E-Paper
Advertisement

Electric Car : రోల్స్ రాయిస్.. ఎలక్ట్రిక్ కార్ రెడీ!

Electric Car : రోల్స్ రాయిస్.. ఎలక్ట్రిక్ కార్ రెడీ!
Advertisement

Electric Car : రోల్స్ రాయిస్… ఈ పేరే రాజసానికి మారుపేరు. ఎన్నికార్లు ఉన్నా… రోల్స్ రాయిస్ ఉంటే… ఆ దర్జానే వేరని ఫీలవుతారు… వినియోగదారులు. అందుకే… కోట్ల రూపాయలు పోసి మరీ రోల్స్ రాయిస్ ను సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు రోల్స్ రాయిస్ కూడా ఎలక్ట్రిక కార్ల సెగ్మెంట్ లోకి ప్రవేశించింది.

తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది… రోల్స్ రాయిస్. స్పెక్టర్ పేరుతో లాంచ్ చేసిన ఈ కారును… అల్ట్రా లగ్జరీ ఎలక్ట్రిక్ సూపర్ కూపేగా అభివర్ణించింది… రోల్స్ రాయిస్. రెండు డోర్లు, నాలుగు సీట్లతో వస్తున్న ఈ కార్ లోపలి భాగాన్ని చాలా విలాసవంతంగా తీర్చిదిద్దారు. దీని పొడవు 5.45 మీటర్లు కాగా… వెడల్పు 2.08 మీటర్లు, ఎత్తు 1.56 మీటర్లు. ఇక వీల్ బేస్ 3210mm.స్పెక్టర్ మొత్తం బరువు 2 వేల 975 కేజీలు.

Advertisement

ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది… స్పెక్టర్. అంతేకాదు… రోల్స్ రాయిస్ లోని ఘోస్ట్ మోడల్ లాగా… 4.5 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఇది 577 BHP పవర్, 900 NM టార్క్ కలిగి ఉంది. ఇప్పటిదాకా ఏ కార్ కంపెనీ కూడా 500కుపైగా కిలోమీటర్ల మైలేజ్ తో బ్యాటరీ కారును మార్కెట్లోకి తీసుకురాలేదు. స్పెక్టర్ రోడ్డెక్కితే… 500 పైచిలుకు కిలోమీటర్ల మైలేజీతో రోడ్లపై తిరిగే తొలి కారు అవుతుంది. 2030 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్ కు మారిపోవాలన్నది రోల్స్ రాయిస్ లక్ష్యం.

స్పెక్టర్ కోసం బుకింగ్ లు కూడా తెరిచింది… రోల్స్ రాయిస్. అయితే 2023 జూలై తర్వాతే డెలివరీలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. ఇంతకీ దీని ధరెంతో తెలుసా? 7 నుంచి 9 కోట్ల రూపాయల మధ్య ఈ కారు ధర ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×