BigTV English
Advertisement

Lakshmi Kataksham : ఇంటికి పసుపు రక్ష గీసారా…

Lakshmi Kataksham : ఇంటికి పసుపు రక్ష గీసారా…

Lakshmi Kataksham : జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపును ఉపయోగిస్తే ఎన్నోప్రయోజనాలున్నాయి.కొన్ని పద్ధతులు పాటిస్తే ఇంట్లో ఎప్పుడు డబ్బుకు కొదవ ఉండదు. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం సొంతమవుతుంది. ఈ రోజుల్లో ఆరోగ్య సమస్యలు, ఆర్ధిక పరమైన సమస్యలు ఎక్కువమందిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. సరైన ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ జాతకంలో గ్రహ దోషాల వల్ల కష్టాలు అనుభవించే వారికి కొన్ని రకాల పరిహార మార్గాలు ఉన్నాయి. కొంతమంది సంపాదన ఉన్న అధికంగా ఖర్చులవుతూ ఉంటాయి . ఇంట్లో డబ్బు నిల్వ ఉండదు.


ఇంటి వంటలో ఉపయోగపడే పసుపుతో కొన్ని రకాల పరిహారాలు పాటించడం వల్ల వాటి నుంచి బయటపడవచ్చు. పసుపు విష్ణువు బృహస్పతి గ్రహాలకు సంబంధించినదని నమ్ముతూ ఉంటారు. విష్ణువు గృహస్తి సంతోషంగా ఉంటే ఆ వ్యక్తి కూడా శుభ ఫలితాలను పొందుతారు. అయితే గురువారం రోజున కొన్ని రకాల నివారణలు పసుపుతో ప్రయత్నించడం వల్ల మంచి జరుగుతుంది. అందుకోసమే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటి బయటి గోడ లేదా ప్రధాన ద్వారం మీద పసుపుతో ఒక లైన్ గీయండి. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు.

ఇంటి వాతావరణం కూడా సానుకూలంగా ఉంటుంది. అలాగే గురువారం రోజున పసుపు రేఖను గీస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉన్న వ్యక్తి గురువారం నాడు విష్ణువు, గురువు బృహస్పతిని పూజించాలి. తర్వాత మణికట్టు మెడపై పసుపుతో చిన్న గీత రాయండి. ఇలా చేయడం వల్ల గురుగ్రహం బలపడుతుంది. గురువారం రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని నీళ్లు పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.


Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×