E-Paper
Advertisement

Top 20 News Today: రైతులకు శుభవార్త, ఫౌజీ నుంచి బిగ్ అప్‌డేట్ 

Top 20 News Today: రైతులకు శుభవార్త, ఫౌజీ నుంచి బిగ్ అప్‌డేట్ 

1. కవిత డిమాండ్

ఖమ్మం జిల్లా కుర్నవల్లి గ్రామంలో ప‌ర్య‌టించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డిన‌ జాగృతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుస్సేన్ ను క‌విత‌ పరామర్శించారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు క‌విత‌.

2. రైతులకు శుభవార్త

అన్నదాత సుఖీభవ’ రెండో విడత నిధుల విడుదల చేస్తున్నట్లు తెలిపారు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఈనెల 19న పీఎం కిసాన్‌తో కలిపి అర్హులైన ప్రతి రైతు ఖాతాలో 7,000 జమ చేయనున్నట్లు వెల్లడించారు. కింది స్థాయి సిబ్బంది గ్రామాల్లో ప‌ర్యటించి రైతులకు ప్రత్యేక అవ‌గాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.

3. గ్రామస్తులు ఆందోళన

అల్లూరి సీతారామరాజు జిల్లా జీఎంవలస – కుండాడ మధ్య నాణ్యత లేకుండా నిర్మించిన రోడ్డు మూడు నెలల్లోనే ధ్వంసమైందని గ్రామస్తులు ఆందోళన చెందారు. దీనిపై ఐటీడీఏ పీవో స్మరణ రాజు విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.

4. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కీలక వ్యాఖ్యలు

టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఏపీకి చంద్రబాబే బ్రాండ్ అని.. జగన్ క్రెడిట్ చోరీ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ హయాంలో పరిశ్రమలు పారిపోయాయని విమర్శించారు. 13 లక్షల కోట్ల ఎంఓయులు చేసుకున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.

5. కరెంట్ షాక్ కు గురైన విద్యార్ధిని

వికారాబాద్ జిల్లా మంబాపూర్ గ్రామంలో విద్యార్థిని క‌రెంట్ షాక్ కు గురైంది. జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని శ్రీవాణికి క్లాస్ రూమ్ లో అమర్చిన డిజిటల్ బోర్డ్ కేబుల్ వైర్లు తగిలి విద్యుత్ షాక్ కు గురైంది. విద్యార్థినిని తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

6. మూసీ పై భాగంలో పనులు ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని భునాదిగాని, పిల్లయిపల్లి, ధర్మారెడ్డి కాల్వల పనులు జ‌రుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్రాఫ్ హాలీడే లేకుండా కాల్వల నిర్మాణం పనులు చేయాలని తెలిపారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూసీ నీళ్లు కిందికి రాకుండా మూసీపై భాగంలో పనులు ప్రారంభం చేస్తున్నట్లు చెప్పారు కుంభం అనిల్.

7. హరిజనవాడలో ఉద్రిక్తత

చిత్తూరు జిల్లా ఎర్రచెరువుపల్లి హరిజనవాడలో గతంలో ప్రభుత్వం ఎస్సీలకు 200 యూనిట్ లు కరెంట్ ఉచితం అని చెప్పడంతో గ్రామంలో బిల్లులు ఎవ్వరు కట్టాలేదు. ఇప్పుడు విద్యుత్తు అధికారులు గ్రామంలో కరెంటు బిల్లు మొత్తం కట్టాలని.. లేకుంటే ఇంటికి కరెంట్ కట్ చేస్తామని చెప్పడంతో గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గతంలో ప్రభుత్వం దళితులకు 200 యూనిట్లు ఉచితం చెప్పిందని.. ఇప్పుడు మొత్తం కట్టమంటే ఎలా అని అధికారులను నిలదీశారు గ్రామ‌స్తులు.

8. ముగిసిన అంత్యక్రియలు

రంగారెడ్డి జిల్లాలో పరువు హత్యకు గురైన రాజ‌శేఖ‌ర్ అంత్యక్రియలు ఎల్లంపల్లి గ్రామంలో ముగిసాయి. గ్రామంలో ఘర్షణ వాతావరణం తలెత్తకుండా పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. బాధిత కుటుంబాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హాజ‌రు కానున్నారు. ఏసీపీ కార్యాలయంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఏసిపి లక్ష్మీనారాయణ వెల్లడించనున్నారు.

9. క్లీన్ స్వీప్

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 74 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, ఎంపీ రఘువీర్. ఒక పార్టీకి డిపాజిట్ రాలే.. ఇంకో పార్టీ మూడు ముక్కలుగా కొట్లాడుకుంటున్నార‌ని మంత్రులు విమ‌ర్శించారు. ఇంకో 15న‌ ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని.. స్థానిక సంస్థలో క్లీన్ స్వీప్ చేస్తుంద‌న్నారు మంత్రులు కోమ‌టిరెడ్డి, ఉత్తంకుమార్.

