E-Paper
Advertisement

Top 20 News Today: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు, కామారెడ్డి జిల్లాలో నకిలీ ఫైనాన్స్

Top 20 News Today: జనసేన నేత సంచలన వ్యాఖ్యలు, కామారెడ్డి జిల్లాలో నకిలీ ఫైనాన్స్

1. యూరియా కోసం రైతులు పడిగాపులు

జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు ఎండలో పడిగాపులు కాస్తున్నారు. అగ్రోస్ సేవా కేంద్రం తెరవకపోవడంతో చెప్పులు లైన్‌లో పెట్టి కూర్చున్నారు. వ్యవసాయ అధికారులు కూడా అందుబాటులో లేరు. అధికారుల తీరుపై రైతులు మండిపడుతున్నారు.

2. బిగ్ టీవీ కథనాలకు స్పందన

బిగ్ టీవీ కథనాలకు అనంతపురం జిల్లా యంత్రాంగం కదిలింది. అరటి రైతుల సమస్యలపై బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేయడంతో జిల్లా అధికారులు స్పందించారు. అరటి పంటలను పరిశీలించిన అధికారులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు. తమ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లిన బిగ్ టీవికి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.

3.పాకిస్తాన్ కుట్రలు

భారత్‌లో హింసను ప్రేరేపించేందుకు పాకిస్తాన్ కుట్రలు పన్నుతోంది. సరిహద్దుల మీదుగా డ్రోన్ల ద్వారా భారత్‌లోకి ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే నలుగురు సభ్యుల ముఠాను పట్టుకున్నారు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. వారి వద్ద నుంచి 10 పిస్టళ్లు, 92 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ తుర్కియే, చైనాలో తయారైనవిగా గుర్తించారు.

4. కామారెడ్డి జిల్లాలో నకిలీ ఫైనాన్స్

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నకిలీ ఫైనాన్స్ సీజర్ల ఆగడాలు పెరిగాయి. ఈఎంఐ కట్టిన వాహనాన్ని కూడా సీజ్ చేస్తామని బెదిరించిన నలుగురు నకిలీ సీజర్లను ఒక వాహన యజమాని పట్టుకుని కామారెడ్డి పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. ఫైనాన్స్‌తో ఎలాంటి సంబంధం లేకుండా బెదిరిస్తున్న ఈ నకిలీ సీజర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.

5. భారీగా స్వాధీనం

జైలు పరిచయాలతో టీమ్‌గా ఏర్పడి పలు రాష్ట్రాల్లో దొంగతనాలు చేస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన ‘తార్ టీం’ను నల్లజర్ల పోలీసులు వలవేసి పట్టుకున్నారు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసిన కేసులో ఆరుగురిని అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 3 లక్షల నగదు, 26 గ్రాముల బంగారం, కారు, బైకులను స్వాధీనం చేసుకున్నట్లు కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు.

6.ఖర్చులు తగ్గుతాయి

గ్రేటర్ విశాఖ పరిధిలోని రోడ్లను ప్రైవేటీకరణ చేయడానికి కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు. జీవీఎంసీ పరిధిలోని 88 కిలోమీటర్ల ప్రధాన రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి కౌన్సిల్ తీర్మానించింది. పీపీపీ మోడల్‌లో రోడ్లను ప్రైవేటు వ్యక్తులకు కాంట్రాక్ట్ ఇవ్వడానికి అధికారులు చూస్తున్నారు. రోడ్లను ప్రైవేటీకరణ చేయడం వల్ల జీవీఎంసీ ఆదాయం పెరిగి ఖర్చులు తగ్గుతాయని అధికారులు అంటున్నారు.

7. పోలీసుల అదుపులోకి

అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని గ్లోబల్ ఆసుపత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడింది. వైజాగ్ మహిళ యమునకు కిడ్నీ తొలగిస్తుండగా ఆమె ఫిట్స్ వచ్చి మరణించింది. భర్త ఫిర్యాదుతో గ్లోబల్ అసుపత్రి డాక్టర్ శాశ్వత, ప్రభుత్వ డయాలసిస్ సెంటర్ల పని చేసే కుమార్ నాయక్, బాలులను మదనపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

8. ప్రేయసి కోసం ప్రియుడు ఆత్మహత్య

నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలో ప్రేయసి కోసం ప్రియుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. భర్తకు దూరంగా ఉన్న ధనలక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఏపినాపి గ్రామానికి చెందిన కోటపాటి విష్ణువర్ధన్‌ను, ఆమె కుటుంబసభ్యులు, అనకాపల్లి పోలీసులు తీసుకువెళ్లారు. దీంతో మనస్తాపం చెంది పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతని భార్య, బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు.

9. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

భూపాలపల్లి కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సింగరేణిలో చెట్లు కటింగ్‌కు వెళ్లిన మున్సిపల్ కార్మికుడు బెల్లం రాజయ్య అనుమానాస్పద మృతిపై కుటుంబసభ్యులు, బంధువులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించడంతో, పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

10. నిందితుడు అరెస్ట్

విదేశాల్లో ఉపాధి కల్పిస్తానని నిరుద్యోగులను మోసం చేసిన నిందితుడిని అరెస్ట్ చేశారు జగిత్యాల పోలీసులు. కాకినాడకు చెందిన కెవిన్ ఎడ్విన్.. దుబాయ్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని జగిత్యాల జిల్లా సారంగపూర్‌కు చెందిన నిరుద్యోగిని నమ్మించాడు. యువకుడి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని చేతులెత్తేయడంతో.. మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు.

