E-Paper
Advertisement

Top 20 News: పరకామణి కేసులో హైకోర్టు కీలక నిర్ణయం…కర్ణాటకలో బస్సు ప్రమాదం…సమంత రింగ్ వైరల్

Top 20 News: పరకామణి కేసులో హైకోర్టు కీలక నిర్ణయం…కర్ణాటకలో బస్సు ప్రమాదం…సమంత రింగ్ వైరల్

1. కాంగ్రెస్ పాత డీసీసీలకు వీడ్కోలు, కొత్త డీసీసీలకు స్వాగతం

గాంధీభవన్‌లో పీసీసీ మీటింగ్‌ కొనసాగుతుంది. మీటింగ్ కు సీఎం రేవంత్‌రెడ్డి, మీనాక్షి నటరాజన్‌ అటెండ్ అయ్యారు. పాత డీసీసీలకు వీడ్కోలు పలికి, కొత్త డీసీసీలకు దిశానిర్దేశం చేయనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపైనా పీసీసీ మీటింగ్ లో చర్చించనున్నారు.

2. 60 ఏళ్లు ఫ్లోరైడ్ నీళ్లు తాగి బాధపడ్డాం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆంధ్రా పాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ నీళ్లు తాగి 60 ఏళ్లు బాధపడ్డారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. లేదంటే, సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానని.. ఆయన సినిమాలు ఒక్క థియేటర్లో కూడా విడుదల కావని హెచ్చరించారు.

3. పరకామణి కేసులో హైకోర్టు కీలక నిర్ణయం

పరకామణి చోరీ కేసు నివేదిక హైకోర్టుకు చేరింది. సీఐడీ.. సీల్డ్‌ కవర్‌లో నివేదిక ఇచ్చింది. నిందితుడు రవికుమార్ ఆస్తులపై ఏసీబీ నివేదిక సమర్పించింది. పరిశీలన కోసం నివేదికలను తమ ముందు ఉంచాలని రిజిస్ట్రార్ జ్యుడీషియల్‌కు ఆదేశించింది. తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా వేసింది. నివేదికను తమకు అందజేసేలా ఆదేశాలు.. ఇవ్వాలన్న రవికుమార్ తరపు సీనియర్ న్యాయవాది అభ్యర్ధనను తోసిపుచ్చిన న్యాయమూర్తి తోసిపుచ్చారు.

4. సిపిఎం నేత పెంచలయ్య హత్య కారణంగా నాయకుల్లో ఆగ్రహం

సీపీఎం నేత పెంచలయ్య హత్యతో సీపీఎం, టీడీపీ కార్యకర్తలు, స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఆర్డీటీ కాలనీలో పెంచలయ్యను హత్య చేయించిన గంజాయి లేడీ కామాక్షి ఇళ్లను ధ్వంసం చేశారు. ప్లకార్డులతో స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం అమ్మకాలపై తీవ్రంగా పోరాడిన పెంచలయ్య తమ దందాకు అడ్డొస్తున్నాడని.. కక్ష పెంచుకున్న కామాక్షి గ్యాంగ్.. ఆయన్ను హతమార్చినట్టు గుర్తించారు పోలీసులు. ఇందుకు నిరసనగా నేడు జిల్లాలో బందు కొనసాగుతోంది.

5. తిరుచానూరు ఇందిరమ్మ కాలనీలో అనుమానస్పద స్థితిలో ఓ జంట, బాలుడి మృతి

తిరుపతి సమీపంలోని తిరుచానూరు ఇందిరమ్మ కాలనీలో దారుణం జరిగింది. తమిళనాడుకు చెందిన ఓ జంట, బాలుడితో పాటు అనుమానస్పద స్థితిలో మృతి చెందారు. సత్యరాజ్ అనే యువకుడు పొంగుట్టియన్ అనే మహిళతో పాటు మనీషా అనే బాలుడిని తీసుకొని నాలుగు నెలల క్రితం ఇందిరమ్మ గృహాల్లోని 46వ బ్లాకులో సెకండ్ ఫ్లోర్లో అద్దెకు దిగారు.. అయితే వారం రోజుల క్రితం వారు మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా భరించలేని దుర్వాసనతో నిండిపోయి ఉంది. అయితే పోలీసులు నిన్న మధ్యాహ్నం మృత దేహాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

6. కర్ణాటకలో బస్సు ప్రమాదం, ఓ మహిళ మృతి

కడప నుంచి బెంగళూరు వెళ్తున్న హరిత ట్రావెల్స్ బస్సు కర్ణాటకలో ప్రమాదానికి గురైంది. ఆంధ్ర- కర్ణాటక బార్డర్‌లోని మంచినీళ్ల కోట సమీపంలో అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొని లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి, 10మందికి పైగా గాయాలు అయ్యాయి. మృతి చెందిన మహిళ ప్రొద్దుటూరుకు చెందిన అనితగా గుర్తించారు. గాయపడిన వారిలో కడప, రాయచోటి, బెంగళూరు ప్రాంతాలకు చెందిన వారు ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులన సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు రక్షణ చర్యలు చేపట్టాయి.

