E-Paper
Advertisement

Brahmamudi Serial Today November 15th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రెస్టారెంట్ లో బేరర్ గా జాయిన్ అయిన రాహుల్ 

Brahmamudi Serial Today November 15th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రెస్టారెంట్ లో బేరర్ గా జాయిన్ అయిన రాహుల్ 
Advertisement

Brahmamudi serial today Episode:

కావ్యకు సర్‌ఫ్రైజ్‌ ఇచ్చిన రాజ్‌ చెప్పకుండా స్పెషల్‌ రెస్టారెంట్‌కు తీసుకెళ్తాడు. చెప్పు కళావతి నీకేం కావాలో చెప్పు అని అడుగుతాడు. దీంతో కావ్య అడగకుండా నాకు ఏమి ఇష్టమో తెలుసుకుని ఆర్డర్‌ చేస్తే అది గొప్ప అని చెప్తుంది దీంతో రాజ్‌ ఒక్క క్షణం కూడా ఊపిరి తీసుకోనివ్వవా..? కళావతి మళ్లీ నాకు ఇదో టెన్షనా అంటాడు. అంటే నాకు ఏమి ఇష్టమో నీకు తెలియదు అన్నమాట అని కావ్య అడగ్గానే.. అంటే దీనికి ఏమి ఇష్టమో తెలియదు అని ఇప్పుడు  అన్నానంటే ఇది ఏదో గోల చేస్తుంది అని మనసులో అనుకని నేను అన్నానా నీకు ఏది ఇష్టమో తెలియదు అన్నానా..? అంటాడు రాజ్‌..  అయితే నాకు ఇష్టమైంది మీరే ఆర్డర్‌ ఇవ్వండి అని కావ్య చెప్పగానే.. సరే ఇప్పుడు చూడు ఎలా ఆర్డర్‌ ఇస్తానో అంటూ రాజ్‌ బేరర్‌ను పిలిచి ఆర్డర్‌ చేసి నీకు నచ్చింది ఆర్డర్‌ ఇచ్చానా..? అని అడగ్గానే..

కావ్యను డిస్సపాయింట్ చేసిన రాజ్

అవన్నీ నాకు నచ్చినవి కాదు..  నీకు నచ్చినవి..అని కావ్య చెప్పగానే… రాజ్‌ గిల్టీగా మనసులో ఏంటి ఇంత ఆలోచించి ఆర్డర్‌ చేసినా తప్పు అయిపోయయా..? అని అనుకుంటుంటే.. కానీ మీకు నచ్చినవి ఏవో నేను ఆర్డర్‌ చేయనా..? అంటుంది కావ్య.. సరే అంటాడు రాజ్‌. దీంతో కావ్య ఆర్డర్‌ చేసి ఏంటి కరెక్టు గా చెప్పానా..? అని అడుగుతుంది. ఇష్టమో ఇంట్లో గరిట నీ చేతుల్లో ఉంటుంది కాబట్టి తెలుసుకున్నావు అంటాడు రాజ్‌. అదేం లేదు గరిట మాత్రమే మా చేతుల్లో ఉంటుంది. కానీ నేను మీ చేతుల్లో ఉంటాను అయినా మీరు తెలుసుకోలేకపోయారు అని చెప్తుండగానే.. రాజ్‌ బేరర్‌ ఒక వాటర్‌ బాటిల్‌ ఫ్లీజ్‌ అని చెప్తాడు. బేరర్‌ వాటర్‌ బాటిల్‌ తీసుకొచ్చి ఇవ్వగానే.. బేరర్‌ను చూసి కావ్య షాక్‌ అవుతుంది. ఏంటని రాజ్‌ చూడగానే.. బేరర్‌ గా వాటర్‌ బాటిల్‌ తెచ్చింది రాహుల్‌. దీంతో ఇద్దరూ షాకింగ్‌గా రాహుల్‌ను చూస్తుంటారు. ఇంతలో రాజ్‌ ఏంట్రా ఇది అని అడుగుతాడు.

రెస్టారెంట్ లో కావ్య, రాజ్ లకు షాక్ ఇచ్చిన రాహుల్

Advertisement

నేను ఇక్కడ బేరర్‌ను సార్‌ ఆర్డర్‌ ఏమైనా చేశారా అని రాహుల్‌ అడగ్గానే..ఏం మాట్లాడుతున్నావు రాహుల్‌ నువ్వేంటి ఇక్కడ బేరర్‌గా పనిచేయడం ఏంటి..? అని అడుగుతుంది. దీంతో రాహుల్‌ మనిషి అన్నాక ఏదో ఒకటి చేసుకుని బతకాలి కదా మేడం అంటాడు రాహుల్‌..దీంతో కావ్య.. రాహుల్‌ ముందు నువ్వు మేడం అనడం ఆపు అంటుంది. ఇలాంటి చోట కస్టమర్‌ను రెస్పెక్ట్ చేయడం రూల్‌.. అనగానే.. ఇలాంటి పనులు చేసి ఇంటి పరువు తీయకూడదన్న రూల్‌ లేదా..? అని రాజ్‌ అడగ్గానే.. ఆ పరువు తీసని వాడిని లెక్కకు అందని తప్పులు చేసిన వాడిని.. ఇప్పుడు కళ్లు తెరిచినవాడిని కానీ నేను మారాను అంటే నమ్మడానికి ఎవ్వరూ లేరు. నిజాయితీగా నా భార్యబిడ్డలను పోషించుకోవడానికి ఇంతకన్నా నాకు వేరే మార్గం లేదు రాజ్ అందుకే ఇక్కడ పనిలో చేరాను అని రాహుల్‌ చెప్పగానే.. నువ్వు మారావని నిరూపించుకోవడానికి ఇలాంటి చోట ఈ పని చేయాల్సిన అవసరం లేదు రాహుల్‌..

