తెలుగు రాష్ట్రాలను చలి వణికిస్తోంది. సాధారణ ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. తెలంగాణలో 10 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. చలి గాలులు, పొగమంచుతో రహదారులు కమ్ముకుంటున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
విశాఖ వేదికగా ఇవాళ రెండో రోజు CII పార్టనర్‌షిప్ సమ్మిట్ జరుగుతోంది. మొదటి రోజు భారీ ఎత్తున ఎంఓయూలు కుదుర్చుకుంది ప్రభుత్వం. జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. మొత్తం 400 ఎంఓయూల ద్వారా 11 లక్షల 91వేల 972 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వాటితో 13లక్షల 32వేల 445 ఉద్యోగాలు రానున్నాయి.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో జోష్‌లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇదే ఉత్సాహంతో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈనెల 17న కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చెప్పారు. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే.. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది.
పరకామణి కేసులో ఫిర్యాదుదారు, AVSO సతీష్ కుమార్ మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సతీష్ కుమార్‌ది హత్యగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. అనంతపురం సర్వజనాసుపత్రిలో సతీష్ కుమార్ పోస్ట్‌మార్టం పూర్తయింది. ఫొరెన్సిక్, పోలీసుల పర్యవేక్షణలో మృతదేహానికి సీటీ స్కాన్ నిర్వహిచారు వైద్యులు. సతీష్ తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్లు డాక్టర్లు గుర్తించారు. శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగినట్లు నిర్ధారణ అయింది. మృతదేహాన్ని కర్నూలుకు తరలించారు.
ఆంధ్రప్రదేశ్‌లో 12 బిలియన్ల డాలర్ల వరకు పెట్టుబడుల కోసం బ్రూక్‌ఫీల్డ్‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసిందని పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు సీఎం చంద్రబాబు. ఇందులో 3 GW క్లీన్ ఎనర్జీ డేటా సెంటర్, అదనపు క్లీన్-ఎనర్జీ ప్రాజెక్టులు ఉన్నాయి. తయారీ, ఆతిథ్యం, రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలు, పోర్టులు వంటి అనేక రంగాలలో బ్రూక్‌ఫీల్డ్ పెట్టుబడులు పెట్టనుందని చెప్పారు.
డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 202 నిర్వహించబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ సమ్మిట్ గురించి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిన్న సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైనా.. ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 38 శాతం ఓట్లు పోల్ అయ్యాయని చెప్పారు. గత తమ ప్రభుత్వంలో ప్రతి ఉప ఎన్నికల్లో తమ పార్టీనే గెలిచిందని అన్నారు.
కల్వకుంట్ల కుటుంబంపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎమ్మెల్యే నుంచి ముఖ్యమంత్రి వరకు అడ్డంగా దోచుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు వారి ఆస్తులు ఎంతో వారికే తెలియదని ఎద్దేవా చేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలిపంజా విసిరింది. వారం రోజుల్లో టెంపరేచర్స్ 4డిగ్రీలు పడిపోయింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయింది. మరో రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గనున్నాయి. గ్రామాల్లో ప్రజలు చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు. వృద్ధులు, పిల్లలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు.
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ ఓటమి వేళ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. కర్మ హిట్స్ బ్యాక్ అంటూ దండం పెట్టే ఎమోజీలతో ట్వీట్ చేశారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బయటికి వచ్చిన కవిత కేసీఆర్ మినహా మిగతా నేతలపై ఎప్పటికప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలోని సీఆర్ కాలనీలో ఉన్న ప్రజ్ఞ గ్రీన్ పార్క్ అపార్ట్‌మెంట్‌లో ఓ దొంగ సైకిల్‌పై వచ్చి హల్‌చల్ చేశాడు. సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ప్రకారం ఆ దొంగ మూడు ఫ్లోర్లు తిరిగి, నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డు ఇంట్లో ప్రవేశించి సెల్‌ఫోన్‌ను చోరీ చేశాడు. అనంతరం గోడ దూకి సైకిల్‌పై నిదానంగా వెళ్లిపోయాడు.
