E-Paper
Advertisement

Top 20 News Today: శ్రీవారి ప్రసాదం సరికొత్త రికార్డు.. న్యూ ఇయర్ వేళ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Top 20 News Today: శ్రీవారి ప్రసాదం సరికొత్త రికార్డు.. న్యూ ఇయర్ వేళ ఆలయాలకు పోటెత్తిన భక్తులు

1. న్యూ ఇయర్ వేళ.. గవర్నర్‌ను కలిసిన సీఎం

న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో గవర్నర్‌ను కలిసి శాలువా కప్పి, పుష్ప గుచ్చం అందించి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు తీరును గవర్నర్‌కు సీఎం వివరించారు.

2. సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేతకు బిగ్‌షాక్

సత్యం కంప్యూటర్స్ మాజీ అధినేత రామలింగరాజుకి బిగ్ షాక్ తగిలింది. ఆయన జీవిత కథ ఆధారంగా నిర్మించిన వెబ్ సిరీస్‌పై కోర్టు నిషేధం ఎత్తివేసింది. వాస్తవానికి ఈ వెబ్ సిరీస్‌కి వ్యతిరేకంగా న్యాయం పోరాటం చేశారు రామలింగరాజు. తాజాగా కోర్టు ఆంక్షలు ఎత్తివేయడంతో.. త్వరలోనే ఈ వెబ్‌సీరిస్ విడుదల కానుంది.

3. లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్న మంత్ర పొన్నం

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్టలోని లక్ష్మీ నరసింహ స్వామివారిని మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మంత్రికి.. అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామివారి నిజాభిషేకం సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

4. అడ్లూరి , ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ వేములవాడలో ప్రత్యేక పూజలు

న్యూ ఇయర్ సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి, ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

5. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సీఎం విషెస్..

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్‌ను సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరుపక్షాల మధ్య కొద్దిసేపు ఆత్మీయ చర్చ సాగింది.

6. 2025లో శ్రీవారి ప్రసాదం సరికొత్త రికార్డు

తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ విక్రయాల్లో 2025లో సరికొత్త రికార్డు నమోదైంది. 2024తో పోల్చితే 10 శాతం అధికంగా, ఏకంగా 13 కోట్ల 52 లక్షల లడ్డూలను టీటీడీ భక్తులకు విక్రయించింది. 700 మంది అర్చకులు నిరంతరం శ్రమిస్తూ.. నాణ్యత, రుచి పెంచడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజూ 4 లక్షలకు పైగా లడ్డూలను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు.

7. డ్రగ్స్ టెస్టులో పాజిటివ్.. ఆ తర్వాత..

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నెక్సాస్ మాల్‌ షెర్లాక్ పబ్ డీజే ప్లేయర్ డేవిడ్‌కు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చింది. అర్ధరాత్రి నార్కోటిక్స్ విభాగం ఆకస్మిక తనిఖీలు చేసి పరీక్షించగా.. అతను డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో నార్కోటిక్స్ అధికారుల ఫిర్యాదుతో కేపీహెచ్‌బీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

8. గంజాయి మత్తులో యువకులు హల్‌చల్

హైదరాబాద్ పాతబస్తీ చాదర్‌ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి మత్తులో ఉన్న యువకులు రెచ్చిపోయారు. ముస్లిం మెటర్నటీ ఆసుపత్రి సమీపంలోని ఓ సెల్ ఫోన్ రిపేర్ షాపులో కేవలం 60 రూపాయల స్క్రీన్ గార్డ్ విషయంలో గొడవ మొదలైంది. గంజాయి మత్తులో ఉన్న యువకులు.. తాము రౌడీ షీటర్లమని చెప్పుకుంటూ షాప్ యజమానిని తీవ్రంగా దూషించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

9. మేడ్చల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్.. ఒకరు మృతి, 17మందికి అస్వస్థత

మేడ్చల్‌ జిల్లా జగద్గిరిగుట్టలోని భవానీ నగర్‌లో విషాదం జరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా పార్టీ చేసుకున్న తర్వాత ఒకరు మృతి చెందగా.. 17మంది అస్వస్థతకు గురయ్యారు. న్యూ ఇయర్ సందర్భంగా.. మద్యం తాగి చికెన్‌, ఫిష్‌ వండుకొని తిన్నారు. ఫుడ్‌ పాయిజన్‌ వల్లే ఇలా జరిగిందని తెలుస్తోంది.

10. దారునం.. ముగ్గురు పిల్లలను చంపి.. ఆపై తానూ ఆత్మహత్య

కర్నూలు జిల్లాలో నూతన సంవత్సర వేళ దారుణం చోటుచేసుకుంది. ఉయ్యాలవాడ మండలం తుడుములదిన్నె గ్రామంలో ఓ తండ్రి తన ముగ్గురు పిల్లలను చంపి.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులు వేముపాటి సురేంద్ర, కావ్యశ్రీ, ధ్యానేశ్వరి, సూర్య గగన్‌‌గా గుర్తించారు.

