ఫార్ములా ఈ కార్ రేసు కేసు వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు దర్యాప్తు సాగుతోందని అన్నారు. అయితే.. ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకు కేంద్రం అనుమతి అవసరమని తెలిపారు.
ఉత్తరాంధ్రలో పరిశ్రమలకు కేటాయిస్తున్న భూముల్లో ల్యాండ్ సెటిల్‌మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాజకీయ నాయకులు ల్యాండ్ సెటిల్‌మెంట్స్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. భూ కబ్జాలపై నిందితులను వదిలిపెట్టొద్దని పవన్ చెప్పారు.
హైదరాబాద్‌లోని కీసర పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు స్కూటీని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందారు. ORR దగ్గర కుషాయిగూడ నుంచి.. కీసర మీదుగా మరియాల వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లింగగూడెంలో అమానవీయ ఘటన జరిగింది. లలిత అనే దళిత గర్భిణీ అనారోగ్యంతో మృతి చెందింది. కీడు వస్తుందని లలిత మృతదేహాన్ని ఊర్లోకి రాకుండా కొందరు గ్రామస్తులు అడ్డుకున్నారు. మృతదేహాన్ని రాత్రంతా చలిలోనే ఊరు బయట ఉంచి.. మృతురాలి బంధువులు అంత్యక్రియలు నిర్వహించారు.
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు సాగిస్తున్న సిట్‌కు అదనపు బలం చేకూరింది. దీని కోసం సిట్‌లో అదనంగా సీనియర్ పోలీస్ అధికారులతోపాటు మరికొందరిని సభ్యులుగా నియమిస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలో సిట్ దర్యాప్తు చేస్తుంది.
పరకామణి కేసుపై ఇవాళ ఏపీ హైకోర్ట్‌లో విచారణ జరగనుంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో.. ఇవాళ హైకోర్ట్ ఏం చెబుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పైగా ఇప్పటికే పరకామణి కేసు అంశంపై ఏపీ హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. 15 వేల కోట్ల విలువైన భూములపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వనస్థలిపురం దగ్గర ఉన్న 102 ఎకరాల భూమి.. తెలంగాణ రాష్ట్ర పరిధిలోని అటవీ శాఖదేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
విశాఖలోని యారాడ తీరంలో ఓ భారీ తిమింగలం ప్రత్యక్షమైంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలలో అరుదైన బ్లూవేల్ చిక్కుకుంది. వేట ముగించుకుని తీరానికి చేరుకున్న తర్వాత వలను పరిశీలించిన మత్స్యకారులు.. అందులో భారీ తిమింగలం ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. దానిని తిరిగి సముద్రంలోకి పంపించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు.
హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆవాస హోటల్‌లో ‘బ్లిస్ బర్గ్ ఫ్యూచర్ ఆఫ్ హోప్’ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిథి దుండ్ర కుమారస్వామి 100 మంది అనాథ పిల్లలు, దివ్యాంగులతో కలిసి వేడుకల్లో పాల్గొన్నారు. వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. కరుణ, ప్రేమ, సేవయే నిజమైన మానవత్వమని ఆయన అన్నారు.
అల్లూరి జిల్లా ఏజెన్సీ ప్రాంతాన్ని పొగమంచు దట్టంగా కమ్మేస్తోంది. చలి తీవ్రత భారీగా పెరగడంతో పాటు.. ఉష్ణోగ్రతలు రోజురోజుకి తగ్గిపోతున్నాయి. చింతపల్లిలో 7, లంబసింగిలో 6, పాడేరులో 8, అరకలో 6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పొగమంచు దట్టంగా కురుస్తుండటంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్ హబీబ్‌నగర్‌లోని నాంపల్లి యూసుఫైన్ దర్గా సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఒక ఇన్నోవా కారు నియంత్రణ కోల్పోయి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ క్రమంలో ఫుట్‌పాత్‌పై నడుచుకుంటూ వెళ్తున్న ఒక పాదచారికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
ఏలూరు జిల్లా జైలులో ఖైదీల దాడి కలకలం రేపింది. రిమాండ్ ఖైదీగా ఉన్న రౌడీషీటర్ పులిగడ్డ జగదీష్‌పై జైలులోనే ఉన్న ఇద్దరు ఖైదీలు దాడి చేయడం సంచలనంగా మారింది. ఈ దాడిలో గాయపడిన జగదీష్‌ను హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
శిశువుల అక్రమ విక్రయం కేసులో పోలీసుల పురోగతి సాధించారు. ఢిల్లీ, ముంబై కేంద్రంగా జరుగుతున్న శిశువుల అక్రమ విక్రయం ముఠాపై బెజవాడ పోలీసులు ఫోకస్ చేశారు. కేసులో కీలకంగా ఉన్న డిల్లీకి చెందిన కిరణ్ శర్మ, భారతిలను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సంచలనం సృష్టించిన రోడ్డు ప్రమాద ఘటనలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఈనెల 18 నుంచి చిలకలూరిపేట కోర్టు 5 రోజులపాటు కస్టడీకి అనుమతిచ్చింది. వెంకటనాయుడు సహా మరో నలుగురు నిందితులను విచారిస్తోంది.
ఒమన్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ.. అంతర్జాతీయంగా మరో అరుదైన ఘనతను సాధించారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ఒమన్‌లో పర్యటిస్తున్న ఆయనకు.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ఒమన్ లభించింది. 2014లో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రధాని మోడీ అందుకున్న అంతర్జాతీయ గౌరవాల సంఖ్య దీనితో 29కి చేరింది.
అమెజాన్ మరోసారి ఉద్యోగులను తొలగిస్తోంది. లక్సెంబర్గ్‌లోని యూరోపియన్ హెడ్‌క్వార్టర్స్‌లో 370 జాబ్స్‌కు కోత పెట్టనుంది. అక్కడ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం కంపెనీ చరిత్రలో ఇదే తొలిసారి. ఏఐ వినియోగంతో దృష్టిపెట్టిన అమెజాన్ 14వేలకు పైగా ఉద్యోగులను తొలగిస్తామని అక్టోబర్‌లో ప్రకటించింది.
అమెరికా నార్త్ కరోలినాలో ఘోర ప్రమాదం జరిగింది. స్టేట్స్‌విల్లే రీజనల్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయ్యే సమయంలో ఓ జెట్ కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగి జెట్ కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందినట్లు సమాచారం. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారనే దానిపై పూర్తి స్పష్టత లేదు.
భారత దేశవాళీ క్రికెట్‌లో సరికొత్త చరిత్ర నమోదైంది. 2025–26 సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని కైవసం చేసుకుని జార్ఖండ్ జట్టు సంచలనం సృష్టించింది. పుణె వేదికగా జరిగిన హై-వోల్టేజ్ ఫైనల్‌లో, హర్యానాను చిత్తు చేసి జార్ఖండ్ తొలిసారిగా ఛాంపియన్‌గా నిలిచింది.
భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ క్లైమాక్స్‌కు చేరుకుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత్ మరో అంతర్జాతీయ సిరీస్ విజయంపై కన్నేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా నేడు ఐదో టీ20 మ్యాచ్ జరగనుంది.
ముంబయి నివాసంలో ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిగాయన్న వార్తలను నటి శిల్పాశెట్టి ఖండించారు. పాత కేసు విచారణలో భాగంగానే అధికారులు వచ్చారని, సోదాలు జరగలేదని ఆమె తరఫు లాయర్ స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన