E-Paper
Advertisement

Top 20 News Today: తిరుపతిలో లిక్విడ్ గంజాయి కలకలం, విశాఖ VMRDA కార్యాలయంలో మంత్రి సమీక్ష

Top 20 News Today: తిరుపతిలో లిక్విడ్ గంజాయి కలకలం,  విశాఖ VMRDA కార్యాలయంలో మంత్రి సమీక్ష

1. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన

ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటిస్తున్నారు. గట్టమ్మగుడి వద్ద 45 లక్షల నిధులతో చేపట్టనున్న ఫుట్‌ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు మంత్రి సీతక్క.

2. లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉచిత దర్శనానికి 5 గంటల సమయం.. ప్రత్యేక దర్శనానికి 2గంటల సమయం పడుతోంది. కార్తీక మాసం చివరి వారం కావడంతో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది. ఆలయ మాడ వీధులు కిక్కిరిసిపోయాయి.

3. తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో చలి వణికిస్తోంది. ఉదయం నుంచే రోడ్లకి పొగమంచు కమ్ముకుంటుంది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌లోనే కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరో మూడు నాలుగు రోజులు చలి తీవ్రత ఇంకా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. పిల్లలు, వృద్ధులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

4. VMRDA కార్యాలయంలో మంత్రి సమీక్ష

విశాఖపట్నం VMRDA కార్యాలయంలో అధికారులతో మంత్రి నారాయణ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీవీఎంసీతో పాటు VMRDA పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై చర్చించారు. VMRDA చేపట్టిన MIG లేఅవుట్లు, మౌలిక వసతుల కల్పనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి. అలాగే మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ రోడ్లు, వాటర్ సప్లై ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు.

5. సత్యసాయి జిల్లాలో బాలకృష్ణ పర్యటన

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో నందమూరి బాలకృష్ణ పర్యటించనున్నారు. మంత్రి సవిత ఆధ్వర్యంలో సోమందేపల్లిలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు

6. ఎబార్‌గా జగిత్యాల ఎన్ పీడీసీఎల్ కార్యాలయం

జగిత్యాల ఎన్‌పీడీసీఎల్ కార్యాలయాన్ని కొందరు సిబ్బంది బార్‌గా మార్చారు. ఆఫీస్ సమయం ముగియగానే అసిస్టెంట్ లైన్మెన్‌లు ప్రభాకర్, బాలకృష్ణ, రాజశేఖర్ మద్యం పార్టీ చేసుకుంటూ కెమెరాలకు చిక్కారు. ఈ వ్యవహారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

7. శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో ఫ్రాన్స్‌కి వారు ప్రత్యేక పూజలు

అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయాన్ని ఫ్రాన్స్ దేశానికి చెందిన భారతదేశపు రాయబారి థియర్ మాథౌ సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం అమ్మవారికి పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన వారికి అల్లు వెంకట దుర్గాభవాని ఆలయ ఈవో మర్యాదలతో స్వాగతం పలికారు.

8. తిరుపతిలో గంజాయి కలకలం..

తిరుపతిలోని చంద్రగిరిలో లిక్విడ్ గంజాయి కలకలం రేగింది. తొలుత ఖాళీ బాటిల్‌లో నింపిన తర్వాత పొగబెట్టి.. అనంతరం ఆవిరి పడుతూ యువకులు మత్తులోకి జారుకుంటున్నారు. గంజాయి సేవించిన తర్వాత యువకుల వికృత చేష్టలు చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ లిక్విడ్ గంజాయిని చిన్నపిల్లలే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

9. పల్నాడు జిల్లాలో గంజాయి చాకెట్లు పట్టివేత

పల్నాడు జిల్లా నరసరావుపేటలో మరోసారి గంజాయి చాకెట్లను పట్టుకున్నారు పోలీసులు. నరసరావుపేట నుంచి వినుకొండ వస్తున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో.. వినుకొండ దగ్గర గంజాయితో తయారు చేసిన చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

10. ఘోర రోడ్డు ప్రమాదం. ఒకరు మృతి, ఇద్దరికి గాయాలు..

కారు ఢీకొట్టిన ఘటనలో కానిస్టేబుల్ దుర్మరణం చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన నాగారంలోని సూర్యాపేట-జనగామ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. అతివేగంతో వచ్చిన గుర్తుతెలియని కారు ముందుగా వెళ్తున్న లారీ, ఆటోను తప్పించబోయి ఈ ముగ్గురినీ ఢీ కొట్టింది.

11. నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడి

పల్నాడు జిల్లా చింతపల్లి గ్రామంలో ఇంటి ముందు ఆడుకుంటున్న అఖీలేశ్వర్ అనే నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్క ఒక్కసారిగా దాడికి దిగింది. కుక్క కరవడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన చికిత్స నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

12. కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు అరెస్ట్

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిని రిమాండ్‌కు పంపించినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు. మిగిలిన నిందితుల కోసం నాలుగు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

13. అమ్మవారి వేలంపాటలో అన్యమతస్థులు పాల్గొన్నారని నిందితులు అరెస్ట్..

