BigTV English

Eggs Business: కోడిగుడ్ల వ్యాపారిగా టెకీ.. రూ.22 కోట్ల ఆదాయం

Eggs Business: కోడిగుడ్ల వ్యాపారిగా టెకీ.. రూ.22 కోట్ల ఆదాయం

Eggs Business: దాదాపు పదేళ్ల క్రితం ఐరోపాలో పర్యటించిన ఆకాశ్ జ్యోతి గొగోయ్‌కి పాలు, మాంసం, గుడ్ల వ్యాపారాలు ఎంతో లాభసాటి అన్న విషయం అవగతమైంది. సొంత రాష్ట్రమైన అసోంలో కోళ్ల పరిశ్రమలు అంతంతమాత్రమే. తాజా గుడ్ల లభ్యత కూడా తక్కువే. ఆకాశ్ టెక్నో-ఆంత్రప్రెన్యూర్‌షిప్ ప్రయాణానికి బాటలు పర్చింది ఈ అంశాలే. బెంగళూరు యూనివర్సిటీ నుంచి 2001లో కంప్యూటర్ సైన్స్ పట్టా పుచ్చుకున్నాడు ఆకాశ్. 2014లో ఐరోపా పర్యటన అతని జీవితాన్ని మలుపు తిప్పింది. అసోంలో పౌల్ట్రీ రంగం వెనుకబడి ఉండటాన్ని అవకాశంగా మలచుకున్నాడు.


2017లో లేయర్ పౌల్ట్రీ ఫార్మింగ్‌లోకి అడుగు పెట్టాడు. లేయర్ పౌల్ట్రీ ఫార్మింగ్‌ అంటే.. ప్రత్యేకించి కోడిగుడ్ల కోసమే పెంచే కోళ్లు అన్నమాట. ఇలాంటి కోడి‌పిల్లలను మొదటి రోజు నుంచే ప్రత్యేకంగా పెంచుతారు. 18-19 వారాల వయసు వచ్చేసరికి.. అవి గుడ్లను పెట్టడం ఆరంభిస్తాయి. అసోంకు కోడిగుడ్లు ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సిందే. స్థానికంగా కోళ్ల పెంపకం పెద్దగా లేనందున గుడ్ల ఉత్పత్తి కూడా తక్కువగానే ఉండేది. స్థానిక మార్కెట్ తీర్చగలిగేది డిమాండ్‌లో పది శాతం మాత్రమే.

అసోం అవసరాలు తీరాలంటే 560 కోట్ల గుడ్లు అవసరం. కానీ స్థానికంగా గుడ్ల ఉత్పత్తి మాత్రం 47.5 కోట్ల గుడ్లకే పరిమితమైంది. మిగిలిన 512.5 కోట్ల గుడ్లను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. గుడ్ల వ్యాపారం సాధ్యాసాధ్యాలపై ఆకాశ్ 6-7 నెలల పాటు విస్తృతంగా అధ్యయనం చేశాడు. తమిళనాడులో వివిధ ప్రాంతాల్లో.. ముఖ్యంగా ఎగ్ సిటీగా పేరొందిన నమక్కళ్‌తో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించాడు. లేయర్ పౌల్ట్రీ ఫార్మింగ్‌ లోతుపాతులన్నీ తెలుసుకున్నాడు.


నార్త్ ఈస్ట్ ఆగ్రో ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ పేరిట జోర్హాట్‌లో వ్యాపారానికి శ్రీకారం చుట్టాడు ఆకాశ్. 2018లో ప్రొడక్షన్ ఆరంభం కాగా.. బాహుబలి పేరిట గుడ్ల అమ్మకాన్ని ఆరంభించాడు. సేవింగ్స్‌లో కొంత భాగాన్ని పెట్టుబడిగా పెట్టాడు. మరో రూ.3 కోట్ల వరకు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు. సొంత భూమి ఉండటంతో ఆకాశ్ పని కొంత సులువైంది. 2021లో రెండో ఫాం కోసం రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టాడు. మొత్తం రెండు ఎకరాల్లో 1.2 లక్షల కోళ్లతో పౌల్ట్రీ విస్తరించింది.

తొలుత రోజుకు 20 వేలగుడ్ల ఉత్పత్తి ఉండేది. సైజులో పెద్దవిగా ఉండటంతో ఆకాశ్ గుడ్లకు గిరాకీ పెరిగింది. తాజా గుడ్లు అయితే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా ఆకాశ్‌కు వినియోగదారులు పెరిగారు. అడిగి మరీ తమ బాహుబలి గుడ్లను కొనేవారని ఆకాశ్ చెప్పాడు. ఇప్పుడు అసోంలో ఎక్కడ చూసినా ఇవే గుడ్లు కనిపిస్తాయి. సాధారణ ఎగ్స్‌ 52-53 గ్రాములు ఉంటే.. బాహుబలి గుడ్లు 58-62 గ్రాముల వరకు బరువు ఉండేవని ఆకాశ్ చెప్పాడు.

హోల్‌సేల్‌లో ఒక్కో గుడ్డు ధర రూ.6 కాగా.. రిటైల్‌లో రూ.8 వరకు ధర ఉంది. ఏటా ఆదాయం రూ.20-22 కోట్ల వరకు ఉంటుందని, అయితే ఇది మార్కెట్ స్థితిగతులపై ఆధారపడి ఉంటుందని ఆకాశ్ వివరించాడు. దీనికి అనుబంధంగా ఆర్గానిక్ బయో-ఫెర్టిలైజర్ వ్యాపారాన్ని కూడా చేపట్టడం విశేషం. బయో-ఫెర్టిలైజర్లపై ఏట ఎంత లేదన్నా రూ.40-50 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నాడు. కోడిగుడ్ల పరిశ్రమ ద్వారా ఆకాశ్ వంద మందికి ఉపాధి చూపగలుగుతున్నాడు. అసోంలో 7-8 రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా బాహుబలి గుడ్ల అమ్మకాలను విస్తరించాలనేది అతని లక్ష్యం.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×