IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు! ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 దశలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్తాన్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది భారత్. దీంతో పాకిస్తాన్ జట్టు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సామిబ్ జాదా ఫర్హాన్ 58 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు అంతా తక్కువ స్కోర్ కే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలోనే దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ఓ సంచలన సంఘటన చోటు చేసుకుంది.
Also Read : Fakhar Zaman catch : టీమిండియా తొండాట…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు
పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా మ్యాచ్ జరుగుతుండగా.. టీమిండియా-పాకిస్తాన్ అభిమానుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దీంతో టీమిండియా అభిమాని పాకిస్తాన్ క్రికెట్ అభిమానిని కొట్టాడు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, పోలీసులు వచ్చి ఇద్దరినీ సద్దు మణిగించారు. మరోవైపు ఈ మ్యాచ్ లో పాకిస్తాన్- ఇండియా ఆటగాళ్ల మధ్య గ్రౌండ్ లో గొడవలు జరిగాయి. పాకిస్తాన్ స్టార్ ఆటగాడు షాహిన్ ఆఫ్రిది ని అయితే బండ బూతులు తిట్టాడు అభిషేక్ శర్మ. షాహిన్ వేసిన ఫస్ట్ బాల్ నే సిక్సర్ గా మిలిచాడు అభిషేక్ శర్మ. ఆ తర్వాత నోటికి వచ్చిన బూతు పదాలతో రెచ్చిపోయాడు. అయితే అంతకు ముందు.. టీమిండియా ఓపెనర్లు బ్యాటింగ్ కు వస్తుంటే.. అఫ్రిది కాస్త ఓవరాక్షన్ చేశాడట.
Also Read : IND VS PAK: మరోసారి టీమిండియా వర్సెస్ పాక్ మ్యాచ్..చచ్చిన పామును మళ్లీ చంపడమే
ఈ మ్యాచ్ లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో దుమ్ము రేపాడు. 39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 74 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. “యూ టాక్.. వీ విన్” అంటూ మ్యాచ్ గెలిచిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మరోవైపు ఆసియా కప్ 2025లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన సూపర్ 4 మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ ఔట్ అయిన తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ నిర్ణయంపై పాకిస్తాన్ ఆటగాళ్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫఖర్ జమాన్ ఔట్ అయిన తర్వాత కూడా తన అసంతృప్తిని స్పష్టంగా వ్యక్తం చేశాడు. అతని ఔట్‌పై పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు, ప్రముఖ వ్యాఖ్యాతలు కూడా తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ, అంపైర్ నిర్ణయం సరికాదని పేర్కొన్నారు. ఇలా ఒకరిపై మరొకరూ విమర్శలు చేసుకోవడం గమనార్హం. మరోవైపు ఓపెనర్ ఫర్హాన్ అయితే ఏకంగా బ్యాట్ ను గన్ తోటి ఫైర్ చేసినట్టు షో చేయడం పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.