E-Paper
Advertisement

ONGC : మంగుళూరు రిఫైనరీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు..

ONGC : మంగుళూరు రిఫైనరీలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులు..
Advertisement

ONGC : కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరులో ఉన్న ఓఎన్‌జీసీ అనుబంధ సంస్థ- మంగళూరు రిఫైనరీ అండ్‌ పెట్రోకెమికల్స్‌ లిమిటెడ్‌ (ఎంఆర్‌పీఎల్‌)లో అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలున్నాయి. మొత్తం 78 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

కెమికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కెమిస్ట్రీ విభాగాల్లో ఖాళీలున్నాయి. సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీతోపాటు గేట్‌ 2022 స్కోరు తప్పనిసరిగా ఉండాలి. ఉద్యోగానికి దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 27 సంవత్సరాలు మించకూడదు. దరఖాస్తు రుసుంను రూ.118 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రుసుం చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. గేట్‌-2022 మార్కులు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులను 2023 జనవరి 15లోపు పంపించాలి. కింద ఉన్న వైబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపించాలి.

Advertisement

విభాగాలు: కెమికల్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌, కంప్యూటర్‌ సైన్స్‌, కెమిస్ట్రీ
అర్హత: సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీతో పాటు గేట్‌ 2022 స్కోరు తప్పనిసరి
వయసు: 27 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు రుసుం: రూ.118 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు రుసుం చెల్లింపు నుంచి మినహాయింపు
ఎంపిక: గేట్‌-2022 మార్కులు, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 15/01/2023
వెబ్‌సైట్‌: https://www.mrpl.co.in/careers

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×