BigTV English

Sound Pollution : సౌండ్ పొల్యూషన్.. ఇంత ప్రభావం చూపుతోందా!

Sound Pollution : సౌండ్ పొల్యూషన్.. ఇంత ప్రభావం చూపుతోందా!

Sound Pollution : ఈరోజుల్లో మనిషి శారీరిక ఆరోగ్యం మాత్రమే కాదు.. మానసిక ఆరోగ్యం కూడా చిన్న చిన్న విషయాల వల్ల దెబ్బతింటుందని నిపుణులు చెప్తున్నారు. అందుకే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం కోసం ఎలా కష్టపడతారో.. మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కూడా అలాంటి ప్రయత్నాలు చేయాలని అంటున్నారు. అందులో ఒకటి నిశబ్దంలో జీవించడమని శాస్త్రవేత్తలు తెలిపారు. నిశబ్దం అనేది మనసులకు ప్రశంతాతతో పాటు మానిసికంగా కూడా చాలా లాభాలను అందిస్తుందని బయటపెట్టారు.
ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు చాలామంది జీవితాల్లో ఫోన్ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది. రోజంతా పనులు చేసి అలసిపోయి నిద్రపోవాలి అనుకుంటున్న సమయంలో కూడా ఫోన్ ఏదో రకంగా డిస్టర్బ్ చేస్తుంది. అదే ఆ ఫోన్‌ను కాసేపు సైలెంట్‌లో పెడితే ఎలా ఉంటుంది.? చాలా ప్రశాంతమైన నిద్రకు ఇది కూడా ఒక కారణమవుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. కేవలం ఫోన్ మాత్రమే కాదు.. సడెన్‌గా ఎక్కువ శబ్దం ఎక్కడ నుండి వచ్చిన అది మనుషులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేస్తుందని, అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిపారు.
ఎక్కువ డెసిబుల్‌తో చెవులను తాకిన శబ్దం ఒక్కసారిగా ఇతర సెన్సెస్‌ను కూడా అలర్ట్ చేస్తుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలింది. ఈరోజుల్లో గాలి కాలుష్యం, నీటి కాలుష్యం లాంటివి పెరిగిపోయాయని, వాటిని అదుపు చేయాలని చాలామంది గొంతెత్తి చెప్తున్నారు. కానీ శబ్ద కాలుష్యం కూడా ప్రాణాలకు ఏదో ఒక రకంగా ముప్పు కలిగిస్తుందని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. ఒక్కొక్కసారి పబ్లిక్ ప్రదేశాల్లో కూడా కొంతమంది గట్టిగా శబ్దాలు చేయడం, మాట్లాడడం లాంటివి చేస్తుంటారు. అవి కూడా శబ్ద కాలుష్యంలో భాగమే అని తెలిపారు.
మతపరమైన ప్రదేశాలు కూడా శబ్ద కాలుష్యాన్ని పెంచేవాటిలో ముఖ్యమైనవి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రోజూ ఉదయం స్పీకర్లలో మంత్రాలు లాంటివి పెట్టడం అనేది చాలామందికి డిస్టర్బెన్స్‌తో పాటు శబ్ద కాలుష్యాన్ని కూడా పెంచుతుందని అంటున్నారు. ముఖ్యంగా ఇతర ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న అంశాలు చాలనే ఉన్నాయని అన్నారు. పెళ్లిళ్లు, సెలబ్రేషన్లతో పాటు ఆఖరికి చావుల సమయంలో కూడా గట్టి గట్టి శబ్దాలతో కాలుష్యాన్ని పెంచడం అందరికీ అలవాటయిపోయిందని విమర్శించారు.
తాజా సర్వే ప్రకారం ఇండియన్స్ స్లీప్ ఇండెక్స్ అనేది అంత ఉత్సాహకరంగా లేదని శాస్త్రవేత్తలు బయటపెట్టారు. దీనికి పెరుగుతున్న శబ్ద కాలుష్యం కూడా ఒక కారణమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. ఫోన్ల రింగ్ శబ్దం తగ్గించడం, మతపరమైన ప్రదేశాలలో పెద్ద పెద్ద శబ్దాలు చేయకపోవడం.. ఇలాంటివి చేయడం వల్ల మార్పు మొదలవుతుందని, దాని వల్ల శబ్ద కాలుష్యం అదుపులోకి రావడంతో పాటు మనసుకు కూడా ప్రశాంతత కలుగుతుందని శాస్త్రవేత్తలు సలహా ఇచ్చారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×