10. ఐ బొమ్మ.. సంచలన విషయాలు

ఐబొమ్మ నిర్వాహ‌కుడు ఇమంది రవి అరెస్ట్‌లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022లో రవి భారత పౌరసత్వాన్ని వదులుకుని, 80 లక్షలు చెల్లించి కరేబియన్ పౌరసత్వం పొందాడని పోలీసులు తెలిపారు. అప్పటి నుంచి అక్కడే విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడని.. భారత్‌లోని ఆస్తులను అమ్ముకోవడానికి మూడు రోజుల క్రితం ర‌వి వచ్చాడని చెప్పారు. ఈ క్ర‌మంలో ఇమంది ర‌విని అరెస్టు చేసిన‌ట్లు వెల్ల‌డించారు పోలీసులు.

11. గ్రామస్తుల ధర్నా

సంగారెడ్డి జిల్లాలోని ధోమడుగు గ్రామంలో గ్రామ‌స్తులు ధార్న చేప‌ట్టారు. హీట్రో కెమికల్ పరిశ్రమ నుంచి నిత్యం రసాయన పదార్థాలు చెరువులోకి వదలడం వల్ల ఆ చెరువులోని నీటి తాగిన పశువులు ముత్యాతపడుతున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అలాగే రసాయాలతో నీళ్ల‌ రంగు మారి.. పంట పొలాల్లోకి చేరి పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని జిల్లా కలెక్టరేట్ ముందు నిర‌స‌న తెలిపారు గ్రామ‌స్తులు.

12. ఆరుగురు అరెస్ట్

గుంటూరు జిల్లాలో డ్రగ్స్ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు. బుడంపాడు బైపాస్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా నుంచి 17 గ్రాముల మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు.

13. ఏసీబీ దాడులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఇల్లెందు సివిల్ సప్లయ్స్ డిప్యూటీ తహసీల్దార్ యాకుబ్ పాషా ఏసీబీకి చిక్కాడు. గతంలో సీజ్ చేసిన రేషన్ షాపును తిరిగి ఓపెన్ చేసేందుకు 30 వేలు లంచంగా తీసుకుంటూ.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికారు. పాషాతో పాటు మరో మరో ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

14. నిజామాబాద్ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర

బ్రూణహత్యల్ని అరికట్టి.. ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిజామాబాద్ నుంచి ఢిల్లీ వరకు సైకిల్ యాత్ర కొనసాగిస్తున్నారు. నిజామాబాద్ కు చేరుకున్న శ్రీనివాస్ కి సంపూర్ణ మద్దతు ల‌భించాయి. ఈ యాత్ర ద్వారా మోడీని కలిసి బృణహత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరుతున్న‌ట్లు వెల్ల‌డించారు శ్రీనివాస్.

15. తల్లిదండ్రులకు అవగాహన

ములుగు జిల్లాలో అంగన్వాడీ చిన్నారులకు రోజుకు 100 మి.లీ. పాలు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి సీతక్క. అంగన్వాడీల సేవలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. అంగన్వాడీలు కూడా కార్పొరేట్ పాఠశాలలకు సమానంగా సేవలందించాలని పిలుపునిచ్చారు.

16. కఠినంగా శిక్షించాలి

ఢిల్లీలో మెట్రో స్టేషన్ వద్ద పేలుళ్ళు జరగడం బాధాకరం అన్నారు మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. మృతుల కుటుంబాలకు ఆయ‌న‌ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పేలుళ్ల వెనుక ఉన్న వారిని ఉపేక్షించకుండా కఠినంగా శిక్షించాల‌ని డిమాండ్ చేశారు అంజాద్ బాషా.

17. నిర్మాణాలపై నిషేధం

ఢిల్లీ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్యాన్ని అరికట్టలేమన్న సర్వోన్నత న్యాయస్థానం .. రాజధాని నగరంలో నిర్మాణాలపై నిషేధం విధించేందుకు నిరాకరించింది. పర్యావరణ ఆందోళనలు, అభివృద్ధి మధ్య సమతుల్యం ఉండాలని సూచించింది.

18. ఫౌజీ నుంచి బిగ్ అప్‌డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఫౌజీ’. తాజాగా హను రాఘవపూడి ఈ సినిమాపై బిగ్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు, అందులో రెండో భాగం ప్రీక్వెల్‌గా ఉంటుందని వెల్లడించారు.

19. సినిమానే చీప్

ప్రపంచంలో అన్నిటికంటే చీప్‌ సినిమానే అన్నారు నటుడు శివాజీ. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం దండోరా డిసెంబర్‌ 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడి నాలెడ్జ్‌ చూసి షాకయ్యానన్నారు శివాజీ. అతడు ఇప్పటికైనా మారాలన్నారు. దండోరా మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కిందని అందరికీ నచ్చుతుందన్నారు.

20. కోచ్‌గా సంగక్కర

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఆ ఫ్రాంఛైజీకి డైరెక్టర్ ఆఫ్‌ క్రికెటర్‌గా ఉన్న కుమార సంగక్కరను ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించింది. సంగక్కర ఇప్పుడు ఈ రెండు బాధ్యతలను చూడనున్నాడు. అదే విధంగా బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న విక్రమ్ రాథోడ్‌ను లీడ్ అసిస్టెంట్‌ కోచ్‌గా ప్రమోట్ చేసింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×