7. హైదరాబాద్‌ ప్రముఖ హోటల్స్‌పై ఐటీ సోదాలపై అధికారులు విచారణ

హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్స్‌పై జరిగిన ఐటీ సోదాలపై అధికారులు విచారణ చేపట్టారు. పిస్తా హౌస్, షాగోస్, మెహఫిల్ హోటల్స్‌పై గతంలో జరిగిన ఐటీ సోదాల నేపథ్యంలో విచారణ కొనసాగుతోంది. ఐటీ అధికారులు ఈ దాడుల్లో భారీగా నగదు, డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ హోటల్స్‌కు లింకులు ఉన్న ఇతర సంస్థలపై దృష్టి సారించింది ఐటీ శాఖ. వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్‌ను విచారించింది. సోమవారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు జరిగిన ఈ విచారణలో పిస్తా హౌస్, ఇతర హోటల్స్‌తో ఆయన కున్న సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై అధికారులు కూపీ లాగారు.

8. ఏలూరు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం

ఏలూరు మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. సీనియర్లకు, జూనియర్లకు మధ్య మనస్పర్థలు.. కొట్టుకునేంత వరకు దారి తీశాయని సమాచారం. రెండో సంవత్సరం విద్యార్థులు హాస్టల్ బయట అర్ధరాత్రి నిరసన తెలపడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మెడికల్ కాలేజీలో ఉన్న యాంటీ ర్యాగింగ్ కమిటీ పూర్తిస్థాయిలో విచారణ చేస్తోందని.. పోలీసు దర్యాప్తు కొనసాగుతుందంటున్న ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్‌

9. అరటి రైతులను పట్టించుకోవడం లేదు, చంద్రబాబు పై జగన్ విమర్శ

రాష్ట్రంలో అరటి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. కిలో అరటిపండు కేవలం 50 పైసలు మాత్రమే పలుకుతోందని…ఇది అగ్గిపెట్టె, బిస్కెట్ ధర కన్నా చవక అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికా సీఎం చంద్రబాబుపై ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం వ్యవసాయం కూలిపోతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కిలో ఆహారం 50 పైసలైతే.. దానిన పండించిన రైతుల శ్రమకు కట్టే విలువ ఎంత అని ప్రశ్నించారు.

10. ఇందిరా పార్క్ రాక్ గార్డెన్‌లో మర్రి చెన్న రెడ్డి వర్ధంతి వేడుకలు

మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ మర్రి చెన్న రెడ్డి వర్ధంతి సందర్భంగా హైదరాబాదులోని ఇందిరా పార్క్ రాక్ గార్డెన్‌లో ఆయన సమాధి వద్ద వివిధ రాజకీయ ప్రముఖులు పూలమాలలు అర్పించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ,శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్,శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,కౌన్సిల్ డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాష్, తదితరులు హాజరయ్యి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

11. మొంథా తుఫాను నివేదికతో ఢిల్లీకి వెళ్లిన నారా లోకేష్

ఢిల్లీలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్, హోంమంత్రి అనిత పార్లమెంట్‌కు చేరుకున్నారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో ఎంపీలతో భేటీ అయిన తర్వాత, వారు మరికాసేపట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలవనున్నారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాను నష్టంపై సమగ్ర నివేదికను వారికి అందించనున్నారు మంత్రి లోకేశ్.

12. 7 ఏళ్ల చిన్నారిపై ఎనిమిది వీధి కుక్కలు దాడి

హయత్ నగర్‌లోని శివగంగ కాలనీలో 7 ఏళ్ల చిన్నారిపై ఎనిమిది వీధి కుక్కలు దాడి చేశాయి. మాటలు రాని ఆ బాలుడి చెవిని కుక్కలు కొరకడంతో తీవ్ర రక్తస్రావమైంది. అరుపులు విన్న స్థానికులు బాలుడిని రక్షించి, వైద్యం కోసం నల్లకుంట ఆసుపత్రికి తరలించారు. నగరంలో వీధి కుక్కల దాడులు పెరుగుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

13. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులకు అంతరాయం

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ పనులకు అంతరాయం కలిగింది. పునాదుల తవ్వకంలో భారీ రాళ్లు అడ్డు రావడంతో పనిచేయని డ్రిల్లింగ్ యంత్రాలు. చెన్నై నుండి తెప్పించిన హైడ్రాలిక్ డ్రిల్లింగ్ మిషన్‌ను కూడా వెనక్కి పంపారు అధికారులు. సాంకేతిక బృందం ఈ సమస్యను ఇంచార్జ్ కలెక్టర్ గరీమ అగ్రవాల్‌కు వివరించింది.

