Big Stories

Tesla : ఆపిల్ కు దీటుగా టెస్లా “పై”!

Tesla : టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మొబైల్ ఫోన్ బిజినెస్ లోకీ అడుగుపెట్టబోతున్నారు. “పై” పేరుతో తొలి స్మార్ట్ ఫోన్ ను వచ్చే డిసెంబర్లో మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు. ఆ ఫోన్‌ ఫీచర్లు, ధరలపై సోషల్‌ మీడియాలో ఓ రేంజ్ లో ఊహాగానాలు సాగుతున్నాయి.

- Advertisement -

“పై” స్మార్ట్ ఫోన్… 5000 mah బ్యాటరీ, 6.7 అంగుళాల OLED టచ్ స్క్రీన్, 1284*2778 పిక్సెల్‌ రెజెల్యూషన్‌, 458 పీపీఐ డెన్సిటీ, 120 Hz రీఫ్రెష్‌ రేట్‌, ఒలియోఫోబిక్‌ కోటింగ్‌తో స్క్రాచ్‌ రెసిస్టెంట్ గ్లాస్ ప్రొటెక్షన్ తో తయారవుతోందని చెబుతున్నారు. ఫోన్‌ వెనుక మూడు కెమెరాలు ఉండగా.. ఒక్కో కెమెరా రెజెల్యూషన్‌ 50 మెగా పిక్సెల్‌. ఫేస్‌ డిటెక్షన్‌ ఆటోఫోకస్‌, డ్యూయల్‌ ఎల్‌ఈడీ టోన్‌ ఫ్లాష్‌, హెచ్‌డీఆర్‌, హై క్వాలిటీ వీడియో కంప్రెషన్‌ కోసం ప్రోరెస్‌ ఫార్మాట్‌, సినిమాటిక్‌ మోడ్‌, స్టెరో సౌండ్‌ రికార్డింగ్‌ ఫీచర్లు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

- Advertisement -

ఇక ఫోన్‌ ముందు భాగంలో 40 మెగా పిక్సెల్‌ సింగిల్‌ పంచ్‌ హోల్‌ కెమెరా, కదులుతున్న వాటిని స్టిల్‌ ఫోటోలుగా క్యాప్చర్‌ చేసే గైరో స్కోప్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ వంటి ఫీచర్లు ఉన్నాయని టెక్ జనాలు కోడై కూస్తున్నారు. పై కోసం టెస్లా సొంతంగా గ్రాఫిక్స్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను తయారు చేసిందని… ఈ ఫోన్‌ ధర రూ.70వేల నుంచి రూ.80వేల మధ్యలో ఉండబోతోందని చెబుతున్నారు. అదే నిజమైనతే… ఆపిల్ సహా శాంసంగ్ హైఎండ్ ఫోన్లకు గట్టి పోటీ ఎదురైనట్లే.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News