BigTV English

Lightest Paint:- తేలికైన పెయింట్.. శతాబ్దాల వరకు చెరిగిపోకుండా..

Lightest Paint:- తేలికైన పెయింట్.. శతాబ్దాల వరకు చెరిగిపోకుండా..

Lightest Paint:- కలర్స్ అంటే ఇష్టపడని వారు చాలా తక్కువమంది ఉంటారు. కొందరికి అయితే పెయింటింగ్ అనేది మంచి హాబీలాగా కూడా ఉంటుంది. ఒక్కసారి సోషల్ మీడియాలో చూస్తే.. ఇతరేతర ప్రొఫెషన్స్‌లో సెటిల్ అయ్యి కూడా పెయింటింగ్‌ మీద ఆసక్తితో తమ సొంత ఇంటినే అందంగా తయారు చేసుకుంటున్న వారు కూడా ఉన్నారు. కానీ మంచి క్వాలిటీ పెయింట్ కావాలంటే దానికి చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాంటి సమస్యకు ఈ కొత్త రకం పెయింట్ చెక్ పెట్టనుంది.


ఈరోజుల్లో ప్రతీ వస్తువు కమర్షియల్ అయిపోయింది. ప్రతీది కాస్ట్‌లీ అయిపోయింది. అలాగే పెయింట్ కూడా. పెయింట్ కలర్స్ సంస్థలపై కూడా ఈ మధ్య కాలంలో పోటీ ఎక్కువయిపోయింది. అందుకే ఎంతో ఖర్చు పెట్టి మరీ యాడ్స్ పేరుతో అందరికీ దగ్గరవ్వాలని చూస్తున్నాయి సంస్థలు. అలాంటి సంస్థలో పెయింట్ కూడా చాలా కాస్ట్‌లీగానే ఉంటుంది. అలా కాకుండా ఎక్కువకాలం పోకుండా ఉండే లైట్ పెయింట్‌ను ఫ్లోరిడాకు చెందిన శాస్త్రవేత్తలు కనుక్కున్నారు.

ప్రపంచంలోనే ఇది లైట్ పెయింట్ అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మామూలుగా కలర్స్‌లో ఉపయోగించే పిగ్మెంట్స్ ఏమీ ఇందులో ఉపయోగించకుండా తయారు చేశామన్నారు. ఇది కలర్‌లెస్ మెటీరియల్స్ అయిన అల్యూమినియమ్ ఆక్సైడ్, ఆల్యూమినియమ్‌తో తయారు చేసిన పెయింట్ అని తెలిపారు. దీనికి ప్లాస్మానిక్ పెయింట్ అని పేరు కూడా పెట్టారు. ఈ పెయింట్ తయారు చేయడానికి స్ఫూర్తి సీతాకోకచిలుకలు అని బయటపెట్టారు.


మామూలుగా ఈ రోజుల్లో కలర్స్ తయారు చేయడానికి కెమికల్స్, పిగ్మెంట్స్ లాంటివి ఎన్నో ఉపయోగిస్తున్నారని, ప్లాస్మానిక్ పెయింట్‌లో అలాంటివి ఏమీ లేవన్నారు. ప్లాస్మానిక్ పెయింట్‌లో ఉపయోగించే నానోస్ట్రక్చర్స్ అనేవి లైట్‌ను ప్రతిబింబిస్తాయని తెలిపారు. కేవలం మెటల్స్, ఆక్సైడ్స్‌తో తయారు చేయడం వల్ల ప్లాస్మానిక్ కలర్స్ పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవని అన్నారు. ఇంత తేలికైన పెయింట్‌ను తయారు చేసి పరిశోధకులు కలర్ ఇంజనీరింగ్‌లోని కొత్త అధ్యాయనాన్ని మొదలుపెట్టారని కొందరు ప్రశంసిస్తున్నారు.

ఇతర కలర్స్ వాటిలోని పిగ్మెంట్స్‌ను పోగొట్టుకోగానే వెలుగును కోల్పోతాయని, ప్లాస్మానిక్ కలర్స్‌లో అలాంటిది ఏమీ జరగదని పరిశోధకులు చెప్తున్నారు. ఒక్కసారి దీనిని పెయింట్ చేసిన తర్వాత ఎన్ని శతాబ్దాలైనా ఇలాంటి ఉంటుందన్నారు. అంతే కాకుండా ఇది ఎక్కడ పెయింట్ చేస్తే అక్కడ అంతా చల్లదనంతో నిండిపోతుందని తెలిపారు. ఒక్క కిలో ప్లాస్మానిక్ పెయింట్‌తో బోయింగ్ 747 విమానాన్ని పూర్తిగా పెయింట్ చేయవచ్చని వారు బయటపెట్టారు. మామూలుగా ఈ విమానాన్ని పెయింట్ చేయాంటే 400 కిలోల కలర్ కావాల్సి ఉంటుంది.

క్యాన్సర్ పేషెంట్ల జీవితకాలాన్ని చెప్పే ఏఐ..

for more updates follow this link:-Bigtv

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×