14. శ్రీకాకుళం తాళ్ళవలస గ్రామంలో డయేరియా కలకలం

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్ళవలస గ్రామంలో డయేరియా ప్రబలడంతో మంత్రి అచ్చం నాయుడు పర్యటించారు. ఈ వ్యాధి కారణంగా ఒక వ్యక్తి మృతి చెందగా, 8 మంది ఆసుపత్రిలో చేరారు. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి చికిత్స అందిస్తున్నామని మంత్రి అన్నారు. నీటిలో ఎలాంటి లోపాలు లేకపోయినా, మెరుగైన పరీక్షల కోసం నమూనాలను అడ్వాన్స్ ల్యాబ్‌కు పంపించారన్నారు. గ్రామానికి రూ. 60 లక్షల వాటర్ స్కీమ్‌ను మంజూరు చేశామన్నారు.

15. రెండో విడత సర్పంచ్ నామినేషన్ కేంద్రాల వద్ద పండగ వాతావరణం

రెండో విడత సర్పంచ్ ఎన్నికల ప్రస్థానంలో నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. నేడు చివరి రోజు కావటంతో ఆయా నామినేషన్ కేంద్రాల వద్ద ప్రజలు తండోపతండాలుగా చేరడంతో సందడి నెలకొంది. మూడు, నాలుగు గ్రామాలకు ఒక క్లస్టర్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అక్కడ సదరు గ్రామాలకు చెందిన సర్పంచ్ వార్డు మెంబర్ల నామినేషన్లను స్వీకరిస్తున్నారు. దీంతో నామినేషన్ కేంద్రాల వద్ద వివిధ గ్రామాల ప్రజలు రావడంతో పండగ వాతావరణం తలపిస్తోంది.

16. నేడు కోర్టులో కల్తీ లిక్కర్ జోగి రమేష్ బ్రదర్స్‌

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి కోర్టు వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొలకలచెరువు కల్తీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న జోగి రమేష్ బ్రదర్స్‌ను ఎక్సైజ్ పోలీసులు ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.వైసీపీ ఎమ్మెల్యే పిలుపు మేరకు భారీగా వైసీపీ నేతలు కోర్టు వద్దకు చేరుకునే అవకాశం ఉండటంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఈ బందోబస్తును ఏర్పాటు చేశారు.

17. ఇమ్రాన్ ఖాన్ పార్టీ కార్యకర్తల ఆందోళన

పాకిస్థాన్‌ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ మృతి చెందినట్లు వస్తోన్న వార్తలను ఆ దేశ ప్రభుత్వం ఖండించిన సంగతి తెలిసిందే. అయితే ఇమ్రాన్‌ఖాన్‌ను చూసేందుకు ఆయన కుటుంబసభ్యులను అనుమతించకపోవడం, అతని ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఇమ్రాన్‌ పార్టీ తెహ్రీక్‌ ఏ ఇన్సాఫ్‌ కార్యకర్తలు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు.

18. శబరిమల అయ్యప్ప క్షేత్రానికి 15 రోజుల్లో రూ.92 కోట్ల ఆదాయం

కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్‌లో తొలి 15 రోజుల్లో రూ.92 కోట్ల ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు వెల్లడించింది. గతేడాది ఇదే సీజన్‌లో రూ.69 కోట్లు వసూలయ్యాయని, ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచి రూ.47 కోట్లు సమకూరినట్లు టీడీబీ వివరించింది.

19. సౌతాఫ్రికాతో రెండో వన్డే కోసం రాయ్‌పుర్‌కు చేరుకున్న భారత జట్టు

రాంచీలో సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో గెలిచిన టీమ్ఇండియా రెండో వన్డే కోసం సన్నద్ధమవుతోంది. రెండో మ్యాచ్‌కు రాయ్‌పుర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. భారత జట్టు రాయ్‌పుర్‌కు చేరుకుంది. టీమ్ఇండియా ప్లేయర్లు హోటల్‌లోకి వెళ్లే ముందు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చిన్నారులు చుట్టుముట్టారు. కోహ్లీని చూసి సంబరపడిన పడిన పిల్లలు అతని చేతికి ఎర్ర గులాబీలు ఇచ్చి వెల్‌కమ్ చెప్పారు.

20. సమంత రింగ్ వైరల్

నటి సమంత- రాజ్‌లు వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. వీరి పెళ్లిలో ఇద్దరి కాస్య్టూమ్స్ అదరిచూపులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా సమంత చేతికి ఉన్న డైమండ్ రింగ్ గురించి ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వెతికేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే ఆమె ఈ ఉగరంతో ఉన్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇప్పుడు వీరి వివాహంలో ఆ రింగ్ వైరల్‌గా మారడం విశేషం

Tags

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×