AK-47 Celebration: ఆసియా 2025 టోర్నమెంట్ లో భాగంగా…. నిన్న పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా… పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన… ఫర్హాన్ వివాదాస్పద సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. 50 పరుగులు చేసిన తర్వాత ఏకే 47 సెలబ్రేషన్స్ చేసుకున్నాడు పాకిస్తాన్ ఆటగాడు ఫర్హాన్. దీంతో ఈ సెలబ్రేషన్స్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్ జరుగుతోంది. మీరు వేసిన ఏ ఒక్క బాంబు పనిచేయలేదని… ఫర్హాన్ ను ఉద్దేశించి ఇండియన్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు. అయితే దానికి పాకిస్తాన్ దేశానికి సంబంధించిన అభిమానులు కూడా రీ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 2006 సమయంలో.. మహేంద్ర సింగ్ ధోని కూడా ఏకే 47 సెలబ్రేషన్స్ చేసుకున్నాడని… పాకిస్తాన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. మీకు ఒక న్యాయం ? మాకో న్యాయమా ? అంటూ నిలదీస్తున్నారు.
Also Read: Ind Vs Pak: చల్ పోరా పో….షాహిన్ అఫ్రీదిని బండ బూతులు తిట్టిన అభిషేక్…సిక్స్ కొట్టి మరీ
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) నేపథ్యంలో మహేంద్ర సింగ్ ధోని గతంలో చేసిన పనిని… ఇప్పుడు పాకిస్తాన్ అభిమానులు గుర్తు చేస్తున్నారు. నిన్న టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో…. ఫర్హాన్ వివాదాస్పద సెలబ్రేషన్స్ చేసుకున్న సంగతి తెలిసిందే. బ్యాట్ పైకి లేపి.. ఏకే 47 లెవెల్ లో ( AK-47 Celebration ) .. సెలబ్రేషన్స్ చేసుకున్నాడు ఫర్హాన్. అయితే దీన్ని… మనోళ్లు తీవ్రంగా తప్పు పడుతున్నారు. గ్రౌండ్లో ఇలాంటి సెలబ్రేషన్స్ ఏంటి అని అభిమానులు ఫైర్ అవుతున్నారు. అయితే దానికి కౌంటర్ గా మహేంద్ర సింగ్ గతంలో చేసిన పనిని గుర్తు చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ ( Team India vs Pakistan ) మ్యాచ్ నేపథ్యలో హరీస్ రౌఫ్ వివాదస్పదంగా వ్యవహరించాడు. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తూనే.. టీమిండియా ఫ్యాన్స్ ను రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. రఫేల్ జెట్ ను కూల్చేశామని టీమిండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యలో హరీస్ రౌఫ్ వివాదస్పదంగా సిగ్నల్స్ ఇచ్చాడు. ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇండియా విడిచిన రాకేట్స్ ను ( Rockets) ధ్వంసం చేశామని తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశాడు. అయితే.. హరీస్ రౌఫ్ వివాదస్పదంగా వ్యవహరించడంతో….టీమిండియా ( Team India) ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. కోహ్లీ, కోహ్లీ అంటూ అరుస్తూ.. హరీస్ రౌఫ్ పరువు తీశారు. గతంలో హరీస్ రౌఫ్ బౌలింగ్ లో కోహ్లీ కొట్టిన సిక్సులను గుర్తు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా…..ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ( Asia Cup 2025 tournament ) సూపర్ ఫోర్ లో భాగంగా నిన్న మ్యాచ్ జరుగగా… పాకిస్థాన్ జట్టును దారుణంగా ఓడించింది టీమిండియా. దీంతో ఫైనల్ కు వెళ్లే మార్గాన్ని సులభ తరం చేసుకుంది. మరో మ్యాచ్ లో టీమిండియా గెలిస్తే…ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ కు వెళ్లనుంది.
Sahibzada Farhan with AK-47 Celebration, but he was holding it wrong. Handle is supposed to symbolise the barrel. This is suicide 😅
MS Dhoni in 2006 with perfect AK-47 Celebration 🎉 and still the owner of this celebration 👏🏻#INDvPAK pic.twitter.com/I9olb2kwG5
— Richard Kettleborough (@RichKettle07) September 22, 2025