BigTV English

SBI : ఎస్‌బీఐలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. అర్హతలివే..!

SBI : ఎస్‌బీఐలో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు.. అర్హతలివే..!

SBI :స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మంబయిలోని కార్పొరేట్‌ సెంటర్‌లో డిప్యూటీ మేనేజర్‌, సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల నియామకానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 36 ఖాళీలున్నాయి. ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు బీఈ, బీటెక్‌, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్‌ విద్యార్హతతోపాటు పని అనుభవం ఉండాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 2022 జూలై 31నాటికి 32 ఏళ్లు మించరాదు. మిగిలిన పోస్టులకు 35 ఏళ్లు మించరాదు.


డిప్యూటీ మేనేజర్ పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉంటాయి. మిగిలిన పోస్టులకు షార్ట్‌ లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఉద్యోగానికి ఎంపికైన వారు నవీ ముంబయిలో పని చేయాల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజును రూ. 750గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్థులు 2022 డిసెంబర్ 29 లోపు ఆన్ లైన్ లో దరఖాస్తులు పంపించాలి. ఎగ్జిక్యూటివ్ పోస్టులకు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు అర్హులైన ఆసక్తిగల అభ్యర్థుల నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 36
అర్హత: బీఈ, బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌) లేదా ఎంసీఏ/ ఎంఈ, ఎంటెక్‌/ ఎమ్మెస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌)తో పాటు పని అనుభవం
వయసు: 31.07.2022 నాటికి ఎగ్జిక్యూటివ్‌ పోస్టులకు 32 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 35 సంవత్సరాలు మించకూడదు



ఎంపిక: డీఎం పోస్టులకు ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా, మిగిలిన పోస్టులకు షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ, సీటీసీ నెగోషియేషన్‌ ఆధారంగా
పని ప్రదేశం: నవీ ముంబయి
దరఖాస్తు ఫీజు: రూ.750 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది)
ఆన్‌లైన్‌ దరఖాస్తు, రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 29.12.2022

వెబ్‌సైట్‌: https://www.sbi.co.in/

Related News

TG SET-2025: తెలంగాణ సెట్-2025 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు ఎప్పటి నుంచంటే?

Canara Bank Notification: డిగ్రీతో భారీ అప్రెంటీస్ పోస్టులు.. అప్లై చేస్తే చాలు.. సెలెక్ట్ అవుతారు..!

RRB ALP Result 2025: ఆర్ఆర్బీ అసిస్టెంట్ లోకో పైలట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

RRB JE: రైల్వేలో వేలల్లో జేఈ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే బంగారు భవిష్యత్తు మీ సొంతం, దరఖాస్తుకు ప్రారంభ తేది ఇదే

AP RDMHS: ఏపీలో టెన్త్ క్లాస్‌ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.32,670 వేతనం, గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వొద్దు..

Group-3 Selection List: తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. ప్రొవిజినల్ జాబితా విడుదల.. నేటి నుంచి వెబ్ ఆప్షన్స్

SSC Police: కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది.. దరఖాస్తు ప్రక్రియ షురూ, ఆలస్యం చేయకుండా..?

Bank Jobs: డిగ్రీ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. భారీ వేతనం, ఇంకొన్ని గంటలే ఛాన్స్ బ్రో

Big Stories

×