BigTV English

China satellite to spy on India : ఇండియాపై నిఘా కోసం చైనా శాటిలైట్ ప్రయోగం..

China  satellite to spy on India : ఇండియాపై నిఘా కోసం చైనా శాటిలైట్ ప్రయోగం..
China  satellite to spy on India

China satellite to spy on India : సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో చైనా అందుకోలేనంత వేగంగా వెళుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే అగ్రరాజ్యం అమెరికా సైతం చైనాను అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. కానీ దానివల్ల చైనాపై ఎలాంటి ప్రభావం చూసుకుంటోంది. దాంతో పాటు పరిశోధనలలో కూడా వేగం పెంచింది. తాజాగా మనిషి అవసరమే లేని శాటిలైట్‌ను తయారు చేయడంతో పాటు ప్రత్యేకంగా అది ఇండియాపై ఫోకస్ పెట్టేలా చేయడానికి సిద్ధపడింది.


కేవలం ఇండియా, జపాన్‌ను మాత్రమే ప్రత్యేకంగా గమనిస్తూ ఉండడం కోసం చైనా.. ఏఐతో కంట్రోల్ చేయబడే ఒక కొత్త రకమైన శాటిలైట్‌ను తయారు చేసిందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. చైనాకు చెందిన స్టేట్ కీ లేబురేటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ ఇన్ సర్వైవింగ్, మ్యాపింగ్ అండ్ రిమోట్ సెన్సింగ్ (లైస్మార్స్) అనే సంస్థ కేవలం ఏఐతో పనిచేసే క్విమింగ్జింగ్ 1 అనే రిమోటం సెన్సింగ్ శాటిలైట్‌ను తయారు చేసిందని సమాచారం.

ఇండియాలో ఆర్మీ యూనిట్స్ ఉన్న ప్రాంతాలను మాత్రమే ఈ ఏఐ శాటిలైట్ గమనిస్తూ ఉండేలాగా డిజైన్ చేయబడిందని అంతర్జాతీయ మీడియా ప్రచారం చేస్తోంది. 2020-2021లో గల్వాన్ వేలీలో ఇండియాకు, చైనాకు జరిగిన యుద్ధమే ఈ నిర్ణయానికి కారణమని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు అమెరికా నేవల్ వెజల్స్ ఆగే జపాన్ పోర్ట్‌పై కూడా ఈ ఏఐ శాటిలైట్ ద్వారా కన్నేసి ఉంచాలని చైనా నిర్ణయించుకుంది.


చైనా.. ప్రస్తుతం ఏఐ శాటిలైట్‌తో ఇండియా, జపాన్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేసింది అనే విషయం ఇంకా క్లారిటీ లేదు. కొన్ని రిపోర్టుల ప్రకారం క్విమింగ్జింగ్ 1 అనేది వూహాన్ విశ్వవిద్యాలయం తయారు చేసిన ఒక ప్రయోగాత్మక శాటిలైట్ మాత్రమే అని చెప్తున్నారు. ఇప్పటికే నేలపై క్విమింగ్జింగ్ 1 శాటిలైట్‌పై చేసిన ప్రయోగాలు సక్సెస్‌ఫుల్ అయ్యాయి. ఏ మనిషి సాయం లేకుండా ఈ శాటిలైట్ దానికి ఇచ్చిన టాస్కులను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేస్తుందా లేదా తెలుసుకోవడమే శాస్త్రవేత్తల ముఖ్య లక్ష్యం.

ప్రస్తుతం ఈ ఏఐ శాటిలైట్ కొంతవరకు మనిషిపై ఆధారపడి పనిచేస్తోంది. ఏదైనా యాక్షన్ తీసుకునే ముందు మనిషి అనుమతి తీసుకుంటోంది. ఇప్పటివరకు చైనా తయారు చేసిన రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్‌ను మరింత మెరుగు చేయడం కోసమే వాటికి ఏఐ సామర్థ్యాన్ని అందించినట్టు తెలుస్తోంది. ఈ ఏఐకు ట్రెయినింగ్ ఇవ్వడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న డేటా అంతా కలెక్ట్ చేశారు. ఏఐ అనేది తిరిగి మాట్లాడకపోయిన మనిషి ఆదేశాల ప్రకారం పనిచేసేలాగా డిజైన్ చేశారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×