Fakhar Zaman catch : ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 దశలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్తానీయులను ఓడించింది. అంతకు ముందు ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది భారత్. దీంతో పాకిస్తాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సామిబ్ జాదా ఫర్హాన్ 58 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఓపెనర్ ఫఖర్ జమాన్ కేవలం 14 పరుగులు మాత్రమే చేసి కీపర్ సంజూ శాంసన్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో ఈ ఔట్ వివాదం పై అంపైర్ నిర్ణయం తప్పు అని పాకిస్తాన్ క్రికెటర్లు పేర్కొనడం గమనార్హం.
Also Read : Abhishek Sharma: అభిషేక్ శర్మకు గ్రౌండ్ లోనే ప్రపోజ్..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మరీ !
మరోవైపు టీమిండియా తొండాట ఆడిందని.. పాకిస్తాన్ ఏకంగా ఐసీసీకి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని పాకిస్తాన్ తప్పు పట్టింది. వాస్తవానికి భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చాలా స్లోగా వేసిన బంతితో ఫఖర్ జమాన్ ని ట్రాప్ చేయడంతో సంజూ శాంసన్ కి క్యాచ్ ఇచ్చాడు. ఔట్ అయిన తరువాత ఫఖర జమాన్ థర్డ్ అపైర్ నిర్ణయంతో షాక్ అయ్యాడు. బంతి ఫఖర్ జమాన్ బ్యాట్ బయటి అంచుకు తగిలింది. వికెట్ కీపర్ సంజూ శాంసన్ బంతిని నేలపైకి లాగాడు. క్లీన్ క్యాచ్ కోసం తనిఖీ చేయడం కోసం ఆన్ ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ సహాయం కోరారు. సంజూ శాంసన్ క్యాచ్ ను థర్డ్ అంపైర్ పరిశీలించినప్పుడు బంతి నేరుగా అతని గ్లోవ్స్ లోకి వెళ్లి.. ఫఖర్ జమాన్ ను ఔట్ చేసిందని నిర్ధారించాడు.
థర్డ్ అంపైర్ నిర్ణయం ప్రకటించినప్పుడు పాక్ ప్లేయర్ షాక్ కి గురై.. ఆన్ ఫీల్డ్ అంపైర్ కి ఫిర్యాదు చేయడం ప్రారంభించాడు. సంజూ శాంసన్ గ్లోవ్స్ ను తాకే ముందు బంతి నేలను తాకిందని.. అతను బావించారు. కానీ అలా జరుగలేదు. పెవిలియన్ కి తిరిగి వచ్చిన తరువాత.. ఫఖర్ జమాన్ పాక్ ప్రధాన కోచ్ మైక్ హస్సన్ కి కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో ఫఖర్ జమాన్ క్యాచ్ తీవ్ర వివాదానికి దారి తీసింది. సోషల్ మీడియాలో పాకిస్తాన్ అభిమానులు ఈ క్యాచ్ చట్ట విరుద్ధమని అభివర్ణించారు. రీప్లైలలో ఫఖర్ జమాన్ క్యాచ్ స్పాట్ అని స్పష్టంగా కనిపించినప్పటికీ.. అపైర్ భారత్ కి అనుకూలంగా ఉన్నాడని పాకిస్తాన్ ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆరోపించడం గమనార్హం. మరోవైపు పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా కూడా ప్రెస్ మీట్ లో అంపైర్ తప్పుడు నిర్ణయంతో ఫఖర్ జమాన్ ఔట్ అయ్యాడని.. లేకుంటే పాకిస్తాన్ 190కి పైగా స్కోర్ చేసేదని కామెంట్స్ చేయడం విశేషం. మ్యాచ్ ని గెలవలేక పాకిస్తాన్ ఒక్కో మ్యాచ్ కి ఓ వివాదం సృష్టిస్తోంది. లీగ్ దశలో మ్యాచ్ కి షేక్ హ్యాండ్, ఈ మ్యాచ్ కి ఫఖర్ జమాన్ క్యాచ్ ఔట్ పై వివాదం క్రియేట్ చేయడం విశేషం.
It was a CLEAR catch and Fakhar Zaman was OUT!
When the camera zoomed in, it was absolutely clear that the ball landed safely in Sanju Samson’s gloves.
Pakistanis have an old habit of crying and now we are enjoying it 😂#INDvPAK
— Madhav Sharma (@HashTagCricket) September 21, 2025