BigTV English

Nails : గోళ్లను ఇంటి లోపల తీయకూడదా..

Nails : గోళ్లను ఇంటి లోపల తీయకూడదా..

Nails పూర్వం మన పెద్దోళ్లు చెప్పిన ప్రతీ మాట వెనుక ఒక అర్ధం ఉంటుంది. ఆ పని ఇలా చేయద్దు..అలా చేయద్దు అని చెప్పడానికి ప్రత్యేకమైన కారణాలు ఉంటాయి. నాగరికతలు వాసనలు తెలియని ఆ రోజుల్లో ప్రజాసంక్షేమం కోసం ఎన్నో నిబంధనలు ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు అతినాగరికత ఎక్కువై అన్నింటిని పాత చింతకాయ పచ్చడి అని తీసిపారేస్తున్నారు.


కాలిగోళ్లను చేతి గోళ్లను మనం నివసించే ఇంటి లోపల తీయకూడదు. అంతే కాదు వెంట్రుకలను ఇంటి లోపల కత్తిరించకూడదని పెద్దలు చెప్పారు. మనుషుల పాపాలు వెంట్రుకలలోనూ గోళ్లలోను దాగి ఉంటాయని చాలా మతాల విశ్వాసం ఉంది. మనం తిరుపతి వెళ్లినప్పుడు వెంట్రుకలు ఇచ్చే కారణం కూడా ఇదే. దేవునికి వెంట్రుకలు సమర్పిస్తే పాపాలు లగిపోతాయని విశ్వాసం.

గోళ్లను ఇంటిలోపల తీయరాదని చెప్పటంలో ఒక శాస్త్రీయ కారణం ఉంది. మన గోళ్లు ఆహారం రంగులో సులభంగా కలిసిపోతాయి. పొరపాటున ఇంట్లో తీసిన గోళ్లు ఆహార పదార్థాలలో కలిసిపోయి కడుపులోకి పోయే అవకాశం ఉంది. అదే విధంగా కత్తిరించిన చిన్న వెంట్రుకల ముక్కులు ఆహారం ద్వారా కడుపులోకి వెళ్లి ప్రేగులకు అంటుకునే పోయే అవకాశం ఉంది. కాలిగోళ్లు కడుపులోకి వెళ్లే జీర్ణం కావు. మనిషికి అన్నింటిని జీర్ణించుకునే జీర్ణ వ్యవస్థ లేదు. జీర్ణం కాకుండా ఉండిపోతే శాశ్వత ఉదర సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అలా కాకుండా బయటకు మలద్వారం గుండా విసర్జించబడినా, విసర్జించే సమయంలో ప్రేగులకి హాని కలగవచ్చు.


ఇంకో కారణం కూడా ఉంది. గోళ్లలో విషం ఉంటుంది. ఇంట్లో నేలమీద పారాడే పసిపిల్లలకు గుచ్చుకుని విషజ్వరాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే ఇళ్లలో గోళ్లు తీయద్దనడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయి.

Tags

Related News

Navratri Day-2: నవరాత్రి రెండో రోజు.. అమ్మవారిని ఎలా పూజించాలి ?

Navaratri 2025: నవరాత్రుల సమయంలో.. ఇలా చేస్తే పట్టిందల్లా బంగారమే !

Bathukamma 2025: మూడో రోజు బతుకమ్మ.. ముద్దపప్పు నైవేద్యంగా పెట్టడం వెనక ఇంత కథ ఉందా ?

Bathukamma Festival 2025: 9 రోజుల బతుకమ్మ.. ఏ రోజు ఏ నైవేద్యం పెడతారు ?

Yaksha questions: యక్ష ప్రశ్నలు అంటే ఏమిటి? ఎందుకు అంత ప్రాధాన్యం

Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ.. సమర్పించే నైవేద్యం, ప్రత్యేకత ఏంటో తెలుసా ?

Bathukamma 2025: ఎంగిలి పూల బతుకమ్మ.. ఇంతకీ ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా ?

Amavasya 2025: ఆదివారం అమావాస్య.. సాయంత్రం లోపు ఇలా చేయకుంటే అష్టకష్టాలు

Big Stories

×