కృష్ణా జిల్లా పెడనలో నిన్న పైడమ్మ అమ్మవారి జాతర వేలంపాట జరిగింది. ఈ పాటలో అన్యమతస్థులు పాల్గొన్నారని హిందూ చైతన్య వేదిక జిల్లా అధ్యక్షులు నాదెళ్ల కోటేశ్వరరావు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వేలంపాట నిర్వహకుల ఫిర్యాదులో అతడిని పెడన పోలీసులు రాత్రి 11 గంటలకు అరెస్టు చేశారు.

14. పరకామణి కేసు మళ్లీ రీఓపెన్

పరకామణి కేసును రాజీ చేయడానికి సవాల్ చేస్తూ మాచర్ల శ్రీనివాసులు హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు ఆదేశాలతో పరకామణి కేసు రీఓపెన్ చేశారు. పరకామణి కేసులో సతీష్ కుమార్ మృతి చెందడంతో కలత చెందిన శ్రీనివాసులు తనకు ప్రాణహాని ఉందని రక్షణ కావాలంటూ అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

15. కసాయి తండ్రి.. కన్న బిడ్డలనే కడతేర్చేందుకు యత్నం..

కరీంనగర్ జిల్లా వావిలాల పల్లిలో దారుణం జరిగింది. మానసిక వైకల్యంతో బాధపడుతున్న కొడుకు, కూతురును గొంతు నులిమి చంపేందుకు ప్రయత్నించాడు కసాయి తండ్రి. అనంతరం తండ్రి మల్లేశం పరారయ్యాడు. చికిత్స పొందుతూ కూతురు అర్చన చనిపోగా.. కొడుకు ఆశ్రిత్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మానసిక అంగవైకల్యంతో ఉండడం వల్లే తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

16. ఢిల్లీ బాంబ్ బ్లాస్టర్ కేసులో దర్యాప్తు ముమ్మరం..

ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ ఘటనకు సంబంధించి పలు విభాగాలు దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఉగ్ర కుట్రలో హర్యానా ఫరీదాబాద్‌లోని అల్‌ ఫలా యూనివర్సిటీ సిబ్బంది పాత్ర ఉండటం, తాజాగా మరో ఇద్దరు వైద్యులను అరెస్టు చేయడంతో విశ్వవిద్యాలయంపై మరింత నిఘా పెరిగింది. ఈ ఇద్దరు ప్రధాన నిందితుడు ఉమర్‌ నబీకి స్నేహితులని గుర్తించారు.

17. రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి..

రాజస్థాన్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్‌ రాజస్థాన్‌ క్యాడర్‌కు చెందిన తెలుగు ఐఏఎస్‌ అధికారి ఓరుగంటి శ్రీనివాస్‌ నియమితులయ్యారు. ఈ నెల 17న ఆలత బాధ్యతలు స్వీకరించనున్నారు. తండ్రి జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమంలో చీఫ్‌ ఎంటమాలజిస్ట్‌గా అరకు లోయలో పనిచేస్తున్నప్పుడు ఈయన అక్కడే 1966 సెప్టెంబరు 1న జన్మించారు.

18. అనుబంధ సంస్థల పనితీరులో పారదర్శకత పెరగాలి

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అనుబంధ సంస్థల పనితీరులో మరింత పారదర్శకత రావాలని భారత్‌ పిలుపునిచ్చింది. వ్యక్తులను, సంస్థలను అధికారికంగా నియమించాలనే అభ్యర్థనలను తిరస్కరించే నిర్ణయాల్లో గోప్యత పాటించడాన్ని విమర్శించింది. ఐక్యరాజ్యసమితిలో యూఎన్‌ఎస్‌సీ పనితీరుపై జరిగిన బహిరంగ చర్చలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ ఈ అంశాన్ని లేవనెత్తారు.

19. సినిమా విడుదల రోజే దేశమంతా గర్విస్తుంది

దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళితో కలిసి చేస్తున్న ‘వారణాసి’ తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అన్నారు కథానాయకుడు మహేశ్‌బాబు. జీవితంలో ఒక్కసారే దొరికే అవకాశమిదని.. ఈ సినిమా విడుదలైన రోజు భారతదేశమంతా గర్విస్తుందని చెప్పారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రాన్ని శ్రీ దుర్గా ఆర్ట్స్, షోయింగ్‌ బిజినెస్‌ పతాకాలపై కె.ఎల్‌. నారాయణ, ఎస్‌.ఎస్‌. కార్తికేయ నిర్మిస్తున్నారు.

20. శుభమన్‌ గిల్‌ మ్యాచ్‌‌కి దూరం

తొలి టెస్టులో బ్యాటింగ్‌ చేస్తూ శుభమన్‌ గిల్‌ మెడ నొప్పితో మైదానాన్ని వీడాడు. అతడు ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడని, నిద్రలేమి వల్ల కండరం పట్టిందని బీసీసీఐ తెలిపింది. వర్క్‌లోడ్‌ వల్ల గిల్‌ గాయానికి గురికాలేదని.. నిద్రలేమి వల్ల కండరం పట్టేసిందని టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ చెప్పాడు.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×