వరంగల్ జిల్లాలోని కల్లెడ గ్రామంలో భారీ చోరీ జరిగింది. బంధువుల ఇంటికి వెళ్లడంతో తాళం వేసి ఉన్న సాయిలు ఇంట్లో దొంగలు చొరబడ్డారు. బీరువా తాళాలు పగులగొట్టి 25 తులాల బంగారం, ఆరు లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈ పరాభవంపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ నాయకులు జూబ్లీహిల్స్ తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు కృషి చేస్తే.. బీజేపీ నేతలు మాత్రం తమ అభ్యర్థిని ఓడించేందుకు పనిచేశారని సంచలన ఆరోపణలు చేశారు.
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం డొంకూరులో రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. వేటకు వెళ్లి తీసుకొచ్చిన చేపలను ఓ వర్గం.. వ్యతిరేకవర్గానికి చెందిన షెడ్‌లో పెట్టడంతో వివాదం తలెత్తింది. ఈ దాడుల్లో 40 మందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గ్రామంలో పోలీసులు పెద్ద ఎత్తున మొహరించారు.
కార్తీకమాసం సందర్భంగా శ్రీశైలంలో దేవస్థానం ఛైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోటి దీపోత్సవం నిర్వహించారు. గంగాధర మండపం వద్ద కైలాస వేదికపై స్వామివారికి పూజల అనంతరం సుమారు 3 వేల మంది భక్తులు, మహిళలు దీపాలను వెలిగించారు. భక్తులు భారీగా తరలిరావడంతో మల్లన్న క్షేత్రం శివనామస్మరణతో మారుమోగింది.
ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనను మరువక ముందే.. జమ్మూ కశ్మీర్‌లో మరో బాంబ్ బ్లాస్ జరిగింది. నౌగామ్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ 30 మందిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఎక్కువగా పోలీసులు, ఫోరెన్సిక్ బృందం ఉన్నారని సమాచా
ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణకు మద్దతుగా అన్నాడీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించడం సిగ్గుచేటని తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శించారు. దేశ పౌరులు తమ పౌరసత్వాన్ని మళ్లీ నిరూపించుకోవాల్సిన భారాన్ని ఈసీ మోపిందని ఆరోపించారు. నిజమైన ఓటర్లు తొలగిపోకుండా తాము పోరాడుతుంటే, అన్నాడీఎంకే మాత్రం ఈ సవరణకు మద్దతిస్తోందని విమర్శించారు.
బిహార్ గడ్డపై ఎన్డీయే కూటమి బంపర్ విక్టరీ కొట్టింది. ఏకంగా 200కు పైగా స్థానాల్లో గెలిచి ప్రభంజనం సృష్టించింది. ఎగ్గిట్ పోల్స్ అంచనాలను మించి ఫలితాలను రాబట్టింది. ఇదే సమయంలో మహాగట్ బంధన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
అమెరికా నుంచి భారత్.. ఏహెచ్ 64 ఈ అపాచీ గార్డియన్ హెలికాప్టర్లను కొనుగోలు చేస్తుంది. బోయింగ్ ఒప్పందంలో భాగంగా.. 7 వందల 96 మిలియన్ డాలర్లకు ఈ డీల్ కుదిరింది. అత్యంత శక్తివంతమైన, కచ్చితత్వంతో దాడిచేయగల ఈ హెలికాప్టర్లను భారత్.. అమెరికాకు తిరిగి పంపించేస్తుంది.
అమెరికాతో డీల్
14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసి విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ తాజాగా ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టీ20 టోర్నీలో యూఏఈపై రెచ్చిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 144 పరుగులు చేశాడు. అందులో 11 ఫోర్లు, 15 సిక్సర్లు ఉండడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్-ఎ ఏకంగా 148 పరుగుల తేడాతో విజయం సాధించి, టోర్నీని ఘనంగా ఆరంభించింది.