IND Vs PAK : ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే పలు సంచలన విషయాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్- టీమిండియా ఆటగాళ్లు స్టేడియంలో కొట్టుకోవడం.. టీమిండియా-పాక్ ఆటగాళ్లు తిట్టుకోవడం.. ఒకరిపై మరొకరూ సెటైర్లు వేసుకోవడం.. పాక్ ఓపెనర్ ఫర్హాన్ పహల్గామ్ దాడుల బాధితులను అవమానపరచడం.. పాక్ బౌలర్ హారిస్ రవూఫ్ ‘ఆపరేషన్ సింధూర్’ లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో సంజ్ఞలు చేయడం.. అందుకు టీమిండియా ఫ్యాన్స్ కోహ్లీ.. కోహ్లీ అంటూ సమాధానం చెప్పారు. ఇవన్ని ఇలా ఉంటే.. హారిస్ రవూఫ్ భార్య టీమిండియా పై సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Also Read : IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!
పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయినా తన భర్త చేసిన పనితో గర్వంతో ఉన్నానని.. ఆ జట్టు బౌలర్ హారిస్ రవూఫ్ భార్య మజ్ఞా మసూద్ తెలిపింది. సూపర్ 4 మ్యాచ్ సందర్భంగా రవూఫ్.. ఆపరేషన్ సింధూర్ లో భారత్ 6 ఫైటర్ జెట్లను కోల్పోయిందని వేళ్లతో సంజ్ఞలు చేశాడు. దీనిని ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసిన ముజ్ఞా.. “గేమ్ ఓడిపోయాం.. కానీ యుద్దం గెలిచాం” అని పేర్కొంది. యుద్ధమైనా, ఆటైనా గెలిచేది భారతే అని టీమిండియా ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. ఇండియా మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ రవూఫ్ ఓవర్ యాక్షన్ చేశాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూ.. రఫెల్ జెట్ ను కూల్చేశామని అర్థం వచ్చేలా సంజ్ఞ చేశాడు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తాము భారత్ రఫెల్ ను కూల్చేశామని.. పాకిస్తాన్ అబద్దాలు ప్రచారం చేసింది.
ఈ క్రమంలోనే సంజూ శాంసన్ వికెట్ తీసినప్పుడు కూడా రవూఫ్ అదే తరహా సెలబ్రేషన్ చేశాడు. దీంతో గెలవడం చేతగాని వాళ్లకు ఇలాంటివి అవసరమా..? అని ఇండియా ఫ్యాన్స్ అతనిపై మండిపడుతున్నారు. ఆసియా కప్ లో పాకిస్తాన్ తో జరిగిన సూపర్ 4 మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 171 పరుగులు చేసింది. 172 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా అలవొకగా ఛేదించింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ(74), శుబ్ మన్ గిల్ (47), తొలి వికెట్ కి 105 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోయినప్పటికీ తిలక్ వర్మ (30 నాటౌట్) నిలబడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ టోర్నీలో పాకిస్తాన్ పై భారత్ కి ఇది రెండో విజయం కావడం విశేషం. మరోవైపు పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ ఆసియా కప్ 2025 ఫైనల్ సెప్టెంబర్ 28న జరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. కానీ అది జరగడం జెర్ర కష్టం అనే చెప్పాలి. ఎందుకంటే..? శ్రీలంక,బంగ్లాదేశ్ తో గెలవడం పాకిస్తాన్ కి అంతా ఈజీ కాదు అనే చెప్పాలి. ఇటీవలే శ్రీలంకను సూపర్ 4 మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఓడించిన విషయం తెలిసిందే. ఈ నెల 24న బంగ్లాదేశ్ తో తలపడనుంది టీమిండియా.