BigTV English

India vs England 2nd Test : టీమ్ ఇండియాలో.. ఆ  11 మంది ఎవరు?

India vs England 2nd Test : టీమ్ ఇండియాలో.. ఆ  11 మంది ఎవరు?
India vs England 2nd Test

India vs England 2nd Test(latest sports news telugu)


విశాఖలో ఆడే రెండో టెస్ట్ లో టీమ్ ఇండియా ఫైనల్ స్క్వాడ్ల లో ఎవరు ఉంటారనేది పెద్ద పజిల్ గా మారింది. శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరు జట్టుకి భారంగా ఉన్నారు. నిజానికి మొదటిటెస్ట్ లో వారిద్దరూ కరెక్టుగా ఆడి ఉంటే, టీమ్ ఇండియా 28 పరుగుల స్వల్ప తేడాతో ఓడిపోయేది కాదని అంటున్నారు.

టెయిల్ ఎండర్స్ నలుగురు అంత పట్టుదలగా ఆడితే, అంతటి బ్యాటింగ్ ఎక్స్ పర్ట్ లు అయి ఉండి, వీళ్లిలా బ్యాట్ లు ఎత్తేయడం ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నారు. అందరూ వీరినే వేలెత్తి చూపిస్తున్నారు గానీ, ఇప్పుడు నొప్పి రోహిత్ శర్మని కూడా తాకుతోంది. నిజానికి సీనియర్ అయిఉండి, కెప్టెన్ అయి ఉండి జట్టు కష్టకాలంలో భారీ ఇన్నింగ్స్ లు ఆడాల్సి ఉండి, ఆ స్థాయిలో ఆడటం లేదనే విమర్శలున్నాయి.


ఇప్పుడు శుభ్ మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరికి కూడా రెండో టెస్ట్ ఆఖరి అవకాశమని అంటున్నారు. ఇక్కడ కూడా ఫెయిల్ అయితే మళ్లీ వీళ్లు దేశవాళి క్రికెట్ లోనో, లేదంటే ఐపీఎల్ లో నిరూపించుకుని జట్టులోకి రావల్సి ఉంటుంది. ఇక రవీంద్ర జడేజా ప్లేస్ లో వాషింగ్టన్ సుందర్ వస్తాడని అంటున్నారు. అలాగే రాహుల్ ప్లేస్ లో సర్ఫరాజ్ ఖాన్ ఆడుతాడని అంటున్నారు. మరి అలాంటప్పుడు రజత్ పటీదార్ ను తొందరపడి ఎందుకు తీసుకున్నారని నెట్టింట ప్రశ్నలు వస్తున్నాయి..

జట్టులో 15మందిని నింపడానికైతే, మరి విరాట్ కొహ్లీ వస్తే ఎలాగని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో నలుగురు స్పిన్నర్లతో ఆడతామని ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్ చెప్పడం, ఇప్పుడందరిని ఆలోచనలో పడేస్తోంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా కూడా నలుగురితో వస్తుందా? అనే ప్రశ్న ఉదయిస్తోంది. మొదటి టెస్ట్ లో సిరాజ్ కి పెద్దగా బౌలింగ్ ఇవ్వలేదు.

అందువల్ల రెండో టెస్ట్ లో తనని పక్కనపెడతారని అంటున్నారు.  ఇప్పుడు నలుగురు స్పిన్నర్లు అంటే అశ్విన్, కులదీప్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉండవచ్చునని చెబుతున్నారు. ఇక చివరికి 11మందిలో ఎవరుంటారు? ఎవరు బెంచ్ మీద ఉంటారనేది ప్రశ్నార్థకంగా మారింది.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×