BigTV English

sculptures on the temples : దేవాలయాలపై శృంగార శిల్పాల వెనుక రహస్యమిదే

sculptures on the temples : దేవాలయాలపై శృంగార శిల్పాల వెనుక రహస్యమిదే

sculptures on the temples : దేవాలయం హిందువులు పరమ పవిత్రమైంది. పురాతన గుళ్లల్లో గాలి గోపురం మీద వివిధ భంగిమల్లో శృంగార శిల్పాలు ఎంతో అందంగా ఉంటాయి. దేవాలయాల్లో ఈ బూతు బొమ్మలేంటని నాస్తికవాదులు విమర్శలు చేస్తుంటారు. కానీ వాటి వెనుక ఉద్దేశాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయరు. శృంగార శిల్పాల నిర్మాణం వెనుక పూర్వికులు సునిశితమైన ఆలోచన చేశారు. ఒక ప్రయోజనంతో ఇలా చేశారు. పూర్వాకాలంలో జీవితం ఇప్పటిలాగా ఫాస్ట్ గా ఉండేది కాదు. నిశ్చలంగా, నిబ్బరంగా ఉండే వారు. ప్రతీ రోజు గుడికి వెళ్లడం చేస్తూ ఉండేవారు. పెద్దోళ్లతోపాటు యుక్త వయసులో ఉండే వారు దేవాలయానికి రావడం పరిపాటిగా ఉండేది.


పురుషుడైన ప్రతీవాడు ధర్మ,అర్ధ,కామ మోక్ష అనే చతుర్విద పురుషార్ధాలను తప్పక సాధించాలన్న నియమంపెట్టుకున్నారు. ధర్మసాధన అంటే చదువుకోవడం,వృత్తి ధర్మం నేర్చుకోవడం, రెండోది డబ్బును సంపాదించడం. ధనం అంటే ఆరోజుల్లో ఎంత పశుసంపద ఉంటే అంత ధనవంతులుగా భావించే వారు. మూడోది వివాహం చేసుకుని ఎక్కువ మంది పిల్లల్న కనడం. ఎంత మంది పిల్లలుంటే అంత గొప్పగా భావించే వారు. నాలుగోది మోక్షమార్గం. ఈ నాలుగింటిని కలిపి పుణ్య పురుషార్ధాలు అంటారు. కామిగాక మోక్షకామిగాడు అన్నాడు వేమన.

శృంగారం పాపం కాదు. సృష్టికి మూలం శృంగారమే. మనం భార్యలతో కలిసి ఉన్న దేవుళ్లనే పూజిస్తాం.వశిష్టాది మహా బ్రహ్మర్షులకు కూడా భార్యాబిడ్డలున్నారు. భార్యతో కూడిన సృష్టి పవిత్రధర్మంగానే భావించాలి. పరస్త్రీ వ్యామోహం మాత్రం మహాపాపం . సంతానాన్ని సంపత్తుగా భావించే వారు. కారణం ఎక్కువ సంతానం ఉన్న వారికి శత్రువులు భయపడే వారు. ఆనాడు వ్యవసాయమే ప్రధానవృత్తి. ఎక్కువ ధాన్యాన్ని పండించాలంటే ఎక్కువ శ్రమ చేయాలి. ఎక్కువ కృషి చేయాలంటే ఎక్కువమంది బిడ్డలు కావాల్సి వచ్చేది. కాబట్టి సెక్స్ అనాటి ప్రజల జీవనానికి ముఖ్య చేతనంగా చేయాలి కాబట్టి దేవాలయాల గోపురాల మీద సృష్టించాల్సిన అవసరమొచ్చింది.యువతను నిద్రాణం చేయకుండా ఉండటానికి, శృంగార మనోవృత్తిని మేల్కొలపటానికి గాలిగోపురాలు మీద శృంగార శిల్పాలు నిర్మించేవారు.


Tags

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×