BigTV English

Rekha Jhunjhunwala:2 వారాల్లో రూ.1,000 కోట్లు లాభం.. ఎవరికంటే..

Rekha Jhunjhunwala:2 వారాల్లో రూ.1,000 కోట్లు లాభం.. ఎవరికంటే..

Rekha Jhunjhunwala:స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి పరిచయం అక్కరలేని పేరు రాకేశ్ ఝున్‌ఝన్‌వాలా. దురదృష్టవశాత్తూ అనారోగ్యంతో గతేడాది ఆగస్టులో కన్నుమూశారాయన. రాకేశ్ లేకపోయినా… ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు… ఆయన భార్య రేఖా ఝున్‌ఝన్‌వాలా. పెట్టుబడుల విషయంలో భర్తకు ఏ మాత్రం తీసిపోకుండా రాణిస్తూ… లాభాల్లో దూసుకెళ్తున్నారు. టైటాన్ కంపెనీలో ఉన్న షేర్ల ద్వారా… గత రెండు వారాల్లోనే రేఖ సంపద రూ.1000 కోట్లు పెరిగింది.


టైటాన్ షేర్ హోల్డింగ్ డేటా ప్రకారం… 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో ఆ కంపెనీలో రేఖా ఝున్‌ఝన్‌వాలా 4,58,95,970 షేర్లు కలిగి ఉన్నారు. టైటాన్ షేరు గత రెండు వారాల్లో రూ.2,310 నుంచి రూ.2,535కు పెరిగింది. అంటే ఒక్కో షేరుపై రూ.225 రూపాయలు పెరిగింది. దాంతో… టైటాన్ కంపెనీలో రేఖా ఝున్‌ఝన్‌వాలా వాటా విలువ ఏకంగా రూ.1000 కోట్లు పెరిగింది. ప్రస్తుతం టైటాన్ కంపెనీలో ఆమె కలిగి ఉన్న షేర్ల విలువ మొత్తం రూ.11,635 కోట్లకు చేరింది.

టైటాన్ షేరు విలువ బాగా పెరగడంతో… 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలోనే తన వాటా నుంచి 0.37 శాతానికి సమానమైన 33,05,000 షేర్లను అమ్మేశారు… రేఖా ఝున్‌ఝన్‌వాలా. లేకపోతే టైటాన్ కంపెనీలో ఆమెకు మరో రూ.838 కోట్ల విలువైన షేర్లు ఉండేవి.


రాకేశ్ కన్నుమూసే నాటికి టైటాన్ కంపెనీలో ఆయనకు 3,41,77,395 షేర్లు ఉండేవి. ఆయన భార్య రేఖకు 1,50,23,575 షేర్లు ఉండేవి. భర్త మరణం తర్వాత రాకేశ్ షేర్లు కూడా ఆయన భార్య రేఖా ఝున్‌ఝన్‌వాలా పేరు మీదికి బదిలీ అయ్యాయి. ప్రస్తుతం టైటాన్లో రేఖ మొత్తం 5.17 శాతం వాటాను కలిగి ఉన్నారు. భర్త మరణం తర్వాత కూడా పెట్టుబడుల పోర్ట్ ఫోలియోను చక్కగా నిర్వహిస్తూ… భర్తకు తగ్గ భార్య అనిపించుకుంటున్నారు… రేఖా ఝున్‌ఝన్‌వాలా.

Gold Rates: వామ్మో.. పెరిగిన బంగారం ధరలు..

Twitter: మస్క్ షాకింగ్ నిర్ణయం.. భారత్‌లో ట్విట్టర్ ఆఫీస్‌లు క్లోజ్

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×