E-Paper
Advertisement

Summer Cooling Tips: ఇదిగో బ్యాచిలర్ బాయ్స్.. ఏసీ లేదని బాధపడుతున్నారా? ఈ టిప్స్‌తో కూలింగ్ తన్నుకుంటూ వస్తది!

Summer Cooling Tips: ఇదిగో బ్యాచిలర్ బాయ్స్.. ఏసీ లేదని బాధపడుతున్నారా? ఈ టిప్స్‌తో కూలింగ్ తన్నుకుంటూ వస్తది!
Advertisement

Summer Cooling Tips: సమ్మర్ వచ్చిందంటే చాలు.. పెద్ద ఎత్తున ప్రజలు ఏసీలపై ఆధారపడిపోతుంటారు. భానుడి ప్రతాపం నుంచి తప్పించుకునేందుకు ఏసీ గదుల్లో ఎక్కువ సమయం గడిపేందుకు యత్నిస్తుంటారు. అయితే ఇలా అందరికీ ఏసీని కొనుగోలు చేసే ఆర్థిక స్తోమత ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఇంటికి దూరంగా నగరాల్లో ఓ చిన్నపాటి గదుల్లో జీవించే వారిలో మెజారిటీ యువత.. సమ్మర్ లో ఏసీ లేకుండానే జీవిస్తుంటారు. అలాంటి వారు ఏసీతో పనిలేకుండా పర్యావరణ అనుకూలమైన చిట్కాలతో గదిని చల్లగా ఉంచుకోవచ్చు. ఆవేంటో ఇప్పుడు చూద్దాం.

క్రాస్ వెంటిలేషన్

పగటిపూట వేడి గాలి ఎక్కువగా వీస్తుందన్న సంగతి తెలిసిందే. కాబట్టి ఆ సమయంలో కిటికీలు మూసి ఉంచాలి. తిరిగి సాయంత్రం వేళల్లో ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఇంటికి ఎదురెదురుగా ఉన్న కిటికీలను తెరవడం ద్వారా గాలి ప్రసరణ (Cross ventilation) మెరుగుపడుతుంది. ఇది ఇంట్లోని వేడిని బయటకు పంపి చల్లని గాలిని లోపలికి తెస్తుంది.

ముదురు రంగు కర్టెన్లు

Advertisement

సూర్యరశ్మి నేరుగా గదుల్లోకి పడకుండా ముదురు రంగు లేదా జనపనార (Jute) వంటి సహజ పదార్థాలతో చేసిన కర్టెన్లను వాడండి. ఇవి వేడిని గ్రహించి గది ఉష్ణోగ్రత పెరగకుండా చూస్తాయి. వెదురుతో చేసిన తడకలు (Bamboo blinds) వాడటం మరింత ఉత్తమంగా చెప్పవచ్చు.

ఇంట్లోనే మెుక్కల పెంపకం

మొక్కలు గాలిలోని తేమను పెంచి సహజంగా చల్లదనాన్ని ఇస్తాయి. కలబంద (Aloe Vera), స్నేక్ ప్లాంట్, మనీ ప్లాంట్ వంటి మొక్కలను గదుల్లో ఉంచడం వల్ల గాలి శుద్ధి అవ్వడమే కాకుండా ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.

తెల్లటి రూఫ్ పెయింట్

Advertisement

ఇంటి పైకప్పుపై తెల్లటి సున్నం లేదా రిఫ్లెక్టివ్ పెయింట్ వేయడం ద్వారా సూర్యరశ్మి బారి నుంచి తప్పించుకోవచ్చు. ఈ తెల్లటి పెయింట్ వల్ల ఇంటి పైకప్పు త్వరగా వేడెక్కదు. ఇంటి లోపల ఉష్ణోగ్రత దాదాపు 3°C నుండి 5°C వరకు తగ్గే అవకాశం ఉంది.

Also Read: Induction Stove Deals: అమెజాన్ బంపర్ సేల్.. డెడ్ చీప్‌గా ఇండక్షన్ స్టవ్స్.. ఆలస్యం చేశారో నో స్టాక్ పడిపోద్ది!

కాటన్ ఫ్యాబ్రిక్స్

పరుపుల మీద వేసే బెడ్ షీట్లు, సోఫా కవర్ల కోసం కాటన్ (Cotton) లేదా లినెన్ వస్త్రాలను మాత్రమే వాడండి. సింథటిక్ వస్త్రాలు వేడిని పట్టి ఉంచితే.. కాటన్ మాత్రం గాలిని పంపిస్తూ చల్లదనాన్ని ఇస్తుంది. రాత్రిపూట పడుకునే ముందు బెడ్ షీట్లను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి వాడటం కూడా ఒక మంచి ట్రిక్ అని చెప్పవచ్చు.

Also Read: LG OLED evo vs Non-evo: థియేటర్ రేంజ్ క్వాలిటీ.. పిక్చర్ నాణ్యతలో తగ్గేదేలే.. రెండింటిలో ఏది బెస్ట్!

Related News

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Ninnu kori Serial Today Episode October 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను  శ్రీజ మర్చిపోతుందా..? – మదన్ ప్లాన్ సక్సెస్ అవుతుందా..?    

Big Stories

Advertisement
×