E-Paper
Advertisement

Sensex : వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు

Sensex : వరుసగా రెండోరోజూ లాభాల్లో ముగిసిన మార్కెట్లు
Advertisement

Sensex : భారత స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 203 పాయింట్లు పెరిగి 59,960 పాయింట్ల దగ్గర ముగిసింది. నిఫ్టీ 50 పాయింట్ల లాభంతో 17,787 పాయింట్ల దగ్గర ముగిసింది. అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఉన్నా… భారత సూచీలు ఈ వారాన్ని లాభాల్లో ముగించడం విశేషం.

ఉదయం 59,746 పాయింట్ల దగ్గర లాభాల్లో మొదలైన సెన్సెక్స్‌… ఇంట్రాడేలో 60,133-59,739 పాయింట్ల మధ్య ఊగిసలాడి… చివరికి 203 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్టీ కూడా 50 పాయింట్లు పెరిగింది. సెన్సెక్స్‌30 సూచీలో 21 షేర్లు లాభపడ్డాయి. మారుతీ, రిలయన్స్‌, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, టైటన్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడగా… టెక్‌ మహీంద్రా, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

మరోవైపు… అమెరికా ట్రెజరీ రాబడులు మందగించడం, డాలర్ విలువ తగ్గడంతో… రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. 7 పైసలు బలపడ్డ రూపాయి… డాలర్ మారకం విలువతో పోలిస్తే 82 రూపాయలా 34 పైసల దగ్గర ముగిసింది. గత మూడు సెషన్లలో రూపాయి విలువ 50 పైసల మేర లాభపడటం విశేషం.

Tags

Related News

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Airtel 5G యూజర్లకు బిగ్ షాక్.. హాట్‌స్పాట్ ఆన్ చేశారో.. అన్‌లిమిటెడ్ డేటా ఫట్!

క్షీణిస్తున్న వాంగ్‌చుక్ ఆరోగ్యం.. రంగంలోకి దిల్లీ హైకోర్టు.. కేంద్రానికి అల్టిమేటం!

హై టెక్ సిటీ స్టేషన్ ఇక ఇంటర్నేషనల్ స్టైల్‌లో.. చూస్తే ఆశ్చర్యపోతారు!

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ కు బాలు దెబ్బ.. ఇదేం ట్విస్ట్ రా బాబు.. బాలు ఆట అదిరిపోయింది..

Bramhamudi Raj : ‘బ్రహ్మముడి’ రాజ్ ఏం చదివాడో తెలుసా..?

వర్షాకాలంలో మొక్కజొన్న తినే.. అలవాటు ఉందా?

Big Stories

Advertisement
×