E-Paper
Advertisement

Top 20 News: ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక, కవిత రాజీనామాపై ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

Top 20 News: ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక, కవిత రాజీనామాపై ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

1. ఖమ్మం కార్పొరేటర్లు..  కాంగ్రెస్‌లో చేరిక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఖమ్మం కార్పొరేటర్లు కాంగ్రెస్‌లోచేరారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు రాధ, ఉమారాణి, శ్రీదేవి జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.

2. కానిస్టేబుల్ దౌర్జన్యం

హన్మకొండలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ యాదగిరి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గోకుల్ నగర్‌కు చెందిన అరుణ అనే మహిళకు ఆయన 3.20 లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చారు. గత ఏడు నెలలుగా వడ్డీ చెల్లించలేదనే నెపంతో, యాదగిరి తన కుటుంబ సభ్యులతో కలిసి ఆమె ఇంటికి వెళ్లి గొడవ చేశారు. అరుణ ఇంటి గేటుకు తాళం వేసి దుర్భాషలాడారు. ఈ ఘటనపై ఇరు వర్గాలు ఫిర్యాదు చేసుకోవడంతో, సుబేదారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

3. కవిత రాజీనామాపై ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు

ఎమ్మెల్సీ కవిత రాజీనామాపై కీలక వ్యాఖ్యలు చేశారు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కవిత ఎమోషనల్‌గా నిర్ణయం తీసుకున్నారని.. ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని తాను సూచించినట్లు తెలిపారు. మొదట పీఏతో లేఖ పంపి.. ఆపై వ్యక్తిగతంగా వచ్చి కోరడంతోనే రాజీనామాను ఆమోదించామన్నారు.

4. సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేటకు చెందిన సాధారణ రైతు బిడ్డ, DRDL 17వ డైరెక్టర్‌గా నియమితులైన అంకతి రాజును ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. గతంలో అబ్దుల్ కలాం అలంకరించిన పదవిలో తన నియోజకవర్గ వ్యక్తి ఉండటం గర్వకారణమని ఎంపీ కొనియాడారు. ఈ సందర్భంగా రాజు ఎంపీకి క్షిపణి నమూనాను బహుకరించారు. అనంతరం క్షిపణి రూపకల్పనపై వీడియో ప్రెసెంటేషన్‌ను ఎంపీ వీక్షించారు.

5. బ్లో అవుట్ విషయంలో కీలక కామెంట్స్

ఓన్జీసీ క్రైసిస్ మేనేజ్మెంట్ హెడ్ శ్రీహరి ఇరుసుమండ బ్లో అవుట్ విషయంలో పలు కీలకమైన కామెంట్లు చేశారు. కోనసీమలో జరిగిన మొత్తం బ్లో అవుట్స్ లో ఇది అత్యంత చిన్నదిగా చెప్పారాయన. ఇదేమంత ప్రమాదకరమైన బ్లో అవుట్ కాదనీ.. పరిస్థితి మొత్తం కంట్రోల్లోనే ఉందన్నారు క్రైసిస్ హెడ్ శ్రీహరి.

6 . గొర్రెల కాపరిపైకి దూసుకెళ్లిన కంకర టిప్పర్

మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న అల్లముల పవ్వయ్య అనే గొర్రెల కాపరిపైకి అతివేగంగా వచ్చిన కంకర టిప్పర్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో పవ్వయ్య కాలు పూర్తిగా నుజ్జునుజ్జవగా, స్థానికులు ఆయనను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. బాధితుడి భార్య శాంతవ్వ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

7. కమ్యూనిటీ సర్వీస్

హైదరాబాద్ మైత్రివనంలో కమ్యూనిటీ సర్వీస్ చేశారు మందుబాబులు. డిసెంబర్ 31st నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ 20 మంది ద్విచక్ర వాహనదారులను.. కోర్టులో హాజరు పరిచారు SR నగర్ పోలీసులు. వారికి ఒక్క రోజు మద్యపాన సేవనం అంశంపై అవగాహన కల్పించేలా.. కమ్యూనిటీ సర్వీస్ చేయాలని శిక్ష విధించింది న్యాయస్థానం. అందులో భాగంగా ఇవాళ రోజు మైత్రీ వనంలో ప్లకార్డుల ప్రదర్శన చేశారు మందుబాబులు.

8. నిబంధనలు మార్చాలంటూ రైతుల డిమాండ్

తుళ్లూరు మండలం వడ్డమానులో CRDA యూనిట్ కార్యాలయాన్ని మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండో దశ ల్యాండ్ పూలింగ్‌కు తాము సిద్ధమేనని, అయితే పాత అగ్రిమెంట్ నిబంధనలు మార్చాలని రైతులు డిమాండ్ చేశారు. మొదటి దశ ప్లాట్లలో మౌలిక సదుపాయాల కల్పన ఇంకా పూర్తి కాలేదని గుర్తుచేశారు. భూసమీకరణకు చట్టబద్ధత కల్పించాలని, మూడేళ్లలో ప్లాట్లు అభివృద్ధి చేయకుంటే ఎకరాకు 5 లక్షల రూపాయల పరిహారం చెల్లించాలని కోరారు.

9. గ్రామస్తుల ఆందోళన

కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో భారీ రసాయన ఆధారిత ఫార్మా కంపెనీ ఏర్పాటుకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన చేపట్టారు. గతంలోనే అనుమతులు పొందిన ఈ సంస్థ.. నేడు విస్తరణ పేరుతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం ఉద్రిక్తతకు దారితీసింది. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రక్రియను నిలిపివేయాలని గ్రామాల ప్రజలు, స్థానికులు ఆందోళన చేపట్టారు.

10. ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ స్పీడప్

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతం చేసింది సిట్. ఈ కేసులో భాగంగా తాజాగా ఇద్దరికి నోటీసులు జారీ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండల్ రావుతో పాటు.. కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు పోలీసులు నోటీసులు ఇచ్చారు.

11. సరికొత్త రికార్డు

ఏపీలో మౌలిక సదుపాయాల కల్పనలో సరికొత్త చరిత్ర నెలకొంది. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో NHAI, రాజ్‌పథ్ ఇన్‌ఫ్రాకాన్ సంస్థలు రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లను నెలకొల్పాయి. కేవలం 24 గంటల్లో నిరంతరాయంగా 28.95 లేన్-కిలోమీటర్ల మేర 10,675 మెట్రిక్ టన్నుల బిటుమినస్ కాంక్రీట్ వేసి ఈ అరుదైన ఘనత సాధించాయి.

12. మెరుపు దాడులు

హైదరాబాద్‌ కాచిగూడలోని సీఎస్కే ల్యాబ్స్‌పై డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి జరిగిన ఈ సోదాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన మేకలు, గొర్రెల రక్తం, ఇతర కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన సూత్రధారి, ల్యాబ్ యజమాని నికేశ్ పరారీలో ఉండటంతో పోలీసులు గాలింపు చేపట్టారు.

13. మహిళ హల్‌చల్

వరంగల్ జిల్లాలో ఓ వివాహిత కత్తితో హల్‌చల్ చేసింది. తన భర్త శ్రీకాంత్ మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఆ కారణంతో తనకు విడాకులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని బాధితురాలు జ్యోత్స్న ఆరోపించింది. దీంతో జ్యోత్స్న కత్తితో భర్తపై దాడికి ప్రయత్నించగా.. శ్రీకాంత్ భయపడి సమీపంలోని ఓ జ్యువలరీ షాపులోకి వెళ్లి దాక్కున్నాడు.

14. ఆశావహుల తిప్పలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వేళ ఆశావహులు వినూత్న ప్రచారానికి తెరలేపుతున్నారు. 16వ వార్డు నుంచి పోటీ చేయాలనుకుంటున్న మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్, కాలనీల్లో ప్రధాన సమస్యగా మారిన కోతులను తరిమేందుకు కొండముచ్చుతో వార్డులో పర్యటిస్తున్నారు. కోతుల బెడద నుంచి విముక్తి కల్పిస్తానని హామీ ఇస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

15. టెన్షన్.. టెన్షన్

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె 17వ రోజుకు చేరుకుంది. పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలనే ప్రధాన డిమాండ్‌తో కార్మికులు పట్టుదలగా ఆందోళన కొనసాగిస్తున్నారు. సమ్మె జరుగుతున్న ప్రాంతానికి పోలీసు సిబ్బంది భారీగా చేరుకోవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది. దీంతో మున్సిపల్ కార్యాలయం వద్ద టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొంది.

16. 8 మంది గ్రామస్తులపై కుక్క దాడి

శ్రీ సత్యసాయి జిల్లా మదూడిలో దారుణం జరిగింది. కాలనీలో ఉండే ఓ పెంపుడు కుక్క.. ఏకంగా 8 మంది గ్రామస్తులపై దాడి చేసింది. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు.. ఆ కుక్కను కొట్టి చంపారు. అడ్డొచ్చిన కుక్క యజమానిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

17. బీజేపీ, కాంగ్రెస్ పొత్తు

రాజకీయ ప్రత్యర్థులైన బీజేపీ- కాంగ్రెస్ పార్టీలు జట్టు కట్టాయి. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మహారాష్ట్రలోని అంబర్‌నాథ్‌ ప్రాంతానికి మేయర్‌ ఎంపిక కోసం ఈ రెండు పార్టీలు చేతులు కలిపాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేనకు అధికారం దక్కకుండా ఉండేందుకు ఈ అరుదైన కూటమి ఏర్పాటయ్యింది.

18. సీనియర్ల సస్పెన్షన్

హిమాచల్ ప్రదేశ్‌లోని శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్, దాడి ఘటనలో ఇద్దరు సీనియర్లను 3 నెలల పాటు సస్పెండ్ చేశారు. వారిని ఏడాది పాటు హాస్టల్ నుంచి బహిష్కరించి, 20వేల జరిమానా విధించారు. అయితే, సీనియర్లను బెదిరించి డబ్బులు వసూలు చేయాలని చూసిన జూనియర్ విద్యార్థి శుభమ్ సింగ్‌పై కూడా 6వారాల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూ 10వేలు జరిమానా వేసింది.

19. భారీ సెంచరీ

యాషెస్ సిరీస్‌లో భాగంగా సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో ఇంగ్లాండ్ పోరాడుతోందిజ నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లల నష్టానికి 302 పరుగులు చేసింది. యువ బ్యాటర్ జాకబ్ బెథెల్ అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ 119 పరుగుల స్వల్ప ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ విజయం సాధించాలంటే ఆఖరి రోజున భారీ లక్ష్యాన్ని నిర్దేశించాల్సి ఉంటుంది.

20. సమంత ఈజ్ బ్యాక్

సమంత అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మా ఇంటి బంగారం’. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల తేదీని సామ్ ప్రకటించారు. జనవరి 9న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు ఒక ఆసక్తికరమైన పోస్టర్‌ ద్వారా ఆమె వెల్లడించారు. ఈ సంక్రాంతి కానుకగా వస్తున్న అప్‌డేట్‌తో అభిమానులు ‘క్వీన్ ఈజ్ బ్యాక్’ అంటూ సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×