E-Paper
Advertisement

Satellites to Study Stars : నక్షత్రాలను స్టడీ చేయడానికి కొత్తరకం శాటిలైట్లు..

Satellites to Study Stars : నక్షత్రాలను స్టడీ చేయడానికి కొత్తరకం శాటిలైట్లు..
Advertisement
Satellites to Study Stars

Satellites to Study Stars : స్పేస్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందిన తర్వాత, స్పేస్ ట్రావెల్ రంగం మెరుగుపడిన తర్వాత భూమి పక్కన ఉన్న గ్రహాలు ఏంటి, సోలార్ సిస్టమ్ ఎలా ఉంటుంది, చంద్రుడు, సూర్యుడు.. ఇలా ప్రతీదాని గురించి అందరికీ ఒక అవగాహన ఏర్పడింది. శాటర్న్, జుపిటర్‌తో సహా ఇప్పుడు ప్రతీ ఒక్క ప్లానెట్ గురించి శాస్త్రవేత్తల దగ్గర సరిపడా సమాచారం ఉంది. ఆ సమాచారాన్ని ఉపయోగించి మరికొన్ని అద్భుతాలు చేయాలని ఆస్ట్రానాట్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు.

ఒకప్పుడు అంతరిక్షంలోకి వెళ్లడం అనేది పెద్ద ఛాలెంజ్‌లాగా ఉండేది. కానీ 1982లో ఏ స్పేస్‌క్రాఫ్ట్ కూడా వెళ్లనంత దూరాన్ని వొయాగర్ 2 వెళ్లి చూపించింది. 46 ఏళ్ల తర్వాత కూడా భూమికి 179 లైట్ ఇయర్స్ దూరంలో పావో అనే కాన్స్‌టిల్లేషన్‌లో వొయాగర్ 2 ప్రయాణం చేస్తూనే ఉంది. ఇలాంటి మరో శాటిలైట్ మిషిన్‌ను తయారు చేయాలని శాస్త్రవేత్తలు ఎంతోకాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఖర్చు అనేది ముఖ్యమైన సమస్యగా మారింది. అంతే కాకుండా సమయంలో టార్గెట్ పూర్తి అవ్వాలన్నది కూడా వారికి సమస్యగా ఉంది.

Advertisement

ఒక్క శాటిలైట్‌ను తయారు చేయాలంటే దాని డిజైనింగ్ దగ్గర నుండి, ప్లానింగ్, తయారీ.. ఇలా ప్రతీ అంశంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియకు దాదాపు దశాబ్దం అయినా పడుతుంది. పైగా అలా తయారు చేసిన శాటిలైట్.. శాస్త్రవేత్తల టార్గెట్‌ను అందుకోవాలి. ఇదంతా చాలా కష్టమని వారు వాపోతున్నారు. 1977 వొయాగర్ శాటిలైట్లను తయారు చేసిన లేబురేటరీ మళ్లీ అంతే ఎఫెక్ట్ ఉన్న శాటిలైట్లను తయారు చేయాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే నక్షత్రాలకు చేరుకునే శాటిలైట్లను తక్కువ ఖర్చుతో వేగంగా తయారు చేయవచ్చన్న ప్రపోజల్‌ను బయటపెట్టింది.

సోలార్ సేయిలింగ్ అనేది సూర్యుడి వెలుగును ఉపయోగించుకొని సాగే ప్రక్రియ. 2019 నుండి సోలార్ సేయిలంగ్‌పై పరిశోధనలు ఊపందుకున్నాయి. దీనిని ఉపయోగించుకొని శాటిలైట్లను తయారు చేయవచ్చని, అంతే కాకుండా ఇవి చాలా మెరుగ్గా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. వొయాగర్ శాటిలైట్‌తో చేసిన అద్భుతాలను మళ్లీ రిపీట్ చేయవచ్చని వారు నమ్మకంతో ఉన్నారు. అంతే కాకుండా ఇప్పుడు ఉన్న శాటిలైట్ తయారీ మార్గాలతో పోలిస్తే సోలార్ సేయిలింగ్ తక్కువ ఖర్చుతో అయిపోతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×