Big Stories

Alzheimers : అల్జీమర్స్‌ను కనిపెట్టగల స్మార్ట్ ఫోన్ టెక్నాలజీ..

- Advertisement -

Alzheimers : ఎన్నో మానసిక వ్యాధులకు అడ్వాన్స్ టెక్నాలజీ ద్వారా సమాధానాలు కనుక్కోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వారి ప్రయత్నాలు పూర్తిగా సక్సెస్ అవ్వడం లేదు. టెక్నాలజీ ఎంత పెరిగినా కూడా ఇప్పటికీ కొన్ని మానసిక వ్యాధులకు కారణలేమిటీ అని నిర్ధారించలేకపోతున్నారు. అల్జీమర్స్ లాంటి వ్యాధుల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ఇబ్బందులు పడుతుండడంతో శాస్త్రవేత్తలు ఒక కొత్త పరిష్కారాన్ని కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు.

- Advertisement -

అల్జీమర్స్ వంటి వ్యాధులను ముందుగానే గుర్తించడం కోసం ఇప్పటికే ఎన్నో టెక్నిక్స్ అందుబాటులో ఉన్నా కూడా అవన్నీ పూర్తిస్థాయిలో పేషెంట్లకు సాయంగా నిలబడలేకపోతున్నాయి. అందుకే ఒక మెషీన్ లెర్నింగ్ మోడల్ ద్వారా స్మార్ట్‌ఫోన్స్‌లోనే అల్జీమర్స్‌ను కనిపెట్టేలాగా కొత్త రకమైన టెక్నాలజీని తయారు చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. 70 నుండి 75 శాతం కచ్చితంగా ఈ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీ అల్జీమర్స్ పేషెంట్లకు, మిగతా పేషెంట్లకు తేడా కనుక్కుంటుందని తెలిపారు.

మనిషి మాట్లాడుతున్న విధానాన్ని బట్టి వారికి అల్జీమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేదా అని ఈ కొత్త రకమైన టెక్నాలజీ కనిపెట్టనుంది. ఈ టూల్ ద్వారా అల్జీమర్స్‌ను ముందుగానే కనిపెట్టగలిగితే.. ముందుగానే పేషెంట్లకు చికిత్సను అందించి, అల్జీమర్స్ వ్యాప్తి వేగాన్ని అరికట్టవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. ఒకవేళ అల్జీమర్స్ పేషెంట్లను స్మార్ట్ ఫోన్ ద్వారా కనిపెట్టగలిగితే.. వారికి అవసరం ఉన్న ప్రతీసారి వైద్యులను సంప్రదించడం సులభంగా మారుతుందని కూడా వారు భావిస్తున్నారు.

అల్జీమర్స్‌ను ముందుగా కనిపెట్టాలని శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న ఈ క్రమంలో స్మార్ట్ ఫోన్ స్క్రీనింగ్ టూల్ అనేది పేషెంట్లకు ఎంతగానో ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అంతే కాకుండా ఇది పేషెంట్లను ఎప్పుడూ కనిపెడుతూ ఉండి వారికి అవసరమైన సాయాన్ని అందించేలా దీనిని డిజైన్ చేస్తున్నారు. అల్జీమర్స్ అనేది ముందు స్టేజీలలో కనుక్కోవడమే కష్టమని, ఒకసారి దానిని కనిపెడితే దాని వ్యాప్తిని అరికట్టడానికి ఎన్నో మెరుగైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. అందుకే వీలైనంత త్వరగా ఈ టెక్నాలజీని మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొని రావాలని సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News