Ninnu kori serial today Episode: సామ్రాట్ ఇంకా తన వెనకాలే తిరిగేలా చేయాలంటే ఏం చేయాలి అంటూ ఏదైనా ట్రిక్ గురించి చెప్పండి అంటూ వెళ్లి శ్రీజ, మదన్‌ను అడుగుతుంది. అందుకు మీ బావ దగ్గర వేరే మగవాడి గురించి పొగడండి అప్పుడే మీ బావలో జెలసీ పుడుతుంది. అప్పుడే మీ బావకు జెలసీ థెరపీ పని చేస్తుంది. అంటూ చెప్పగానే.. వేరే మగాడా..? నాకు బావ గురించి తప్ప ఎవరి గురించి తెలియదు కదా అంటూ ఆలోచిస్తుంటే.. మదన్ తాను ఉన్నాను కదా తన గురించి పొగడమని చెప్తాడు. శ్రీజ అవును కదా నువ్వు ఉన్నావు కదా.? పైగా ఒకే ఇంట్లో ఉంటున్నాం నీ గురించి పొగిడితే మా బావకు ఎక్కడి లేని జెలసీ రావడం ఖాయం అనుకుంటూ వెళ్లిపోతుంది శ్రీజ.
అందరూ గార్డెన్‌లో ఉంటారు. నీలగిరి, కేశవ జోక్స్ వేసుకుని నవ్వకుంటుంటారు. అప్పుడే రామయ్య వస్తాడు. తన కూతురు నెల రోజుల కిందటే చనిపోయిందని పెద్ద బాబును పిలపించండి అని చెప్పగానే.. పెద్దబాబుకు గతం గుర్తు లేదని నీలగిరి చెప్తాడు. దాంతో రామయ్య షాక్ అవుతాడు. అప్పుడే జీవన్ వస్తాడు. జీవన్‌ను చూసి రామయ్య భయంతో వణికిపోతుంటాడు. గట్టిగా సామ్రాట్‌ను పిలుస్తాడు. జీవన్ మాత్రం అన్నయ్యను డిస్టర్బ్ చేయకు నీ సమస్య నేను తీరుస్తాను కదా మనం రైస్‌మిల్లుకు వెళ్లి మాట్లాడుకుందాం అంటూ రామయ్యను తీసుకుని వెళ్లిపోతుంటే.. పై నుంచి సామ్రాట్ జీవన్‌ను పిలుస్తాడు. అందరిని ఇంట్లోకి రమ్మని పిలుస్తాడు. రామయ్య తో పాటు అందరూ ఇంట్లోకి వస్తారు. ఇంట్లోకి వచ్చిన రామయ్యను చూసిన దాక్షాయణి షాక్ అవుతుంది. ఏమీ తెలియనట్టు రామయ్య మన పాలేరు.. అంటూ సామ్రాట్‌కు చెప్పి రామయ్య ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావు అని అడుగుతుంది.
అప్పుడే చంద్ర అతని కూతురు చనిపోయిందట అని చెప్తుంది. అవునా ఎలా చనిపోయింది అంటూ సామ్రాట్ అడిగితే.. రామయ్య ఏడుస్తూ.. మీ తమ్ముడు జీవన్ వల్లే తన కూతురు చనిపోయిందని చెప్తాడు జీవన్. రామయ్య మాటలకు అందరూ షాక్ అవుతారు. నీలగిరి కోపంగా ఏం మాట్లాడుతున్నావురా నా చెల్లెలి కొడుకు మీద నిందలు వేస్తావా..? అంటూ తిడుతుంటే.. రామయ్య మాత్రం ఏడుస్తూ.. నేను నిజమే చెప్తున్నాను.. మీరు కూడా ఆరోజు అంత విచారించాక నిజం అని నమ్మారు కదా బాబు అంటూ సామ్రాట్‌కు చెప్తాడు. దాక్షాయణి మాత్రం కోపంగా రామయ్యను తిడుతుంది. జీవన్ దారి తప్పిన వాడే కానీ ఒక మనిషి చంపేంత కిందకు దిగజారడు.. ఇదంతా ఎందుకు నాటకం ఆడుగున్నావు.. డబ్బు కోసమా..? అంటూ ఉల్టా మాట్లాడుతుంది. సామ్రాట్‌కు నిజం తెలిస్తే వెంటనే తనకు చెప్పేవాడని కానీ సామ్రాట్ నాకు చెప్పలేదని దాక్షాయణి మాట్లాడుతుంది.
అందుకు రామయ్య తాను దాక్షాయణిని కలిసిన విషయం చెప్తాడు. రామయ్యను దాక్షాయణి బెదిరించిన విషయం డబ్బులు ఆశ చూపించిన విషయం రామయ్య చెప్తాడు. రామయ్య మాటలకు దాక్షాయణి షాక్ అవుతుంది. ఈవిడను నమ్మొద్దు బాబు చిన్న కొడుకును కాపాడుకునేందుకు ఈవిడ ఎంత నీచానికైనా దిగజారుతుంది బాబు అంటాడు. సామ్రాట్ కోపంగా రామయ్య గొంతు పట్టుకుని ఇప్పటి వరకు నువ్వు చెప్పింది నిజమే అనుకున్నాను కానీ ఈ ఒక్క మాటతో నిన్ను చంపేస్తాను.. అంటూ వార్నింగ్ ఇస్తాడు. అందుకు రామయ్య మీరు సామ్రాట్ కాదు బాబు.. పోయిన మీ నా బిడ్డ తిరిగి రాకపోవచ్చు కానీ మీ గతం తిరిగి వస్తుంది. అప్పుడైనా మీరు నన్ను పిలిచి నాకు న్యాయం చేస్తారు అంటాడు. అప్పుడే జీవన్ కోపంగా రామయ్యను తిట్టి ఇంట్లోంచి గెంటేస్తాడు.
తర్వాత జీవన్, దాక్షాయణి ఇద్దరిని అనుమానిస్తుంది. జీవన్‌ను ఎందుకు సపోర్టు చేస్తుంది అని ఆలోచిస్తుంది. జీవన్ కూడా దాక్షాయణి ఏమీ అనలేదని తాను ఫుల్ సేఫ్‌గా ఉన్నానని భరోసాతో ఉంటాడు. ఇంతలో ఈరోజు నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.