BigTV English

Survey: ఐటీ ఉద్యోగులూ బీఅలర్ట్.. సర్వేలో షాకింగ్ న్యూస్..

Survey: ఐటీ ఉద్యోగులూ బీఅలర్ట్.. సర్వేలో షాకింగ్ న్యూస్..
it employees

Survey: జాతీయ పోషకాహార సంస్థ.. ఐటీ రంగంలో ఉద్యోగుల ఆరోగ్యంపై ఆందోళనను వ్యక్తం చేసింది. ఒత్తిడితో కూడిన పనివిధానం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, గంటలకొద్దీ కూర్చొని పనిచేయడంతో అనేక రోగాల బారిన పడుతున్నారని హెచ్చరించింది. హైదరాబాద్‌ లోని ఐటీ సంస్థల్లో పని చేస్తున్న 183 మంది ఐటీ ఉద్యోగులపై అధ్యయనం చేసిన సంస్థ.. 46 శాతం మంది జీవనశైలి వ్యాధులబారిన పడే ప్రమాదంలో ఉన్నారని తేల్చింది.


ఐటీ రంగంలో పని చేస్తున్న ప్రతి 10 మందిలో ముగ్గురు రక్తపోటు, ఊబకాయం, మధుమేహం వంటి వ్యాధులబారిన పడుతున్నారని అధ్యయనంలో తేలింది. 35 ఏళ్ల లోపున్నవారు కూడా ఊబకాయం, రక్తపోటు, మధుమేహం బారినపడే ప్రమాదంలో ఉన్నారు. 30 సంవత్సరాల వయస్సు పైబడిన ఉద్యోగుల్లో ఆరోగ్య సమస్యలు మరింతగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.

సగటున 8 గంటల కంటే ఎక్కువ సమయం కూర్చుని పని చేయడం, తరచూ బయట తినడం, రోజువారీ ఆహారంలో పండ్లు, కూరగాయలు తక్కువగా తీసుకోవడం, భోజనంలో సమయపాలన పాటించకపోవడం వంటి కారణాలతో ఐటీ ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.


ఐటీ కంపెనీల్లో ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు అవసరమని జాతీయ పోషకాహార సంస్థ స్పష్టం చేసింది. మంచి ఆహారపు అలవాట్లు, వ్యాయామం, తగిన విశ్రాంతి పద్ధతులను అలవర్చడానికి ఈ కేంద్రాలు పని చేయాలంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×