రాహుల్ ను చూసి ఎమోషనల్ అయిన కావ్య

నీకంటూ ఒక ఫ్యామిలీ ఉంది. నీకంటూ కష్టం వస్తే మేమంతా ఉన్నాము అని రాజ్‌ చెప్తాడు.. అయినా ఇలాంటి ఆలోచన నీకు ఎందుకు వచ్చింది రాహుల్‌ అని కావ్య అడగ్గానే..   తన మీద తనకు నమ్మకం పోయినప్పుడు.. ఇచ్చిన అవకాశాన్ని వదులుకున్నప్పుడు.. బతుకు మీద ఆశ చచ్చిపోయినప్పుడు  ఇంతకన్నా ఏం చేయగలం. ఇప్పటి దాకా మీరు నాకు చాలా చేశారు రాజ్‌ ఇక నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను.. నా భార్యను కన్నీళ్లను పెట్టించలేను అని చెప్పగానే.. అలాగని ఈ పనా చేసేది అని రాజ్‌ అడగ్గానే.. కష్టపడి నిజాయితే ఏ పని చేసినా మనకు గౌరవం తెచ్చిపెడుతుందని ఒకప్పుడు నువ్వే  కదా రాజ్‌ చెప్పింది.. అదే నేను పాటిస్తున్నాను… నన్ను ఇలాగే ఉండనివ్వండి.. ఇక్కడ మీకు నాకు సంబంధం ఉందని ఎవ్వరికీ చెప్పకండి.. నేను ఎవ్వరికీ చెప్పను..ఏదైనా ఆర్డర్‌ ఇస్తారా..? అని రాహుల్‌ అడగ్గానే.. ఇచ్చాం అని రాజ్‌ చెప్తాడు. దీంతో కూర్చోండి సార్‌ అని రాహుల్‌ వెళ్లిపోతాడు..

కావ్యను అల్లరి చేసిన రౌడీలు

Advertisement

తర్వాత కావ్య హ్యండ్‌ వాష్‌ చేసుకోవడానికి వెళ్తుంటే కొంత మంది రౌడీలు కావ్యను అల్లరి చేయాలని చూస్తారు. వెంటనే రాజ్‌ చెప్పిన మాటలు గుర్తు చేసుకుని నవ్వుకుంటూ వెళ్తుంది కావ్య. దీంతో కావ్య మీరు వాళ్లేనా…? అని అడగ్గానే.. అవును మేమే అని రౌడీలు చెప్పగానే. కావ్య.. రాజ్‌కు సైగ చేస్తుంది. రాజ్‌ చూసి ఏంటి నేను అరెంజ్‌ చేసిన రౌడీలు అప్పుడే వచ్చారా..? మనవాళ్లే కానివ్వు అని చెప్తాడు. దీంతో రౌడీలు నిజంగానే కావ్యను టీజ్‌ చేస్తుంటారు.. బలవంతంగా రూంకు తీసుకెళ్లాలనని ట్రై చేస్తుంటారు.  ఇంతలో రాజ్‌ వచ్చి రౌడీలను కొడతాడు. ఇద్దరూ కలిసి అక్కడి నుంచి ఇంటికి వెళ్తూ.. రాహుల్‌ గురించి ఆలోచిస్తారు. తర్వాత రాత్రికి ఇంటికి వచ్చిన రాహుల్‌, స్వప్నకు శారీని గిఫ్ట్‌గా ఇస్తాడు. ఎలా తెచ్చావు అని అడుగుతుది.  దీంతో తాను ఒక రెస్టారెంట్‌లో బేరర్‌గా జాయిన్‌ అయ్యాను అని చెప్తాడు. ఎంతో అమాయకుడిలా తన మాటలతో స్వప్నను మాయ చేస్తాడు. తర్వాత అందరూ హాల్లో కూర్చుని ఉండగా స్వప్న, రాహుల్ తెచ్చిన చీరను కట్టుకుని వస్తుంది. ధాన్యలక్ష్మీ ఏంటా చీర చూడటానికి అసహ్యంగా ఉంది అంటే నాకు బాగానే ఉంది అని చెప్తుంది స్వప్న ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 6th ‘నిండు నూరేళ్ల సావాసం’  సీరియల్‌: బుజ్జమ్మ కోసం బయలుదేరిన ప్రచండ

బిగ్‌బాస్ 10పై పెరిగిన హైప్.. లిస్ట్‌లో ఉన్నది వీళ్లేనా ?

క్యూట్ లుక్స్‌తో దేవజాని మోదక్ రచ్చ.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ పిక్!

వామ్మో.. యూట్యూబ్ ద్వారా ఏడాదికి రూ.2,300 కోట్లా.. ఎవరా యూట్యూబర్?

కౌశల్ ను తొక్కేశారా? ఇన్నాళ్లకు నోరు విప్పిన బిగ్ బాస్ విన్నర్!

బిగ్ బాస్ 10కి ఎంపికైన తొలి కామనర్.. కన్నీళ్లు పెట్టుకున్న నవదీప్.. వీడియో వైరల్!

గుడ్ న్యూస్ చెప్పిన బిగ్ బాస్ జంట.. మరో బిడ్డకు ఆహ్వానం!

మాధురి రాథోడ్ తల్లిపై ఈశ్వర్ సాయి భార్య ఊహించని కామెంట్స్!

Big Stories

Advertisement
×