిస్తుందని తెలిపింది. దీంతో ఇప్పుడు జులై 1,2024 నాటికి 18 నుంచి 33 ఏళ్ల లోపు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

Advertisement

దీంతోపాటు పరీక్షల టైం లైన్‌ను ప్రకటించింది. ఈ మేరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT-1) జూన్ లేదా ఆగస్టు మధ్య జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రెండో దశ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT-2) సెప్టెంబర్‌లో నిర్వహించే ఛాన్స్ ఉందని పేర్కొంది. అలాగే ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) నవంబర్‌లో నిర్వహిస్తారు. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను నవంబర్/డిసెంబర్‌లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.

Tags

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×