BigTV English

Prostate Cancer: ప్రోస్టేట్ క్యాన్సర్‌ వ్యాప్తికి కారణమయ్యే ఎంజైమ్ గుర్తింపు..

Prostate Cancer: ప్రోస్టేట్ క్యాన్సర్‌ వ్యాప్తికి కారణమయ్యే ఎంజైమ్ గుర్తింపు..

Prostate Cancer: క్యాన్సర్ అనేది ఇప్పటికీ ప్రపంచంలోని ప్రాణాంతక వ్యాధుల్లో ఒకటిగా చలామణి అవుతోంది. టెక్నాలజీ ఎంత పెరిగినా, క్యాన్సర్‌కు ఎన్ని రకాల చికిత్సలు, మందులు అందుబాటులోకి వచ్చినా కూడా ఇంకా దీని వల్ల ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. అందుకే శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేయడం ఆపలేదు. తాజాగా ప్రోస్టేట్ క్యాన్సర్ విషయంలో కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఒక కొత్త విషయం పేషెంట్లకు ఉపయోగపడుతుందని చెప్తున్నారు.


ప్రతీ క్యాన్సర్ విషయంలో, అది శరీరం అంతా వ్యాప్తి చెందడానికి శరీరంలోని ఏదో ఒక కణం దానికి సాయం చేస్తూనే ఉంటుంది. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్‌కు కూడా సాయం చేసే ఒక ఎంజైమ్‌ను శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. ఈ ఎంజైమ్ కారణంగానే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది మరింత తొందరగా వ్యాప్తి చెందుతూ, పేషెంట్ల ప్రాణాలకు ప్రమాదకరంగా మారుతుందని వారు తెలిపారు. అంతే కాకుండా దీనివల్లే ఒక స్టేజ్ దాటిన తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ట్రీట్ చేయడానికి కూడా కుదరనంత ప్రమాదకరంగా మారుతుందన్నారు.

ప్రోస్టేట్ క్యాన్సర్‌ను వ్యాప్తి చేసే ఈ ఎంజైమ్ పేరు ట్రాన్స్‌గ్లూటామినేస్ 2 అని శాస్త్రవేత్తలు తెలిపారు. దీని వల్లే పేషెంట్ల శరీరంలో ఆ క్యాన్సర్ తొందరగా వ్యాప్తి చెందుతుందని అన్నారు. అసలైతే ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఆండ్రోజెన్ అనే మేల్ హార్మోన్ వల్ల పెరగడం మొదలుపెడుతుంది. కానీ ఆ క్యాన్సర్ పెద్దగా పెరిగిన తర్వాత ఆండ్రోజెన్ సాయం తీసుకోవడం మానేస్తుంది. ప్రస్తుతం ఆండ్రోజన్ హార్మోన్ ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ అందించే విధానాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో అడ్వాన్స్ స్టేజ్‌కు వెళ్లిన తర్వాత దీనికి చికిత్స అందించడం కష్టంగా మారుతుంది.


టీజీ2పై ప్రయోగాలు చేపడితే దీని ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్‌కు ఇప్పుడు ఉన్నవాటి కంటే మెరుగైన చికిత్సను అందించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. టీజీ2 వల్లే మ్యూసిన్ 1 అనే ప్రొటీన్ పెరిగి క్యాన్సర్ వ్యాప్తికి కారణమవుతుందని ఇప్పటికే వారు కనిపెట్టారు. ప్రస్తుతం టీజీ2 గురించి మరింత సమాచారం తెలుసుకోవడం ముఖ్యమని వారు భావిస్తున్నారు. కచ్చితంగా దీని వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్‌కు మెరుగైన ట్రీట్మెంట్ అందుతుందని వారు నమ్ముతున్నారు. ఇప్పటికే దీనిపై పలు ప్రయోగాలు జరిగినా ట్రీట్మెంట్ పద్ధతులను కనిపెట్టాలంటే పూర్తిస్థాయిలో సమాచారం అవసరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×