E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : ఇమ్మానుయేల్ vs భరణి.. రీతూకు పవన్ క్లాస్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Bigg Boss 9 Telugu : ఇమ్మానుయేల్ vs భరణి.. రీతూకు పవన్ క్లాస్.. ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

Bigg Boss 9 Telugu : తెలుగు టాప్ రియాల్టీ షో బిగ్ బాస్ మరికొద్ది రోజుల్లో శుభం కార్డు వేసుకో పోతుంది. ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో తొమ్మిదో సీజన్ కూడా ఇంకొన్ని వారాల్లో పూర్తికా వస్తున్న నేపథ్యంలో ఈ సీజన్ విన్నర్ ఎవరు అన్నా ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి. తొమ్మిదో వారం లాగానే హౌస్ లో పదోవారం కూడా డబల్ ఎలిమినేషన్ జరిగింది.. గౌరవ్ నిఖిల్ ఇద్దరు కూడా తక్కువ ఓటింగ్ తో హౌస్ నుంచి బయటికి. ప్రస్తుతం 11వ వారం నామినేషన్స్ వేడి వాతావరణంను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ వారం నామినేషన్స్ లోకి ఎవరు వెళ్తారు..? హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఒకసారి ఈ వారం నామినేషన్స్ ని చూసేద్దాం..

11 వ వారం నామినేషన్స్ లో రచ్చ..

బిగ్ బాస్ సీజన్ 9 కి మరి కొన్ని వారాల్లో శుభం కార్డు పడబోతుంది..ఈ క్రమంలో 11 వ నామినేషన్స్ పై సర్వత్రా చర్చలు కొనసాగుతున్నాయి. ఈవారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారా అని జనాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు అందరూ స్ట్రాంగ్ గా ఉన్న వాళ్ళే కావడంతో ఈ ఎలిమినేషన్స్ పై సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ వారం నామినేషన్స్ ఎపిసోడ్ ప్రోమో ని రిలీజ్ చేశారు. ఇమ్మానుయేల్ రీతూ ను నామినేట్ చేస్తాడు. రీతూ పెద్ద రచ్చ చేస్తుంది.. నీకు అంతగా ఉంటే ఈ బొమ్మను తీసుకెళ్లి మీ మమ్మీకి ఇవ్వచ్చు కదా అని సంజన ను మధ్యలో లాగుతుంది. దాంతో వీరిద్దరి మధ్య గొడవ క్రియేట్ అవుతుంది..

భరణి vs ఇమ్మానుయేల్ మధ్య గొడవ..

Advertisement

ఇమ్మానుయేల్ ఆ తర్వాత భరణిని నామినేట్ చేస్తాడు.. వీరిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరుగుతుంది. నన్ను నామినేట్ చేయడానికి కారణాలేంటి అని భరణి అడుగుతాడు. ఆ తర్వాత ఇమ్మానుయేల్ చెప్పిన కారణం అతనికి కరెక్ట్ అనిపించకపోవడంతో నేను ఒకసారి స్ట్రగుల్ అయ్యి మళ్లీ వచ్చాను. ఇప్పుడు నువ్వు నన్ను టార్గెట్ చేయాలని చూస్తున్నావా అంటూ రెచ్చిపోతాడు. అసలు నీకు నా గురించి ఏం తెలుసు అని నువ్వు నన్ను నామినేట్ చేసావు? ఎందుకు నన్ను టార్గెట్ చేసావని భరణి పెద్దగా అరుస్తూ ఇమ్మానుయేల్ ని అడుగుతాడు.. ఇమ్ము చెప్పేది భరణి వినకుండా పెద్ద రచ్చ రచ్చ చేస్తారు. చూస్తుంటే వీరిద్దరూ కొట్టుకునే వరకు వెళ్లేటట్టు కనిపిస్తుంది. ఇవాళ ఎపిసోడ్ లో వీరిద్దరి ఫైట్ కు సొల్యూషన్ ఏంటో చూడాలి..

Also Read :ఇల్లు ఇల్లాలు పిల్లలు పరిస్థితి దారుణం.. కార్తీక దీపం 2 సీరియల్ కు శుభం కార్డు..?

రీతూను ఏడ్పించేసిన పవన్.. 

Advertisement

ఆ తర్వాత డిమాండ్ పవన్ ను నామినేట్ చేయడానికి వస్తాడు. అయితే ముందుగా అతను నామినేట్ చేస్తాడు. రీతుకి ఎంత చెప్పినా కూడా తను మాట వినదు. అందరూ అంటున్న సరే నేను తనకి సపోర్ట్ గా నిలిచాను. తను మాత్రం నా గురించి బ్యాడ్ గా చెప్తూ వస్తుంది. నేను ఎన్నోసార్లు తను అర్థం చేసుకుంటుందని ప్రయత్నించాను.. కానీ నన్ను చాలా హర్ట్ అయ్యేలా చేసింది.. నువ్వు ఎప్పుడూ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని పవన్ కన్నీళ్లు పెట్టుకుంటాడు. అతని ఎమోషనల్ వర్డ్స్ విన్న రీతు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది.. ఇక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది.. చూస్తుంటే ఇవాళ నామినేషన్ ఎపిసోడ్ గొడవలతో మొదలైన, చివరకు కన్నీళ్లతో ఎండ్ అయ్యేలా కనిపిస్తుంది.. ఇంకెన్ని ట్విస్ట్ లు ఉంటాయో తెలియాలంటే ఈ ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడాలి..

Related News

బిగ్ బాస్10 హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న కంటెస్టెంట్ తనేనా?

బిగ్ బాస్ హౌస్ లోకి గుండెనిండా గుడి గంటలు హీరో.. ఈ ట్విస్ట్ ఏందీ బాలు..వీడియో వైరల్!

బిగ్ బాస్ 10 లాంచింగ్ ఎపిసోడ్… చీఫ్ గెస్ట్ గా స్టార్ హీరో!

న్యూ చాప్టర్ బిగిన్స్.. బిగ్ బాస్ 10 ఎంట్రీ పై జబర్దస్త్ కమెడియన్ క్లారిటీ!

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్ లీక్..హౌస్ లోకి వెళ్లేది వీళ్ళే!

Bigg Boss 10 Telugu : బిగ్ బాస్ 10లోకి స్టార్ యాంకర్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Big Stories

Advertisement
×