BigTV English
Advertisement

lemon Lamp : రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదా..?

lemon Lamp : రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించకూడదా..?

lemon Lamp : రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించడం వల్ల కలిగే ఫలితాల గురించి మంత్రశాస్త్రంలో ఎక్కడా లేదు. ఈమధ్య కాలంలో రకరకాల భావన పెరిగిపోయాయి. భయంతో కొంతమంది నిమ్మకాయ దీపాలు వెలిగిస్తున్నారు . నిమ్మకాయను రెండు చెక్కలు చేసి డొప్పలో ఉన్నదంతా ఖాళీ చేసి అందులో ఆవు నెయ్యి కాని నూనె కానీ పోసి ఒత్తులు వేసి వెలిగించి దీపారాధన చేయడమే నిమ్మకాయ దీపాల పూజ. ఈ దీపారాధన కూడా గతంలో లేవు. కలియుగంలో మాత్రమే ఇలాంటి పూజలు చేస్తున్నారు.


మార్గశిర మాసంలోనీ, కార్తీక మాసంలో కానీ శివప్రీతి కోసం వెలిగించమన్నారు. శివుడు చుట్టు నవగ్రహాలు పూజలందుకంటూ ఉంటాయి. సూర్యుడు, చంద్రుడు,అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహుల్, కేతువు, ఈ మొత్తం 9 గ్రహాలు కాశీ వెళ్లి శివుడ్నిపూజించి అనేక రకాలుగా మెప్పించి తమ పేరు మీద లింగాలు ప్రతిష్టించి అప్పుడు గ్రహాలయ్యాయి.

శివుడికి నిమ్మకాయలో వెలిగించిన దీపమంటే ఇష్టం. మేం ఏ పరమాత్మను పూజించి గ్రహాలయ్యామో ఆపరమాత్ముడికి ఇష్టమైన దీపం మా ముందు కూడా వెలిగిస్తే ఈ దీపాన్ని కూడా మాస్వామికి సమర్పించేనట్టేనని వారు భావించి మనల్ని అనుగహిస్తారు కనుక అప్పటి నుంచి నవగ్రహాల ముందు నిమ్మకాయ డొప్పల మీద దీపాలు వెలిగించే సంప్రదాయం ఏర్పడింది.


రాహువు పేరు చెప్పి రాహు కాలంలో దీపారాధన చేయడం ఏమీ దోషం కాదు. ఆ కాలం అధిష్టాన దేవతగా రాహువు ఉంటాడు. సోమవారం నాడు ఉదయం ఏడున్నర గంటల నుంచి 9 గంటల వరకు రాహుకాలం ఉంటుంది. ఆ కాలంలో ఈ నిమ్మకాయ దీపాన్ని వెలిగిస్తే ఇంకా ఎక్కువ మంచి ఫలితం వస్తుంది.

Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×