EMRS Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది బిగ్ భారీ గుడ్ న్యూస్. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) నుంచి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులకు పండగ లాంటి వార్త. పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమా. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం ఉంటుంది. లక్షల రూపాయల్లో జీతాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు – వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, జీతం, ముఖ్యమైన తేదీలు, దరఖాస్తు ఫీజు గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్ఎస్) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఖాళీగా ఉన్న 7,267 టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 23 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ వెకెన్సీల సంఖ్య: 7267
పోస్టులు – వెకెన్సీలు
ప్రిన్సిపల్: 225 పోస్టులు
పీజీటీ: 1460 పోస్టులు
హాస్టల్ వార్డెన్ (మేల్) : 346 పోస్టులు
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (క్లర్క్) : 228 పోస్టులు
అకౌంటెంట్ : 61 పోస్టులు
టీజీటీ: 3962 పోస్టులు
స్టాఫ్ నర్సు (ఫీమేల్) : 550 పోస్టులు
హాస్టల్ వార్డెన్ (ఫీమేల్) : 289 పోస్టులు
ల్యాబ్ అటెండెంట్: 146 పోస్టులు
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీజీ, బీఈడీ, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమాలో పాసై ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2025 సెప్టెంబర్ 19.
దరఖాస్తుకు చివరి తేదీ: 2025 అక్టోబర్ 23.
వయస్సు: ప్రిన్సిపల్ పోస్టులకు 50 ఏళ్ల మించరాదు. పీజీటీకి 40 ఏళ్లు మించరాదు. టీజీటీకి 35 ఏళ్లు మించరాదు. అకౌంటెంట్‌కు 30 ఏళ్లు, ల్యాబ్ అటెండెంట్‌కు 30 ఏళ్లు, హాస్టల్ వార్డెన్, ఫీమేల్ స్టాఫ్ నర్స్‌కు 35 ఏళ్లు, జూనియర్ సెక్రటేరియట్ అటెండెంట్‌కు 30 ఏళ్లు మంచిరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు ప్రిన్సిపల్‌కు రూ.78,800 – రూ.2,09,200 జీతం ఉంటుంది. పీజీటీకి రూ.47,600 – రూ.1,51,100 జీతం ఉంటుంది. టీజీటీకి రూ.44,900 – రూ.1,42,400 జీతం ఉంటుంది. అకౌంటెంట్‌కు రూ.35,400 – రూ.1,12,400 జీతం ఉంటుంది. ల్యాబ్ అటెండెంట్‌కు రూ.18,000 – రూ.56,900 జీతం ఉంటుంది. హాస్టల్ వార్డెన్‌కు రూ.29,200 – రూ.92,300 జీతం ఉంటుంది. ఫీమేల్ స్టాఫ్ నర్స్‌కు రూ.29,200 – రూ.92,300 జీతం ఉంటుంది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్‌కు రూ.19,900 – రూ.63,200 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ప్రిన్సిపల్ పోస్టుకు రూ.2,500 ఉంటుంది. టీజీటీ, పీజీటీ పోస్టులకు రూ.2,000 ఉంటుంది. నాన్-టీచింగ్ పోస్టులకు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్, మహిళా అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://nests.tribal.gov.in/
ALSO READ: AAI Recruitment: రూ.1,40,000 జీతంతో భారీగా ఉద్యోగాలు.. బంగారం లాంటి జాబ్, దరఖాస్తుకు 5 రోజులే గడువు