Temples : సొంత ఇల్లు ఈ భూమ్మీద ఉండే ప్రతీ ఒక్కరి కల. చిన్నదో, పెద్దదో ఏదో ఒక ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాడు. అయితే ఈ కల అందరికి నెరవేరదు. డబ్బు లేక కొందరు ఇల్లు కట్టుకోలేరు. మరికొందరికి డబ్బులున్నా పరిస్థితులు అనుకూలంగా ఉండవు. జాతకంలో రాసిపెట్టి ఉంటేనే గృహ యోగం కలుగుతుందట. దేవాలయాలు పరిసరాల్లోని తీర్థాల్లో రాళ్లు పేరుస్తుంటారు కొందరు. అలా చేస్తే గృహయోగం కలుగుతుందని నమ్ముతుంటారు. పైగా ఎంత ఎత్తు రాళ్లు పేరిస్తే అన్ని అంతస్థుల ఇల్లు కడతారని, ధన శక్తి అలా కిందికి పారే జలపాతంలా వచ్చేస్తుందని అంటారు.
సింహగిరిపై కొలువైన స్వామి వారి ఆలయ ప్రాంగణంలో రాయి పై రాయి పేర్చి భక్తులు స్వామివారికి మొక్కడం వల్ల వారికి సొంత ఇంటి కల నెరవేరుతుందని విశ్వసిస్తారు.ఈ ఆలయ ప్రాంగణంలో ఎటు చూసినా మనకు ఈ విధమైనటువంటి రాళ్లతో కట్టిన ఆలయాలు దర్శనమిస్తాయి.
అయినా పుణ్య ప్రదేశాలలో రాళ్ళు పేర్చితే గృహ యోగం కలుగుతుంది అనేది కొందరి నమ్మిక. కానీ అలా జరిగిన దాఖలాలు ఎక్కడా దొరకలేదు. ఎవరో ఇలాంటివి మొదలు పెడతారు. ఇక ఆ తర్వాత కొందరు అనుసరిస్తారు. చివరికి ఇదో సంప్రదాయం అయిపోతుంది. వయసులో ఏదో ఒక దశలో సొంతిల్లు అవసరమని అనిపిస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన తర్వాత సొంతిల్లు అక్కర మరింత తెలుస్తుంది.