BigTV English
Advertisement

Vithika-Varu Sandesh: సొంతింటి కలను నెరవేర్చుకున్న వితిక దంపతులు..ఫోటోలు వైరల్!

Vithika-Varu Sandesh: సొంతింటి కలను నెరవేర్చుకున్న వితిక దంపతులు..ఫోటోలు వైరల్!

Vithika-Varu Sandesh: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కూడా సొంత ఇల్లు ఉండాలని భావిస్తూ తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి కృషి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న నటుడు వరుణ్ సందేశ్ (Varun Sandesh) నటి వితిక(Vithika) దంపతుల సైతం తమ సొంత ఇంటి కలను నెరవేర్చుకున్నారని తెలుస్తుంది. ఇటీవల వితికా తన భర్త వరుణ్ సందేశ పుట్టినరోజు సందర్భంగా తన భర్తకు తమ ఫ్లాట్ కి సంబంధించిన కీస్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇలా వరుణ్ పుట్టినరోజు సందర్భంగా వితిక షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.


కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ కపుల్స్..

సొంత ఇల్లు ఉండాలనేది తన కలని, అందుకే తన ఇంటి కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూశనని ఇన్ని రోజులకు తన కల నెరవేరిందని ఈమె తెలియజేశారు. అయితే తాజాగా నేడు ఈ దంపతుల తమ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. వరుణ్ తల్లితండ్రులు విదేశాల నుంచి ఇండియా వచ్చిన నేపథ్యంలో ముందుగా తమ కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించి అనంతరం గృహప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలుస్తుంది. తాజాగా వీరి నూతన గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గృహప్రవేశానికి సంబంధించిన ఫోటోలను వితిక లేదా వరుణ్ ఎక్కడ అధికారకంగా ప్రకటించలేదు కానీ ఈ గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లిన సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

సందడి చేసిన శివ జ్యోతి దంపతులు..


ఇందులో భాగంగానే ఈ గృహప్రవేశ కార్యక్రమానికి సీరియల్ నటి హిమజ హాజరయ్యారు. అదేవిధంగా శివ జ్యోతి దంపతులు కూడా ఈ గృహప్రవేశ కార్యక్రమానికి వెళ్లినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే శివ జ్యోతి వరుణ్ సందేశ్ దంపతులతో కలిసి దిగిన ఫోటోనే ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేస్తూ.. సో హ్యాపీ ప్రౌడ్ అఫ్ యు పాప.. ఇలాగే మరెన్నో సాధించాలని కోరుకుంటున్నాను అంటూ ఈ ఫోటోలను షేర్ చేశారు. ఇలా వరుణ్ సందేశ్ వితిక దంపతులు తమ సొంత ఇంటి కలలను నెరవేర్చుకున్న నేపథ్యంలో అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రేమ వివాహం చేసుకున్న వరుణ్ వితికా..

ఇకపోతే వితిక ప్రాణ స్నేహితురాలు మెగా డాటర్ నిహారిక కొణిదెల(Niharika Konidela) కూడా వీరి గృహప్రవేశపు ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే కొన్ని కారణాల వల్ల తాను ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయానని తెలియజేస్తూ ఈ దంపతులకు అభినందనలు తెలిపారు. నిహారిక వితిక ప్రాణ స్నేహితులనే విషయం మనకు తెలిసిందే. వీరికి సంబంధించి ఏ వేడుక జరిగినా అందరూ ఒకే చోట చేరి పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక వరుణ్ కెరియర్ విషయానికి వస్తే హ్యాపీడేస్ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వరుణ్ అనంతరం పలు సినిమాలలో నటించారు. అయితే పెద్దగా సక్సెస్ మాత్రం రాలేదు. ఇక వితికతో కలిసి వరుణ్ పడ్డామండి ప్రేమలో మరి అనే సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ నిజంగా ప్రేమలో పడటం, పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి తర్వాత ఈ జంట ఇద్దరు బిగ్ బాస్ లో పాల్గొని సందడి చేశారు. ఇక పెళ్లి తర్వాత వితిక సినిమాలకు దూరంగా ఉన్నారు.

Also Read: Naina Ganguly: కొరియోగ్రాఫర్ లైంగికంగా వేధించాడు… అందుకే ఇండస్ట్రీకి దూరం

Related News

Rahul Ravindran -Samantha: నాగచైతన్యతో సమంత విడాకులు… రాహుల్ రవీంద్రన్ ఏమన్నారంటే?

Bhagya Shri -Ram Pothineni: నేను రొమాంటిక్ కాదు బాబోయ్.. రామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన భాగ్యశ్రీ!

Bro 2 Movie: బ్రో 2 స్క్రిప్ట్ మొత్తం సిద్ధం… పవన్ కళ్యాణ్ అనుమతే ఆలస్యమా?

Bhagya Shree Borse:  మేడమ్ ను ఫస్ట్ పట్టింది మేమే… భాగ్య శ్రీ పై రానా కామెంట్స్!

Rana Daggubati: మద్యం మత్తులో మాట్లాడలేదురా..రానాను ఆడేసుకున్న ఫ్యాన్స్!

Anasuya: అప్పుడు గుంపులో గొవిందా అన్నావ్‌.. మరి ఇప్పుడు చేసిందేంటి అనసూయ?

Chikiri – Chikiri song: పెద్ది చికిరి.. చికిరికి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ వైరల్!

Rahul Ravindran: మన్మథుడు 2 ప్లాప్.. నాగార్జున ఫోన్ చేసి అంత మాట అన్నారా?

Big Stories

×