Big Stories

Twitter Blue Tick : ట్విట్టర్ బ్లూ టిక్‌కు నెలకు రూ.650

Twitter Blue Tick : ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్… బ్లూ టిక్ యూజర్లకు భారీగా వడ్డించాడు. నెలకు 8 డాలర్లు… అంటే మన కరెన్సీలో 650 రూపాయలు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశాడు. ఆ లెక్కన ఏడాదికి… దాదాపు 8 వేలు సమర్పించుకోవాలన్న మాట. అంతేకాదు… ఈ ధర దేశాన్ని బట్టి మారుతుందని… ఆయా దేశాల ‘పర్చేజింగ్‌ పవర్‌ పారిటీ’కి తగ్గట్టు ధరను నిర్ణయిస్తామన్నాడు… మస్క్. నెల వారీ ఫీజు చెల్లించే వారికి బ్లూ టిక్‌తో పాటు… రిప్లై, మెన్షన్‌, సెర్చ్‌ వంటి ఫీచర్లలో ప్రాధాన్యం ఉంటుందన్నాడు… మస్క్. స్పామ్‌ను అడ్డుకోవడానికి ఈ ఫీచర్లు అవసరమని… లార్జ్ వీడియో, ఆడియోలను పోస్ట్‌ చేసే అవకాశాన్ని కూడా కల్పిస్తామన్నాడు. ప్రకటనలూ సగానికి తగ్గుతాయని… అలాగే తమతో ఒప్పందం కుదుర్చుకున్న పబ్లిషర్ల ఆర్టికల్స్‌కు పేవాల్‌ బైపాస్‌ కూడా ఉంటుందని చెప్పాడు… మస్క్.

- Advertisement -

ట్విట్టర్ బ్లూ టిక్‌కు నెలకు 8 డాలర్లు వసూలు చేయడంపై అప్పుడే విమర్శలు కూడా మొదలయ్యాయి. కానీ… ఎవరేమన్నా తాను పట్టించుకోనని… బ్లూ టిక్‌కు రుసుము చెల్లించాల్సిందేనని తేల్చేశాడు… మస్క్. అంతేకాదు… తన ట్విటర్‌ బయోను ‘ట్విటర్‌ కంప్లైంట్‌ హాట్‌లైన్‌ ఆపరేటర్‌’గా మార్చుకున్నాడు.

- Advertisement -

మరోవైపు… నిషేధించిన ఖాతాల అంశంపైనా స్పందించిన మస్క్… కొన్ని వారాల పాటు వాటిని పునరుద్ధరించే అవకాశం లేదని ట్వీట్ చేశాడు. దాంతో… గతంలో నిషేధానికి గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విట్టర్ ఖాతా… ఇప్పట్లో యాక్టివేట్ అయ్యే ఛాన్స్ లేనట్టే. విద్వేషం, వేధింపులపై పోరాటం, ఎన్నికల సమగ్రతను కాపాడే పాలసీలను కొనసాగించి తీరతామని చెప్పాడు… మస్క్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News