11. వెంకన్న ఆలయంలో చోరీ కేసులో దర్యాప్తు స్పీడప్..

నంద్యాల జిల్లా మద్దూరు వెంకన్న ఆలయంలో.. ఆభరణాల మాయం కేసు దర్యాప్తు స్పీడప్ అయింది. గ్రామస్తుల ఫిర్యాదుతో ఎండోమెంట్ అధికారి విచారణ చేపట్టారు. గతేడాది జులైలో ఈవో పి.వి నరసయ్య రిటైర్డ్ అయినట్లు చెప్పారు. ఆయన స్థానంలో సాయి జయచంద్రారెడ్డికి ఈవో బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. అయితే ఇప్పటివరకు జయచంద్ర రెడ్డి అధికారికంగా బాధ్యతలు తీసుకోలేదని ఎండోమెంట్ అధికారి మోహన్ వెల్లడించారు.

12. దారుణం.. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని కట్టేసి.. కొట్టేసారు

ఏలూరు జిల్లా ముసునూరులో అమానుష ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పల్లం సాయిచంద్, సాయి దుర్గాలు 8ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. యువతి కుటుంబ సభ్యులు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో.. రెండు రోజుల క్రితం వివాహం చేసుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి బంధువులు.. ఆ యువకుడిపై దాడికి చేశారు.

13. మాజీ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

అనంతపురం జిల్లా మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతన సంవత్సరంలో కొత్తగా ఓ రాజకీయ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. పది సంవత్సరాలు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోయినా మౌనంగా ఉన్నామన్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తన కుటుంబ పాత్ర క్రియాశీలంగా ఉంటుందని స్పష్టం చేశారు.

14. వరంగల్ భద్రకాళి ఆలయానికి పోటెత్తిన భక్తులు

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని చారిత్రక వరంగల్ భద్రకాళి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. ఏడాదంతా శుభం కలగాలని కోరుకుంటూ వేకువజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించగా.. ఆలయ ప్రాంగణం భద్రకాళి నామస్మరణతో మారుమోగింది.

15. విషాదం.. పురుగుల మందు తాగి డ్రైవర్ ఆత్మహత్య

నూతన సంవత్సర వేళ నిర్మల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మెట్‌పల్లి ఆర్టీసీలో ప్రైవేట్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

16. తొలిసారిగా యానిమల్ కంటింజెంట్

ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో తొలిసారిగా యానిమల్ కంటింజెంట్ పాల్గొననుంది. దేశ సరిహద్దుల్లో భద్రత కోసం సైన్యం వినియోగించే రెండు ఒంటెలు, నాలుగు గుర్రాలు, నాలుగు డేగలు ఈ ప్రత్యేక బృందంలో ఉండనున్నాయి. ఈ అరుదైన కంటింజెంట్ పరేడ్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

17. ఎయిరిండియా పైలట్‌ అదుపులోకి

విమానం ఎక్కుతుండగా మద్యం వాసన రావడంతో ఎయిరిండియా పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. కెనడాలోని వాంకోవర్ ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

18. నూతన సంవత్సరానికి ప్రపంచం స్వాగతం

నూతన సంవత్సరానికి ప్రపంచం స్వాగతం పలికింది. ఆనందోత్సాహాల మధ్య వివిధ దేశాలు ఈ వేడుకలను ఘనంగా జరుపుకున్నాయి. తొలుత పసిఫిక్‌ మహాసముద్రంలోని కిరిబాటి ద్వీప దేశాన్ని న్యూ ఇయర్‌ పలకరించింది. తర్వాత న్యూజిలాండ్‌లో సంబరాలు ప్రారంభమయ్యాయి.

19. మరింత ఖుష్ అవుతున్న ప్రభాస్ అభిమానులు

న్యూ ఇయర్‌కు ప్రభాస్‌ అభిమానులు మరింత ఖుష్ అవుతున్నారు. వరుస అప్‌డేట్స్‌తో సంబరాలు చేసుకుంటున్నారు. ‘స్పిరిట్‌’ ఫస్ట్‌ లుక్‌ ఆకట్టుకోగా.. ‘ది రాజా సాబ్‌’ (The Raja Saab) నుంచి మరో సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. ఈ సినిమాలోని ‘రాజే యువరాజే..’ ఆడియో సాంగ్‌ను తాజాగా విడుదల చేశారు.

20. మరోసారి నిరాశపరిచిన రిషభ్ పంత్

టీమిండియా స్టార్‌ రిషభ్‌ పంత్‌ మరోసారి పేలవ ఆట తీరుతో నిరాశపరిచాడు. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో… మెరుగైన ప్రదర్శన చేసి సెలక్టర్ల దృష్టిని ఆకర్షిస్తాడనుకున్న ఈ వికెట్‌ కీపర్‌.. అంచనాలు అందుకోలేకపోతున్నాడు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×