E-Paper
Advertisement

RBI On EMI missing : ఇష్టమొచ్చినట్టు జరిమానాలు కుదరవు.. ఈఎంఐ మిస్సింగ్స్‌పై ఆర్‌బీఐ మార్గదర్శకాలు

RBI On EMI missing : ఇష్టమొచ్చినట్టు జరిమానాలు కుదరవు.. ఈఎంఐ మిస్సింగ్స్‌పై ఆర్‌బీఐ మార్గదర్శకాలు
Advertisement
RBI On EMI missing

RBI On EMI missing : పొరపాటున ఈఎంఐ మిస్ అయితే చాలు.. బ్యాంకులు ఇష్టమొచ్చిన పెనాల్టీ విధిస్తుంటాయి. కస్టమర్ల నుంచి వడ్డీ దండుకోవాలనే కోణంలోంచి ఆలోచిస్తుంటాయి. దీంతో బ్యాంకుల ఇష్టారీతి జరిమానాలపై ఆర్భీఐ ఫైర్ అవుతోంది. దీనికోసం కొన్ని గైడ్ లైన్స్ ఇష్యూ చేసింది. ఈ ముసాయిదా మార్గదర్శకాలపై అభిప్రాయాలు చెప్పాలంటూ మే 15 వరకు గడువు ఇచ్చింది.

లోన్ తీసుకున్న వ్యక్తి చెల్లింపులో డిఫాల్ట్‌ అయినా, లోన్ అమౌంట్ వాడుకోవడంలో నిబంధనలు పాటించకపోయినా.. వడ్డీ రేట్లపై పెనాల్టీ వడ్డీ రేట్లను విధిస్తున్నాయి బ్యాంకులు. ఈ తరహా పెనాల్టీలను ఆదాయాన్ని పెంచుకునే సాధనంగా అధిక వడ్డీ వసూళ్లకు పాల్పడుతున్నాయి. దీంతో ఆర్‌ఈలు అదనపు వడ్డీ రేటును విధించరాదని తెలిపింది.

Advertisement

అకౌంట్ హోల్డర్ డిఫాల్ట్‌ కావడం లేదా లోన్ కాంట్రాక్ట్ కండీషన్స్ పాటించకపోతే గనక.. వాటిని అపరాధ చార్జీలుగానే పరిగణించాలి తప్ప వడ్డీగా వసూలు చేయకూడదని తెలిపింది. పైగా ఇప్పుడు విధిస్తున్న పెనాల్టీ చార్జీలపై మళ్లీ వడ్డీ వేయకూడదనేది ప్రధాన నిబంధన.

అకౌంట్ హోల్డర్లకు ఆర్‌ఈలు వాయిదా చెల్లింపుల రిమైండర్లు పంపించేటప్పుడు పెనాల్టీ చార్జీలను సైతం తెలియజేయాలి. ఈ ముసాయిదా మార్గదర్శకాలు క్రెడిట్‌ కార్డ్‌లకు వర్తించవని, లోన్లకు మాత్రమే పరిమితం అని ఆర్బీఐ స్పష్టం చేసింది. 

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×