తెలుగు రాష్ట్రాల సీఎంలు ఒకే వేదికపై కనిపించారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్‌లెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి అతిథులుగా ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు.
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం పందిగుంట గ్రామంలో విషాదం నెలకొంది. ఊబిలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. గోరింటాకు కోసం వెళ్లిన ఏడుగురు చిన్నారులు అక్కడే ఉన్న చిన్న గుంటలో ఆడుతూ పడిపోయి సందీప్, అవినాష్ మృతి చెందారు. మిగిలిన పిల్లల సమాచారంతో తల్లిదండ్రులు గుంట వద్దకు చేరుకునేసరికే వారు మృతి చెందారు.
హైకోర్టు ఆదేశాలతో గచ్చిబౌలిలోని సంధ్య కన్వెన్షన్ పరిసరాల్లోని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు తొలగిస్తున్నారు. ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ సొసైటీ లేఅవుట్‌లో అనుమతులు లేని షెడ్లు, స్లాబ్ నిర్మాణాలను ఆరు జేసీపీలు, బాహుబలి మిషన్‌తో కూల్చివేశారు.
అమరావతి కల్తీ మద్యం కేసు విచారణలో భాగంగా నేడు జోగి రమేష్‌కు సంబంధించిన కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. అలాగే జనార్దన్ రావు, జగన్‌మోహన్ రావులను రెండోసారి తమ కస్టడీకి అప్పగించాలని సిట్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయస్థానం నేడు వారిని విచారించనుంది.
నేటి నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపి వేస్తున్నామని ప్రకటించింది తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్. సీసీఐ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నామని తెలిపింది. ఇప్పటికే రెండు దఫాలుగా ప్రభుత్వానికి సమస్యలను తెలిపిన పరిష్కరించలేదని మిల్లర్స్ అసోషియేషన్ ఆరోపించింది.
కార్తీక మాసం సందర్భంగా శ్రీశైలం పాతాళ గంగలో ఈ నెల 18న జరగాల్సిన తెప్పోత్సవంను దేవస్థానం వాయిదా వేసింది. పవర్ హౌస్ విద్యుత్ ఉత్పత్తి కారణంగా నీటి మట్టం హెచ్చుతగ్గులు ఉండటం శ్రేయస్కరం కాదని, డ్యామ్ నిర్వహణ అధికారుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను చలి వణికిస్తోంది. ఏజెన్సీ గ్రామాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. 4రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈసారి వర్షాలు ఎక్కువగా కురవడంతో చెరువులు, ప్రాజెక్టులు నిండడంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముంది. రానున్న 2,3 రోజుల్లో జిల్లాలో శీతలగాలుల తీవ్రత పెరగనుంది.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం తాళ్ళపొలంలో జరిగిన శెట్టిబలిజ కార్తీక వన సమారాధనలో రసాభాస జరిగింది. భూవివాదంతో న్యాయం కోరిన ఓ కుటుంబం సమస్య పరిష్కరించకపోవడంతో ఉప్పు, ఇసుక కలిపి భోజనాలను పాడుచేయడంతో ఇరువర్గాలు కొట్లాటకు దిగాయి. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలపై కేసు నమోదు చేశారు.
జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ ఈనెల 20న బిహార్ ముఖ్యమంత్రిగా 10వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. పట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించనున్నట్లు పార్టీ సీనియర్ నేతలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర మంత్రులు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇతర ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహా పలువురు ఎన్డీఏ అగ్రనేతలు హాజరు కానున్నారన్నారు.
లిక్కర్ స్కాం కేసులో నిందితుడు రాజ్ కేసిరెడ్డి సన్నిహితుడి నివాసంలో దాచిన సుమారు 5 కోట్ల రూపాయల సొమ్మును ఒడిశాకు చెందిన రషిత బ్యూరో, ఇర్షాద్ అహ్మద్ అనే ప్రేమికులు చోరీ చేశారు. ఈ సొమ్ముతో వారు ఒడిశాలో విల్లాలు, భూములు కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. చోరీ విషయం బయటపడకుండా రాజ్ కేసిరెడ్డి గ్యాంగ్ పోలీసు ఉన్నత అధికారుల సహాయంతో సీసీ కెమెరాలను జల్లెడ పట్టారు.
