IND Vs PAK : ఆసియా కప్ 2025 సూపర్ 4లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే పాకిస్తాన్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ఔట్ ను పలువురు వివాదం చేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ ఓపెనర్ ఫఖర్ జమాన్ క్యాచ్ క్యారీ కాలేదని.. అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని ఆరోపించారు. “ఫకర్ ఔట్ కాలేదు. అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్.. 26 కెమెరాలు ఉన్న సరిగ్గా కనిపించడం లేదన్నారు. డౌట్ ఉంటే.. నాటౌట్ ఇవ్వాలి అతడు ఆడి ఉంటే మ్యాచ్ గెలిచే వాళ్లం” అని పేర్కొన్నాడు అక్తర్.
Also Read : IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య
వాస్తవానికి ఫఖర్ జమాన్ 15 పరుగుల వద్ద ఉన్న సమయంలో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో వికెట్ కీపర్ సంజు శాంసన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ క్యాచ్ ను చాలా క్లీన్ గానే సంజు శాంసన్ అందుకున్నాడు. తొలుత ఫీల్డ్ అంపైర్ ఘాజీ సొహెల్ ఔట్ ప్రకటించకుండా.. టీవీ అంపైర్ కి రిఫర్ చేశాడు. దీనిని క్లీన్ క్యాచ్ గా తేల్చి ఔట్ ఇచ్చాడు అంపైర్. ఓ కోణంలో బంతి నేలను తాకి బౌన్స్ అయినట్టుగా కనిపించినా.. వికెట్ కీపర్ చేతివేలు బంతి కింద ఉన్నట్టుగా అంపైర్ తేల్చి ఔట్ ఇచ్చాడు. దీంతో ఫకర్ జమాన్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు. పాక్ టీమ్ మేనేజర్ నవీద్ చీమా.. మ్యాచ్ రీఫరీ ఆండీ పైక్రాప్ట్ కి తొలుత ఈ విషయం పై ఫిర్యాదు చేసినట్టు సమాచారం. దీంతో పాక్ మేనేజర్ టీవీ అంపైర్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా ప్రెస్ మీట్ లో ఫఖర్ జమాన్ ఔట్ కాలేదని.. థర్డ్ అంపైర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడని పేర్కొన్నాడు. నాకు ఆ నిర్ణయం గురించి తెలియదు. “కచ్చితంగా అది అంపైర్ల విధి. వారు కూడా కొన్నిసార్లు తప్పులు చేస్తారు. ఆ బంతి వికెట్ కీపర్ అందుకునే లోపే బౌన్స్ అయినట్టు నాకు అనిపించింది. ఆ సమయంలో అతని బ్యాటింగ్ ను చూస్తే.. పవర్ ప్లే మొత్తం అతను ఆడేవాడనిపించింది. అప్పుడు మేము 190 పరుగులు చేసి ఉండేవాళ్లమేమే” అని సల్మాన్ అఘా తెలిపాడు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ బ్యాటర్ ఔట్ ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వివాదం చేస్తోంది. ఈ విషయం పై టీవీ అంపైర్స్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. కరచాలన వివాదం మరువకముందే పాకిస్తాన్ మరో అగ్గి రాజేసిందని.. క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు.