BigTV English

Phone call : 100 కోట్ల డీల్.. అమిత్ షా, సంతోష్ పేర్లు.. ఆడియో-2

Phone call : 100 కోట్ల డీల్.. అమిత్ షా, సంతోష్ పేర్లు.. ఆడియో-2

Phone call : రామచంద్రభారతి : ఎంత అడుగుతున్నారు?
నంద కుమార్ : 100 రూపాయలు స్వామీజీ…



రామచంద్రభారతి : నలుగురికి కలిపి వంద కోట్లా?
నంద కుమార్ : కాదు, పైలెట్ ఒక్కరే వంద కోట్లు అడుగుతున్నారు. మిగిలిన ముగ్గురికి వేరే రేటు. వారికి నామినల్ గా ఇస్తే సరిపోతుంది.

రామచంద్రభారతి : వాళ్ల పేర్లు ఏంటి?
నంద కుమార్ : మొత్తం నలుగురు రెడీ. పైలెట్ రోహిత్ రెడ్డితో పాటు మరో ముగ్గురు వస్తారు. వాళ్ల పేర్లు మాట్లాడాక చెబుతా.


రామచంద్రభారతి : కన్ఫామ్ అయితే నేను సంతోష్ తో మాట్లాడుతా. అమిత్ షాతోనూ మాట్లాడాలి. బండి సంజయ్, కిషన్ రెడ్డి చేతిలో ఏమీ లేదు. స్టేట్ ని బైపాస్ చేసి సెంటరే నేరుగా డీల్ చేస్తోంది. మీరు డీల్ ఓకే చేస్తే.. నేను సంతోష్ దగ్గరికి తీసుకెళతా. ఆ నలుగురి పేర్లు తప్పనిసరిగా కావాలి. ముగ్గురు నలుగురి కోసం అమిత్ షా నేరుగా హైదరాబాద్ రాలేనన్నారు.

నంద కుమార్ : ఈ మిషన్ కంప్లీట్ అయితే ప్రభుత్వం పడిపోతుంది. మీరు ఈ విషయం గుర్తించాలి.

రామచంద్రభారతి : ఆ విషయం నాకు తెలుసు. అందుకే నెంబర్ 2తో, సంతోష్ తో మాట్లాడా. తుషార్ తోనూ మాట్లాడతా. వీలైతే మేమిద్దరం కలిసి హైదరాబాద్ వస్తాం.

ఇలా సాగింది ఆ ముగ్గురి మధ్య సంభాషణ. రామచంద్రభారతి, సింహయాజులు, నంద కుమార్ లు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్లపై చర్చిస్తున్న మరొక ఫోన్ కాల్ ఆడియోను బయటకు వదిలారు. ఫామ్ హౌజ్ డీల్ లో పార్ట్ 2 మరింత హాట్ హాట్ గా మారింది.

100 కోట్లు.. నలుగురు ఎమ్మెల్యేలు.. సంతోష్, అమిత్ షా పేర్లు.. ఇలా బీజేపీ ఫుల్ గా ఇరుక్కుపోయేలా ఉందా 27 నిమిషాల ఫోన్ కాల్ ఆడియో. ఓవైపు బండి సంజయ్, కిషన్ రెడ్డిలు వారితో తమకేం సంబంధం లేదని చెబుతుంటే.. ఆ ఫోన్ కాల్ సంభాషణ సైతం అలానే అనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీకి లింక్ లేకుండా.. నేరుగా ఢిల్లీ స్థాయిలో డీల్ మాట్లాడినట్టు అర్థం అవుతోంది.

Related News

GST 2.0: ప్రజల డబ్బు బయటకు తెచ్చేందుకు.. జీఎస్టీ 2.0తో మోదీ భారీ ప్లాన్

Meeting Fight: ఎమ్మెల్యే Vs కమిషనర్.. హీటెక్కిన గుంటూరు కార్పొరేషన్ కౌన్సిల్

Congress: గుత్తా లేఖల వెనక సీక్రెట్ ఏంటి?

AP Politics: టీడీపీలో సంస్థాగత మార్పులపై రచ్చ!

Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్ని పరీక్ష మొత్తం స్క్రిప్టా… మరీ ఇంత మోసమా?

AP Politics: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?

Big Stories

×