11.తేలిక పాటి వర్షాలు

దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది 48 గంటల్లో బలపడి 24న వాయుగుండంగా మారవచ్చు. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి దక్షిణ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు అధికారులు. రాష్ట్రమంతటా చలి తగ్గి, పొగమంచు పెరగవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

12. జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

జనసేన నేత కిరణ్ రాయాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భక్తి లేకపోతే తిరుమలకు రాకండని చెప్పారు. తిరుమల పిక్నిక్ స్థలం కాదని, ఇలాంటి వారికి శ్రీవారి దర్శనం చేసుకునే అర్హత కూడా లేదంటూ ఫైర్ అయ్యారు.

13.హిడ్మా ఫ్లెక్సీ.. పోలీసుల దర్యాప్తు

హిడ్మా ఫ్లెక్సీ ఘటనపై కొయ్యడ సురేష్, మ్యాక బుచ్చయ్యలను అరెస్టు చేశారు పోలీసులు. నిషేధిత సంస్థల ఫ్లెక్సీలను సహించబోమని ఏసీపీ ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. యువత చట్ట వ్యతిరేక మావోయిస్టు సిద్ధాంతాలకు సానుభూతి చూపవద్దని కోరారు. హిడ్మా ఫ్లెక్సీ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

14. మంచిర్యాలలో నాయకుల ధర్నా

మంచిర్యాలలో బీసీ జేఏసీ నాయకులు అంబేద్కర్‌ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్‌లో చేర్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని రేవంత్ రెడ్డిని కోరారు.

15. కోరుట్ల ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

జగిత్యాల జిల్లా, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు అడిగేవారిని రోకలి బండతో కొట్టండి అన్నారు. అవసరమైతే జైలుకు వెళ్తానని అన్నారు. పథకాల కోసం ఎవరికీ రూపాయి ఇవ్వొద్దని, అవి మీ హక్కు అని పేర్కొన్నారు.

16. క్రిమినల్ అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఉప్పల సతీష్‌ను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. 23 కోట్ల చీటింగ్ కేసులో ఉప్పల సతీష్ నిందితుడిగా ఉన్నాడు. నెల క్రితమే సతీష్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు.. ముంబై నుంచి తీసుకొస్తుండగా ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తప్పించాడు. సతీష్‌ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని పోలీసుల నుంచి తప్పించినట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో SI శ్రీకాంత్‌ గౌడ్‌ను అధికారులు సస్పెండ్ చేశారు.

17. నాలుగో స్థానంలో

స్పెయిన్‌లో జరుగుతున్న ప్రపంచ మహిళల టీమ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ క్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించింది. మూడు గేమ్‌లో కలిలో వాపై శ్రీజ శేషాద్రి గెలిచి భారత్‌కు విజయాన్ని అందించింది. దీంతో పూల్-బిలో నాలుగో స్థానంలో నిలిచి భారత్ నాకౌట్ చేరింది.

18. ఇంజినీర్ల పై తీవ్ర ప్రభావం

అమెజాన్ ప్రకటించిన 14,000 కార్పొరేట్ ఉద్యోగాల తొలగింపులో ఇంజినీర్లపై తీవ్ర ప్రభావం పడింది. న్యూయార్క్, కాలిఫోర్నియా, న్యూజెర్సీ, వాషింగ్టన్ రాష్ట్రాల్లో తొలగించిన 4,700 మందిలో 1,800 మంది ఇంజినీర్లే ఉన్నారు. AIపై ఖర్చు, అనవసర లేయర్లు తొలగించి, కొత్త పంథాలో ముందుకు వెళ్లడంలో భాగంగానే ఈ లేఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ తెలిపింది.

19. ఇఫి వేడుకలు

రాజమౌళి దర్శకత్వంలో మహేశ్‌ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి మూవీ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది. గోవా వేదికగా జరుగుతూన్న ఇఫి వేడుకలకు హాజరైన సంగీత దర్శకుడు కీరవాణి, ఈ చిత్రంలో అభిమానులు అద్భుతమైన సంగీతాన్ని వింటారని వెల్లడించారు. ‘వారణాసి’లో మొత్తం ఆరు పాటలు ఉంటాయని, ఇప్పటికే ‘రణ కుంభ’ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోందని తెలిపారు.

20. చెలరేగిన హెడ్

యాషెస్ సిరీస్‌లో భాగంగా పెర్త్‌లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ కేవలం 69 బంతుల్లోనే శతకంతో చెలరేగాడు. మార్నస్ లబుషేన్ అర్థ శతకంతో రాణించగా, ఆస్ట్రేలియా విజయం సాధించింది.

Related News

ఉదయం లేవగానే అలసట, కాళ్ల నొప్పులు ఎందుకు వస్తాయో తెలుసా ?

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. మే హైలెట్ ఎపిసోడ్స్..

Brahmamudi Serial Today Episode May 26th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు షాక్ ఇచ్చిన ఇందు

తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరడం ఖాయం.. ఎంపీ ఈటల రాజేందర్ ధీమా

ఎంత స‌తాయిస్తే.. అంత విజ‌య్‌కే మేలు.. ! దేశం మొత్తం త‌ల‌ప‌తి స్థితిపై సానుభూతి!!

మంత్రి హోదాలో తుమ్మల 40 వసంతాల వేడుక!

Podarillu Today Episode : నారాయణకు దిమ్మతిరిగే షాక్.. డ్యాన్స్ లతో సందడి.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రతాప్..

జేమ్స్ కామెరాన్‌కు గట్టి ఎదురుదెబ్బ.. అవతార్ లాభాల్లో వాటా డిమాండ్ చేస్తున్న నటి

Big Stories

×