BigTV English

Allan Donald : కేప్ టౌన్ లోనూ భారత్ బౌలర్లకు అగ్ని పరీక్షే.. రెండో టెస్టుపై డోనాల్డ్ కామెంట్స్..

Allan Donald :  కేప్ టౌన్ లోనూ భారత్ బౌలర్లకు అగ్ని పరీక్షే.. రెండో టెస్టుపై డోనాల్డ్ కామెంట్స్..
Allan Donald

Allan Donald : సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఘోర ఓటమితో తీవ్ర అవమానాలు పడిన టీమ్ ఇండియాకు మరో అగ్నిపరీక్ష ఎదురుకానుందని సఫారీ మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ అన్నాడు. కేప్ టౌన్ లో జనవరి 3 నుంచి జరగనున్న రెండో టెస్ట్ లో భారత్ పేసర్లకు తీవ్ర ఇబ్బందులు తప్పవని అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి, ఇక్కడే సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేసిన సౌతాఫ్రికా క్రికెటర్లకు ఇక్కడెలా బౌలింగ్ చేయాలో తెలుసన్నాడు.


తొలి టెస్టులో పిచ్ కి తగినట్టుగా సఫారీ బౌలర్ల బాల్ ఎక్కడ వేయాలో సరిగ్గా అక్కడే వేశారు. అదే భారత్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్ దొరక్క ఇబ్బంది పడ్డారని డోనాల్డ్ చెప్పాడు. ఏ బాల్ కి వికెట్లు పడుతున్నాయి. ఏ బాల్ కి ఫోర్లు కొడుతున్నారనేది భారత్ బౌలర్లు తెలుసుకునే సరికి సౌతాఫ్రికా బ్యాటర్లు క్రీజులో పాతుకుపోతున్నారని వివరించాడు.

ఇకపోతే టీమ్ ఇండియా బౌలర్లు పిచ్ ను గమనించి అందుకు తగినట్టుగా బౌలింగ్ చేయడం అంత ఆషామాషీ కాదని డోనాల్డ్ అన్నాడు. కాకపోతే సఫారీ పేసర్లు ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఓపికగా బౌలింగ్ చేశారని… రెండో ఇన్నింగ్స్ లో కొంచెం లయ దొరికి షార్ట్ పిచ్ బంతులను వేశారని తెలిపాడు. అయితే రెండో టెస్ట్  లో, ఇదే విధంగా బౌలింగ్ చేయాలి. బాల్ ని బలంగా పిచ్ మధ్యపై గుచ్చితే మరింత ప్రయోజనం ఉంటుందని అన్నాడు.


కేప్ టౌన్ పిచ్ బ్యాటర్లకు స్వర్గధామంలాంటిదిని డోనాల్డ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. బౌలర్లకు విషమ పరీక్ష తప్పదని హెచ్చరించాడు. పేస్ బౌలింగ్ నుంచి ఏ మాత్రం ప్రయోజనం పొందాలన్నా తొలి ఇన్నింగ్స్ లో 25-30 ఓవర్లు మాత్రం విభిన్నమైన బంతులతో ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని అన్నాడు.

బ్యాటర్లకు సంబంధించి కూడా కొన్ని సూచనలు చేశాడు డోనాల్డ్. సౌతాఫ్రికా పిచ్ లపై ఏ బాల్ ను వదిలేయాలి? ఏ బాల్ ఆడాలి అనేది సచిన్ కి తెలిసినంతగా ఎవరికీ తెలీదన్నాడు. ఆ టెక్నిక్ తెలిస్తే చాలు, క్రీజులో ఎక్కువ సేపు నిలబడవచ్చునని తెలిపాడు. అలా చేస్తే పరుగులు వాటంతటవే వస్తాయని అన్నాడు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మాదిరిగా బంతి బ్యాట్ పైకి ఎక్కువగా రాదు. ఫుట్ వర్క్ సరిగా లేకపోతే తొలి టెస్టులో ఎదురైన అనుభవమే పునరావృతం కాక తప్పదని భారత్ బ్యాటర్లను హెచ్చరించాడు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×