BigTV English

Startups Issues : కష్టకాలంలో స్టార్టప్స్.. నిపుణుల సలహా ఏంటంటే..?

Startups Issues : కష్టకాలంలో స్టార్టప్స్.. నిపుణుల సలహా ఏంటంటే..?
Startups Issues

Startups Issues : కోవిడ్ మహమ్మారి అనేది మనుషుల ఆరోగ్యాలపై మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇంకా ఎన్నో విషయాలపై ఎఫెక్ట్ చూపించింది. దీని కారణంగా ఎన్నో రంగాలు నష్టాన్ని చవిచూశాయి. కొన్ని రంగాలు ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాయి. అందుకే అప్పటినుండి ఎకానమీ అనేది మరింత చిక్కుల్లో పడిపోయింది. ఇలాంటి సమయంలో స్టార్టప్ కంపెనీల పరిస్థితి మరీ దయనీయంగా ఉందని స్టడీలో తేలింది.



2022లో కూడా ప్రపంచ ఎకానమీ అనేది ఇబ్బందుల్లోనే ఉంది. కానీ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు వాటికి ఉన్న వనరులతో నష్టాలు నుండి బయటపడగలిగాయి. కొన్ని దేశాలు మాత్రం ఇంకా ఈ ఇబ్బందులను ఎదుర్కుంటూనే ఉన్నాయి. 2023లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యాక్రో ఎకానమిక పరిస్థితుల వల్ల స్టార్టప్ కంపెనీలకు పెట్టుబడులు దొరకక.. ఇబ్బందుల్లో పడుతున్నారు. 2022లో ప్రారంభించిన స్టార్టప్స్‌లో కేవలం 53 శాతమే పెట్టుబడుల విషయంలో పాజిటివ్ రెస్పాన్స్‌ను అందుకున్నాయి.


2022లోనే సక్సెస్ రేట్ తక్కువగా ఉండడంతో ఈ ఏడాది కూడా అలాగే కొనసాగనుందని స్టార్టప్స్ అంచనా వేస్తున్నాయి. 58 శాతం స్టార్టప్స్.. ఫండ్స్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని ఓ ప్రముఖ సంస్థ ప్రకటించిన రిపోర్టులో తేలింది. చీప్ మనీ, పెరిగిన ఇంట్రెస్ట్ రేట్లు, జియోపొలిటికల్ వాతావరణం వంటివి స్టార్టప్ ఎకోసిస్టమ్‌పై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇలాంటి సమయాల్లో ముందునుండే సమర్థంగా ఉన్న కంపెనీలపై పెట్టుబడిదారుల చూపు మళ్లింది.



స్టార్టప్స్‌ను ప్రోత్సహించే ఫిన్‌టెక్ సంస్థ నుండి ప్రారంభమైన నాలుగు స్టార్టప్స్ మాత్రమే గతేడాదిలో పెట్టుబడులను ఆకర్షించగలిగాయి. 2021లో ఈ సంఖ్య 13 ఉండగా.. 2022లో ఇది నాలుగుకు తగ్గిపోయింది. ప్రస్తుతం స్టార్టప్స్ ఎదుర్కుంటున్న ఈ పరిస్థితినే ఫండింగ్ వింటర్ అంటారని నిపుణులు చెప్తున్నారు. ఇన్‌ఫ్లేషన్, మ్యాక్రో ఎకానమిక్ పరిస్థితుల వల్ల పెట్టుబడిదారులు స్టార్టప్స్ నుండి పెద్ద బిజినెస్ సంస్థలకు షిఫ్ట్ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
పెట్టుబడులు రాకపోవడంతో, నష్టం చవిచూడడంతో.. స్టార్టప్ సంస్థలు మూసివేయడానికి కూడా వెనకాడడం లేదు. క్యాష్‌ను రిజర్వ్ చేసి పెట్టుకోవడం, కస్టమర్ ఫీడ్‌బ్యాక్‌కు ప్రాముఖ్యత ఇవ్వడం లాంటివి చేస్తేనే స్టార్టప్ కంపెనీలు ఎక్కువకాలం నిలబడడానికి ఉపయోగపడతాయని నిపుణులు సలహా ఇస్తున్నాయి. కస్టమర్లకు ఎప్పుడు చేరువలో ఉండడం వల్ల వారి అభిరుచులు ఎలా మారుతాయో తెలుస్తుందని దాన్నిబట్టి నిర్ణయాలు తీసుకోవచ్చని వారు చెప్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×