బంగ్లాదేశ్‌లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. తాత్కాలికంగా ఏర్పాటైన యూనస్ సర్కార్ పట్ల యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. రాజధాని ఢాకాలో అనేక బస్సులు, ప్రభుత్వ భవనాలకు నిప్పుపెట్టారు. గత ప్రభుత్వం చేసిన తప్పే.. యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కూడా చేస్తోందని.. యువత మరోసారి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశ చివరి అంచు ధనుష్కోడి తీరంలో భారీ పవన విద్యుత్తు ప్రాజెక్టు రాబోతోంది. వాతావరణాన్ని తట్టుకునేలా దేశంలోనే మొట్టమొదటి సముద్ర ఆధారిత పవన విద్యుత్ ప్రాజెక్టును కేంద్రం ప్రతిపాదించింది. 2030 నాటికి 30 గిగావాట్ల లక్ష్యంతో, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఈ కీలక ప్రాజెక్టును తీసుకువస్తోంది. దీంతో మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లభించనుంది.
జులై-సెప్టెంబరు 2025లో భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో Vivo 18.3% వాటాతో అగ్రస్థానంలో ఉంది. అలాగే ఈ త్రైమాసికంలో Apple 50 లక్షల ఐఫోన్లను విక్రయించి రికార్డు సృష్టించింది. 4.3శాతం వృద్ధితో మొత్తం మార్కెట్ 4.8 కోట్ల యూనిట్లకు చేరుకుంది, ఇది ఐదేళ్లలో అత్యధికం అని మార్కెట్ పరిశోధక సంస్థ ఐడీసీ తెలిపింది.
అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో మూవీ రాబోతున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తుంది. బన్నీ ప్రస్తుతం అట్లీ సినిమాలో నటిస్తున్నారు. అయితే.. ఈ మూవీ షూటింగ్ అనుకున్న దానికంటే ముందే పూర్తయ్యే అవకాశం ఉండడంతో.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మరో ప్రాజెక్ట్ చేయాలని అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మధ్య వివాదం ముగిసింది. ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు ముగిసిన అనతరం బుమ్రా.. బవుమా వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. ‘బౌనా‘ అనే పదాన్ని ఉద్దేశపూర్వకంగా వాడలేదని వివరించాడు. దీంతో వివాదం ముగిసింది.
చిత్తూరు జిల్లా కుప్పంలో కలకలం సృష్టించిన హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ మృతుడు శ్రీనాథ్ కుటుంబ సభ్యులు. శ్రీనాథ్ నుంచి వరసకు సోదరుడైన ప్రభాకర్ 40 లక్షలు తీసుకున్నాడని.. ఆ డబ్బులు అడగడానికి వచ్చిన శ్రీనాథ్‌ను హత్య చేశాడని మృతుడి తల్లి ఉమారాణి ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రపంచ పెట్టుబడిదారుల వేదికగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రపంచ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలను ఒకేచోటికి తీసుకురావడం కోసం తెలంగాణ సాంకేతిక, మౌలిక వసతుల పరంగా పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు.
జర్మనీలోని న్యూరెంబర్గ్‌లో 600కు పైగా గొర్రెలు నగరం మధ్య నుంచి శీతాకాల మేత బయళ్లకు సాగిన దృశ్యం స్థానికులను కనువిందు చేసింది. థామస్ గాక్‌స్టట్టర్‌కు చెందిన ఈ గొర్రెలు 10 కిలోమీటర్లు నడిచి నగరంలోని ప్రధాన మార్కెట్ గుండా వెళ్లాయి. దీంతో గొర్రెల మందను స్థానిక ప్రజలు తమ సెల్‌ఫోన్‌లలో ఫొటోలను తీసుకున్నారు. ఏటా జరిగే ఈ అరుదైన దృశ్యం ఆకట్టుకుంది.
కార్తీక మాసంలో ఆఖరి సోమవారం కావడంతో ఆలయాలకు భక్తులు రద్దీ కొనసాగుతోంది. అమరావతి శ్రీబాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానానికి కార్తీక భక్తులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు.. స్నాన ఘాట్ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి, స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ప్రాంగణంలోని ఉసిరి చెట్టు వద్ద మహిళా భక్తులు పెద్ద ఎత్తున దీపారాధనలు చేశారు.
ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక గురువు 14వ దలైలామా జీవితంపై హైదరాబాద్‌కు చెందినవి పాత్రికేయుడు అరవింద్ యాదవ్ హిందీలో ‘అనశ్వర్ పేరుతో పుస్తకం రచించారు. ఈ మేరకు కేంద్ర మాజీమంత్రి, కశ్మీర్ రాజవంశవారసుడు కరణ్ సింగ్ ఆవిష్కరించారు. దలైలామా జీవితం శాంతి, కరుణ విలువలను తెలుపుతుందని కరణ్ సింగ్ కొనియాడారు. దలైలామా అధికార ప్రతినిధిగా దిల్లీ టిబెట్ హౌస్ డైరెక్టర్ గెషే దోర్జీ దందూల్ కూడా పాల్గొన్నారు.