Mahindra EV : భారత మార్కెట్లో ఇప్పటికే ఉన్న ఎలక్ట్రిక్ స్కూటీలకు పోటీగా… మహీంద్రా అండ్ మహీంద్రా నయా మోడల్ ను లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ “ప్యుగోట్ కిస్బీ”ని… వచ్చే ఏడాది మన దేశంలో రోడ్డెక్కించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
2023 జనవరి నుంచి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్న కిస్బీ ధర… లక్ష రూపాయలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. తక్కువ ధరలో తీసుకొస్తున్న కిస్బీ… ఏథర్, ఓలా, బజాజ్, టీవీఎస్, హీరో సహా ఇతర స్టార్టప్ కంపెనీల ఎలక్ట్రిక్ టూ వీలర్లకు గట్టి పోటీ ఇవ్వొచ్చని భావిస్తున్నారు.
ఇక కిస్బీ స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే… 1.6 కిలోవాట్ రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీతో వస్తున్న కిస్బీ… గంటకు 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో 42 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుందని చెబుతున్నారు. అంటే… ఇంటి నుంచి తక్కువ దూరంలో ఉండే మార్కెట్లు, స్కూళ్లు, ఆఫీసులకు వెళ్లి వచ్చేందుకు మాత్రమే కిస్బీ ఉపయోగపడుతుంది. రోజూ 60 నుంచి 100 కిలోమీటర్లు ప్రయాణించే వాళ్లు… కిస్బీ వైపు చూడకపోవడం బెటర్.
ఇటీవలే కిస్బీ టెస్ట్ రన్ కూడా నిర్వహించింది… మహీంద్రా అండ్ మహీంద్రా. ఇందులో హైటెక్ ఫీచర్లను జోడించారని సమాచారం. ట్యూబులర్ స్టీల్ వీల్,టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ హైడ్రాలిక్ షాక్ అబ్జార్బర్, 14 ఇంచ్ వీల్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్స్ తో కిస్బీ లాంచ్ కాబోతోందని భావిస్తున్నారు.