OTT Movies : బాలీవుడ్ లో ఈ మధ్య విడుదల అవుతున్న సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.. థియేటర్లలోనే కాదు ఓటిటిలో కూడా వరుసగా సినిమాలను రిలీజ్ చేస్తున్నారు బాలీవుడ్ సినీ ప్రముఖులు. మిగిలిన భాషలతో పోలిస్తే బాలీవుడ్ లో వెబ్ సిరీస్ లు కూడా ఎక్కువగానే ఉన్నాయి.. కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలోకి డైరెక్ట్ గా వచ్చి మంచి టాక్ని సొంతం చేసుకుంటున్నాయి.. తాజాగా మరో సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవ్వబోతుంది.. ఆ మూవీ పేరేంటో? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..
మూవీ & ఓటీటీ..
బాలీవుడ్ సీనియర్ యాక్టర్ పరేశ్ రావల్, ఆదిల్ హుసేన్ ప్రధాన పాత్రల్లో ‘ది స్టోరీటెల్లర్’ చిత్రం రూపొందింది. ఈ మూవీ దర్శకుడు సత్యజిత్ రే రచించిన ఓ కథ ఆధారంగా ఈ మూవీ రూపొందింది. కేవలం డైరెక్టర్ వల్లే ఈ సినిమాకు మంచి క్రేజ్ వచ్చింది. ఇక మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రతి అప్డేట్ కూడా సినిమాపై భారీ హైఫ్ ను క్రియేట్ చేశాయి. నిజానికి ఈ మూవీ ఈరోజు నుంచి ఓటిటిలో స్విమ్మింగ్ కి రావాల్సి ఉంది కానీ ఇంకా రాలేదు. అంత ఫాన్స్ అందరు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ పై ప్రశ్నలు కురిపిస్తున్నారు. అయితే, ఎట్టకేలకు సాయంత్రం ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టింది.. ఇక ఈ మూవీ కొద్ది గంటల క్రితమే స్రీమింగ్ కు వచ్చింది. ముందుగా 28వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురాన్నట్టు డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్రకటించింది. దీంతో ఈ చిత్రం కొందరు వేచిచూశారు. అయితే, నేడు మధ్యాహ్నం అయినా ఇంకా ఈ మూవీ హాట్‍స్టార్‌లో అందుబాటులోకి రాలేదు. ఇక ఆలస్యంగా సాయంత్రంగా ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చేసింది..
మూవీ స్టోరీ విషయానికొస్తే..
బాలీవుడ్ ప్రముఖ రచయిత సత్యజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. గోల్పో బోలో తరిని ఖురో’ ఆధారంగా ది స్టోరీటెల్లర్ మూవీ రూపొందింది. స్నేహం, వ్యక్తిత్వం, మోసం అంశాల చుట్టూ ఈ స్టోరీ సాగుతుంది.. ఒక మాటలో చెప్పాలంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లకు బాగా కనెక్ట్ అవుతుంది. హృదయాలను హత్తుకునేలా స్టోరీ ఉంటుందని తెలుస్తుంది. పరేశ్ రావల్, ఆదిల్ హుసేన్ సహా అనిందిత బోస్, రేవతి, తనిష్ఠ ఛటర్జీ, జయేశ్ మోర్, రోహిత్ ముఖర్జీ కీలకపాత్రలు పోషించారు. జ్యోతి దేశ్‍పాండే, సలిల్ చతుర్వేది, సచ్ఛేంద్ర ఛటర్జీ, శుభ శెట్టి ఈ మూవీని నిర్మించారు. హృజు రాయ్ మ్యూజిక్ ఇచ్చారు.. ఎమోషనల్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవల రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ రిలీజ్ అయినా మొదటి నిమిషం నుంచి ఇప్పటివరకు బాగా ట్రెండ్ అవుతుంది. ఎమోషనల్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది.. ట్రైలర్ అయితే ప్రేక్షకులను ఆకట్టుకుంది మరి ఈ సినిమా ప్రస్తుతం ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతుంది.. ఇక్కడ ఎలాంటి టాక్ ను అందుకుంటుందో చూడాలి..